ఆన్ లైన్ జువెలరీ మార్కెట్లో కొత్త ప్లేయర్ ‘Rocha Fashion’

ఆన్ లైన్లో డిజైనర్ జువెలరీ ఆఫర్ చేస్తున్న ‘Rocha Fashion’గుజరాత్ నుండి ప్రారంభమై ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ వరకు విస్తరించే ప్రయత్నం.తమ్ముడు, ఫియాన్సీతో కలిసి కంపెనీ నడుపుతున్న సాగర్ షా.

ఆన్ లైన్ జువెలరీ మార్కెట్లో కొత్త ప్లేయర్ ‘Rocha Fashion’

Sunday June 28, 2015,

2 min Read

ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించిన ‘రోచా ఫ్యాషన్’, డిజైనర్ జెవెలరీ మీద దృష్టి పెట్టింది. ఈ కంపెనీని సాగర్ షా ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో తన గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకుని, రెండేళ్ల పాటు ఉద్యోగం చేసాక ఇండియా తిరిగొచ్చిన సాగర్, ఇక్కడ వ్యాపార అవకాశాల కోసం వెతకడం ప్రారంభించారు.

image


ఇదంతా ప్రారంభంకావడానికి కారణం, ఓ సారి తన ఫియాన్సీ కోసం తెచ్చిన సాంపిల్స్, బంధువులందరికి నచ్చేసింది. ఎంతగా అంటే వాళ్లంతా అలాంటి డిజైనర్ జువెలరీ తెస్తే ఎక్కవ ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు.

సాగర్ షా

సాగర్ షా


అలాంటి ప్రాడక్ట్ డిజైన్స్ వారి ప్రత్యేకత అంటున్నారు షా. అంతే కాకుండా ఇలాంటి డిజైనర్ జువెలరీని డెయిలీ సీరియల్ యాక్ట్రెస్ కూడా వాడుతారంటున్నారు. పోటీదారులకన్నా తక్కువ రేటే మా ప్రత్యేకత అంటారు.

తన తమ్ముడు వరుణ్ తో పాటు ఫియాన్సీ రుతు, షా కు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కాలేజ్ లోనే ఉన్న వరుణ్, కస్టమర్ సర్విస్ చూసుకుంటున్నారు. ప్రోగ్రామింగ్ బ్యాగ్రౌండ్ లేకపోయినా, Rocha Fashion వెబ్ సైట్ ని ఒకే రోజులో డెవలప్ చేసుకున్నామంటున్నారు సాగర్.

ఇండియన్ మార్కెట్ గురించి ఎంతో నేర్చుకున్నామంటున్న వీరు, క్యాష్ ఆన్ డిలివరి సిస్టమ్ లో చాలా రిస్క్ ఎదుర్కొన్నారు. ప్రారంభంలో ఇతర ఆప్షన్స్‌తో పాటు క్యాష్ ఆన్ డిలివరీ ఆప్షన్ కూడా ఆఫర్ చేసారు, కాని అందులో ఇబ్బందులు రావడంతో , ఆ ఆప్షన్ ని తీసేసారు.

ఈ ఏడాది మూడింతలు ఎక్కువ ఆర్డర్స్ ఆశిస్తున్న వీళ్లు, ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. ప్రారంభంలో ప్రధాన సమస్య కస్టమర్లను ఆకర్శించడం. ప్రకటనలపై ఎంతో ఖర్చు పెట్టినా, చాలా మంది సేల్స్ పూర్తి చేయడంలేదని తెలిసింది. ఇదంతా పరీక్షించడానికి, ఆర్డర్ చేసి పేమెంట్ పూర్తి చేయని కస్టమర్లను నేరుగా కాల్స్ చేయడం ప్రారంభించాము, అలా నమ్మకం కుదిరి చాలా మంది కొనడం ప్రారంభించారు.

ఇక మరో సారి వీరు ఎదురుకున్న సమస్య అకస్మాత్తుగా ఆర్డర్లు పెరిగిపోయినప్పుడు, టీమ్ లో ఉన్న ముగ్గురే సప్లై, ఆర్డర్ హ్యాండ్లింగ్, కస్టమర్ సర్విస్ , మార్కెటింగ్ కూడా చూసుకోవాల్సిన పరిస్ధితి.

చివరికి ప్రాడక్ట్ సమయానికి డెలివరి అవ్వడంతో పాటు కస్టమర్ సంతోషంగా ఉన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందని అంటారు. ఈ వ్యాపారాన్ని ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కు కూడా విస్తరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా విషయంలో చర్చలు జరుగుతున్నాయని అంటున్న సాగర్, ఎదుగుతున్నా కొద్ది ఎంతో నేర్చుకున్నామని కూడా అంటున్నారు. ఇక వెబ్సైట్ పై ఆకర్శించగలిగితే క్లైంట్స్ తో మంచి రిలేషన్స్ మేంటేన్ చేయోచ్చని అంటున్నారు.

ప్రస్తుతానికి ఆర్గనైజ్డ్ ఇండియన్ జువెలరీ పరిశ్రమ కేవలం 6 శాతమే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రాబోయే 4 ఏళ్లలో 41 శాతం సగటు వార్షిక వృద్ధితో ఎదుగుతుందని భావిస్తున్నారు. McKinsey రిపోర్ట్ ప్రకారం 2010 లో బ్రాండెడ్ జువెలరీ మార్కెట్ సుమారు 2.2 బిలియన్ డాలర్లు ఉంది, మరికొన్ని సంవత్సరాల్లో ఈ పరిశ్రమ మరింత ఎదుగుతుందని భావిస్తున్నారు.