బాక్స్ అంత స్థలాన్నీఅద్దెకు ఇస్తామంటున్నగోబాక్స్ మి

స్టోరోజ్ మార్కెట్‌లో కొత్త ఐడియాఊరు వదిలేసివెళ్లాల్సొచ్చే వాళ్లకి వరంనచ్చిన వస్తువు పదికాలాలు పదిలంగా దాచాలనుకువారికి సాధనంఅతి తక్కువ ఛార్జ్‌కే పదిలంగా విలువైన వస్తువులు ఒక్కో ఘనపుటడుగుకు రుసుము రూ. 12 మాత్రమేబాక్స్‌లో వస్తువులకు బీమా సౌకర్యం కూడా

బాక్స్ అంత స్థలాన్నీఅద్దెకు ఇస్తామంటున్నగోబాక్స్ మి

Saturday April 11, 2015,

3 min Read

"బాక్స్‌మి.. ఈ ఆలోచన శ్రీరాంకి తమ కుటుంబం బెంగుళూరుకు మారాల్సొచ్చిన టైంలో వచ్చింది. ఆ సయమంలో వాళ్ల దగ్గర 35 ఏళ్లుగా పోగు చేసిన అరుదైన వస్తువులున్నాయి. వాటిలో చాలావాటితో ఆ కుటుంబసభ్యులకు సుదీర్ఘ అనుబంధం ఉంది. బహుమతులుగా వచ్చినవి కొన్నైతే.. తరతరాలుగా దాచుకున్నవి మరికొన్ని. తాతల కాలం నాటి డైరీలు, పుస్తకాలు, ఫోటోలు... ఇలా ఎన్నో వెలకట్టలేని వస్తువులు. వీటన్నిటినీ బెంగుళూరుకు తరలించడమంటే... అక్కడి అద్దెలను భరించడం చాలా కష్టం. వాటి అమ్మేయాలి లేదా భద్రపరచాలి." - అఖిల్ మోహనన్, బాక్స్‌మీ సీఓఓ


శ్రీరాం దండపాణి, అఖిల్ మోహనన్ - గో బాక్స్ మి వ్యవస్థాపకులు

శ్రీరాం దండపాణి, అఖిల్ మోహనన్ - గో బాక్స్ మి వ్యవస్థాపకులు


సమస్యే వ్యాపారానికి నాంది

ఉద్యోగాల కోసమో, శాశ్వత నివాసం కోసమో ఇల్లో, ఊరో మారుతున్నపుడు ఈ సమస్య చాలా మందికి వచ్చేదే. కానీ అందరూ ఆయా వస్తువుల్లో ప్రాధాన్యం ఉన్నవాటిని మిగతావాటిని అమ్మేయడం కానీ, పారేయడం కానీ చేస్తుంటారు. ఈ సమస్యకి పరిష్కారం ఆయా వస్తువులను పూర్తి స్థాయిలో అత్యంత జాగ్రత్తగా భద్రపరచడమే. ప్రస్తుతం ఈ తరహా సేవలందిస్తున్నాయి బాక్స్ మై స్పేస్ వంటి కంపెనీలు. తాజాగా బాక్స్‌మీ అనే సంస్థ కూడా ఎంటరైంది ఈ విభాగంలోకి. కస్టమర్ల సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతామంటున్నాయి ఈ స్టోరేజ్ సంస్థలు.

శ్రీరాం దండపాణి, అఖిల్ మోహనన్, అరవింద్, అజయ్ శ్రీధరన్‌లు బాక్స్‌మీని ప్రారంభించారు. బాక్స్ మై స్పేస్, బాక్స్‌మీలు రెండూ స్టోరేజ్ సమస్యల ఆధారంగా ప్రారంభమైనవే. మిగతావాటిలా కాకుండా.. కస్టమర్లు ఉపయోగించుకునే విస్తీర్ణానికే ఛార్జ్ చేస్తామని చెబ్తున్నారు వీళ్లు. 'వినియోగదారుడి వస్తువు ఎంత స్పేస్ ఉపయోగించుకుంటుందే దానికి మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఉదాహరణకు ఒక టేబుల్ 10ఘనపుటడుగులుంటే దానికి మాత్రమే రుసుము వసూలు చేస్తా'మంటున్నారు అఖిల్.

ప్రతీ ఒక్కరి ప్రాబ్లెం ఇది

"శ్రీరాంకి వచ్చిన ఆలోచనపై ఎంతో కసరత్తు చేశాం. ఆలోచన పంచుకున్నపుడు.. నాకూ ఇదే సమస్య గతంలో వచ్చిందనే విషయం గుర్తుకొచ్చింది. స్టోరేజ్ సామర్ధ్యం పెంచే అవకాశం లేక, అన్ని వస్తువులనూ ప్రతీచోటకీ తీసుకెళ్లే ఛాన్స్ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తించాం. పబ్లిక్ స్టోరేజ్ అనే విధానం మనకి అంతగా తెలీదు. అందుకే ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఈ అంశంపై చాలా పరిశోధన చేశాం. 2014 నవంబర్‌లో కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించాం. మాకు పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకుగానూ మా కాలేజ్ ఫ్రెండ్ అరవింద్ సహాయం తీసుకున్నాం. అతను అజయ్‌ని పరిచయం చేశాడు. నలుగురం కలిసి బాక్స్‌మీ ప్రారంభించామించా”మని చెబ్తున్నారు అఖిల్.

స్పీడ్‌కి బ్రేకేసే అడ్డంకులు

వ్యక్తిగతం, వ్యాపారం... రెండు విభాగాల్లోనూ సేవలందించేందుకు సిద్ధమయ్యింది బాక్స్‌మీ. చాలామంది ఈ ఆలోచనని సమర్ధించినా.. కనీసం ప్రయత్నించేవాళ్లు కూడా కరువవడం కొంత ఇబ్బందులు సృష్టించింది వ్యాపారానికి. ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ విషయాల్లో చాలామందికి అనుమానాలు తలెత్తాయంటారు అఖిల్. తాము ఎదుర్కున్న తొలి సవాల్ ఇదేనని చెబ్తారాయన.

స్నాప్‌డీల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వస్త్ర వ్యాపారం చేసే ఒక వ్యక్తిని కలిసినపుడు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు అఖిల్. ఇంటినే తన వేర్‌హౌస్‌గా ఉపయోగించుకుంటున్నానని, తనకిప్పుడు అదనపు స్టోరేజ్ అవసరం లేదని చెప్పాడా వ్యాపారి. అదే సమయంలో తన వస్తువుల నిర్వహణ ఇతరులకు అప్పగించడం ఇష్టపడని అంశాన్ని కూడా గుర్తించామని... ఈ తరహా ఆలోచనలు మారాల్సి ఉందని, త్వరలోనే ఆ నమ్మకం కలింగించేలా చర్యలు చేపడతామని చెబ్తున్నారు అఖిల్.

అలాగే పెద్దకంపెనీలు ఇప్పటికే గోడౌన్లు నిర్వహిస్తుంటాయి. ఒక వేళ స్పేస్ చాలకపోతే థర్డ్ పార్టీ సేవలు, ఇతరుల వేర్‌హౌస్‌లలో కొంతకాలం ఉంచేలా ఏర్పాట్లు చేసుకుని ఉంటారు. అయితే చిన్న వ్యాపారులకు, వ్యక్తులకు, ఎస్ఎంఈలకు ఇది సాధ్యం కాదు. అందుకే ఈ విభాగాన్నే మొదట తమ టార్గెట్‌గా చెబ్తారు బాక్స్‌మీ నిర్వాహకులు. గోడౌన్ నిర్వహణను ఇతరులకు అప్పగించేందుకు ఒప్పించడం కత్తిమీద సామే అన్నది వీరి వాదన.

ఎలా పని చేస్తుందంటే...

వ్యక్తిగత సామాన్ల భద్రపరచడంతోనే ఈ వ్యాపారం ప్రారంభమైంది. తమకు అవసరమైనంత స్పేస్ తీసుకుని... తాము సొంతంగా నిర్వహించుకునే వెసులుబాటు ఆయా వ్యక్తులకుంటుంది. ఇక్కడ ఉంచే వస్తువులకు కనీసం ఇంతకాలం ఉంచాలనే వ్యవధి కానీ, ముందస్తు చెల్లింపులు కానీ అవసరం లేదు. అవసరమైన స్పేస్ బుక్ చేసుకోవడం కూడా తేలికే. ఆన్‌లైన్‌లో సైనప్ చేసిన తర్వాత.. ఎంత స్పేస్ కావాలో చెబ్తే సరిపోతుంది. ఇద్దరికీ కుదిరిన సమయంలో బాక్సులు ఇంటికే డెలివరీ అవుతాయి. ఇవన్నీ ఆయా వ్యక్తుల వద్దే టాంపర్ చేయలేని విధంగా సీల్ చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసం కస్టమర్‌కి ఆ బాక్స్ ఐడీని కూడా ఇస్తారు.

“వెంటనే కాకుండా... కొంత కాలం తర్వాత వాటిని తీసుకోదల్చిన వారికోసం వేలుముద్ర(ఫింగర్ ప్రింట్) స్కానర్లను త్వరలో ఏర్పాటు చేసే యోచన కూడా ఉందం”టున్నారు అఖిల్. అంతే కాదు. ఒక్కో బాక్స్‌కీ రూ. 9,999 బీమా రక్షణ ఉంటుంది కూడా. ఒకవేళ కస్టమర్ అంతకుమించి ఇన్సూరెన్స్ కోరితే అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి బాక్స్‌మీ దగ్గర.


తమ బాక్సులతో నిర్వాహకులు

తమ బాక్సులతో నిర్వాహకులు


భవిష్యత్ ప్రణాళికలు

వ్యక్తులు, వ్యాపారులు తమ దగ్గర ఉంచిన వస్తువులపై పూర్తి నిర్వహణ చేసుకోగలిగేలా ప్రయత్నిస్తున్నారు. వాళ్లకి పూర్తి స్థాయి సౌకర్యాలు, అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెబ్తున్నారు వీళ్లు. ఆయా బాక్సులు ఉంచాల్సిన ఉష్ణోగ్రత, నిర్వహణ, 

కోల్డ్ స్టోరేజ్, ఇన్సూరెన్స్, డెలివరీ... ఇలా అన్ని విభాగాల్లోనూ కస్టమర్ల కోరిక, అవసరాలకు అనుగుణంగా కంపెనీని తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్న చాలామందికి బిజినెస్ టూ బిజినెస్(B2B) సేవలు అందించే రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని భావిస్తోంది బాక్స్‌మీ. గ్రాడ్యుయేట్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక సేవలందించే ఆలోచన కూడా ఉంది ఈ కంపెనీకి. ఇంత సులువుగా స్టోరేజ్ సేవలందిస్తున్న ఈ కంపెనీ ఛార్జ్ చేసేందెంతో తెలుసా... ఒక్కో ఘనపుటడుగు పరిమాణానికి నెలకు రూ.12. అదే బాక్స్ అయితే.. నెలకు రూ.79 మాత్రమే.

వెబ్‌సైట్ : www.goboxme.com