ఈ చాయ్‌వాలా ప్రధాని కాలేదు కానీ... 24 పుస్తకాలు రాసి పబ్లిషర్ అయ్యాడు !

గ్రంథపఠనం చేసేవారికి నిజమైన రచయిత ఆయన ..రోడ్డు పక్కన టీ అమ్ముతూనే 24 నవలలు రాసిన లక్ష్మణ రావు..రోజుకి 100కిలోమీర్లు సైకిల్ తొక్కుతూ వాటి అమ్మకం..చిన్నతనంలో 40రూపాయిలతో ఇంటినుంచి పారిపోయిన రావు..

ఈ చాయ్‌వాలా ప్రధాని కాలేదు కానీ... 24 పుస్తకాలు రాసి పబ్లిషర్ అయ్యాడు !

Friday May 29, 2015,

7 min Read

చాయ్ వాలా.. మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిన పదం ఇది. మోదీ గతంలో చాయ్ వాలాగా పనిచేశారట. మోదీ కనుక ప్రధాని కాగలిగారు. దేశంలో ఉండే చాయ్ వాలాలు అలానే మిగిలిపోతున్నారు. మనం దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడంతో వాళ్లంటే మనకు చిన్న చూపు. మన దేశంలో కళాకారులను కూడా గుర్తించలేకపోతున్నాం. అలాంటి కళాకారుడి కథే ఇది. 24నవలలు. అందులో 12ముద్రించినవి. మరో 6 రీప్రింట్ కి వెళ్లాయి. వీటిల్లో ఒకటి రామ్ దాస్ , ఇంద్రప్రస్థ సాహిత్య అవార్డును పొందింది. 62ఏళ్ల లక్ష్మణ రావు రాసిన గ్రంధాలివి. తాను టీనేజిలో ఉన్నప్పటి నుంచి రేఖాచిత్రాలను వేస్తున్నారు. ఈ రేఖాచిత్రాల పుస్తకాలే లక్ష్మణ్‌ను ఇంతవారిని చేసింది. 1979 లో తన మొదటి పుస్తకాన్ని ఆయన పబ్లిష్ చేశారు. అప్పుడే అతన్ని లేఖక్ జీ(చిత్ర లేఖనం చేసే వారు) అని అంతా సంభోదించారు. అది అతన్ని చాలా సంతోష పెట్టింది.

చాయి చేస్తూ లక్ష్మణరావు

చాయి చేస్తూ లక్ష్మణరావు


ఇదంతా నాణేనికి ఒక వైపే. మరోవైపు చూస్తే రావు అంటే ఢిల్లీ లో రోడ్డు పక్కన టీ అమ్ముకునే చాయ్ వాలా. పుస్తకాలు రాయడం రావు గారికి ఇష్టం. అయితే ఇది తన ఆకలిని తీర్చలేకపోయింది. తన కుటుంబ పోషణ కోసం టీ అమ్మారు. దాదాపు 25 ఏళ్లుగా తాను టీ అమ్ముతూనే ఉన్నారు. టీ అమ్మడానికి ముందు ఆయన కప్పులు కడిగే పని కూడా చేశారు. ఇంటినిర్మాణ కార్మికుడిగా, ఇంట్లో పనివాడిగా కూడా చేశారు. ఇలాంటి పనులు చేస్తూనే రాయడంపై ఉన్న మక్కువతో పుస్తకాలను రాయడం మొదలు పెట్టారు. దేశంలో కళాకారులకు గుర్తింపు లేదనే బాధను ఎలాంటి మొహమాటం లేకుండా వెళ్లగక్కుతారు.

ఇంగ్లీష్ లో రచనలు చేసే రిచ్ అండ్ ఫేమస్ రైటర్లకు, రావు మాదిరి హిందీ లేదా ఇతర భాషల్లో రచనలు చేసే పేద రచయితల మధ్య అంతరం ఎంతుందో లక్ష్మణరావు ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు.

గుర్తించదగిన మరో విషయం ఏంటంటే రావు మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు. గ్రంథపఠనం చేసేవారి నిజమైన రచయిత ఆయన. తన రచనలు జనం చదువుతున్నంత కాలం తాను హ్యాపీయే అంటారాయన. ప్రతి రోజు ఉదయం ఢిల్లీలో ఈ చివర నుంచి ఆ చివరకి దాదాపు 60కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ మీదే ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో విద్యాలయాలు, గ్రంధాలయాలకు పుస్తకాలను చేర్చాలనే ప్రయాస ఉంది. రచనలు అమ్మే సమయంలో అతనే రచయిత అనే విషయాన్ని గుర్తించడం కూడా చాలా అరుదు. ఆ మాత్రం గుర్తింపు చాలంటారాయన.

పొట్టకూటి కోసం చాయ్ వ్యాపారం చేయక తప్పదు

పొట్టకూటి కోసం చాయ్ వ్యాపారం చేయక తప్పదు


''ఒకసారి నావైపు చూడండి. ఎవరూ నేను పుస్తకం రాసానని అనుకోరు. నా సైకిల్ని మాత్రమే వారు చూస్తారు. మట్టి పట్టిన నా దుస్తులు చూస్తారు. నేను సైకిల్ పై తిరిగే ఓ సాధారణ వ్యక్తినే అనేది వారి అభిప్రాయం. దానిపై నేనెలాంటి ఫిర్యాదు చేయననుకోండి. ఎవరైనా మాటల ప్రస్థావనలో రచయిత ఎవరని అడిగితే అప్పుడు నేనే అని చెబుతాను. అప్పటి దాకా నాకు నేనుగా రచయిత అని పరిచయం చేసుకోనని చెప్పుకొచ్చారు'' లక్షణ రావు. 

ఒక సందర్భంలో తనే రచయిత అని తెలిసాక వెంటనే లేచి నిలబడ్డారట అక్కడున్న వారంతా. తమ పక్కన కుర్చిలో కూర్చో బెట్టుకొని. టీ తాగమని మొహమాటం పెట్టారట.

తోసిపుచ్చిన పబ్లిషరు

జీవితంలో మర్చిపోలేని అవమానం ఇప్పుడు రావుని పబ్లిషర్ గా మార్చింది. ఒక పబ్లిషరు రావుని తక్కువ చేసి మాట్లాడాడు. తన దగ్గరున్న స్క్రిప్టు చూడకుండానే తనని ఆఫీసు నుంచి గెంటేసాడు. అదే రోజు తన పుస్తకాన్ని తానే సొంతంగా ముద్రించి,మార్కెట్, ప్రమోట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక పుస్తకం తాలూకు వేయి ప్రతులను ముద్రించడానికి పాతిక వేలు ఖర్చుచేశారు. పుస్తకం అమ్మకంతో వచ్చిన ప్రతి రూపాయి వేరే పుస్తకం ముద్రించడానికే ఉపయోగిస్తానని అంటున్నారు. ఎలాగైనా తన మిగతా 13 పుస్తకాలను రాబోయే రోజుల్లో ముద్రించి తీరుతానని బల్లగుద్ది చెబుతున్నారు. భారతీయ సాహిత్య కళా పబ్లికేషన్ పేరుతో ఒక ముద్రణాలయాన్ని రిజిస్టర్ చేశారు. దీనికి ఐఎస్బిఎన్ నంబర్ కూడా ఉంది.

ఆ సంఘటన తర్వాత, రావు మరికొన్ని సాహిత్య సంస్థల దగ్గరకు వెళ్లారు. అక్కడ కూడా అదే అనుభవం ఎదురైంది. కనీసం తన రచనల్ని చూడకుండానే పొమ్మన్నారట. తన స్థితి చూస్తే అప్పుడప్పుడే తనకే నవ్వొస్తుందట. మరి వారు తనని ఆమాత్రం గుర్తించలేకపోవడం వారితప్పుకాదంటారు. తర్వాత తన గ్రాడ్యూయేషన్ పూర్తి చేడయానికి చాలా కష్టపడ్డారు. కనస్ట్రక్షన్ లేబర్ గా పనిచేస్తూ దూరవిద్యాకోర్సులో డిగ్రీ అప్లై చేశారు. పగలు పనిచేసి రాత్రుళ్లు వీధి దీపాల కింద చదువుకున్నారు. తన 42వ ఏట డిగ్రీ పట్టా పొందారు. కానీ జనానికి బిఎ సర్టిఫికేట్ పై ఎందుకనో అంత ఆసక్తి లేదు. రోడ్ సైడ్ చాయివాలా పుస్తకాలు చదువుతాడని గానీ లేదా రాస్తాడని కానీ ఎవరూ నమ్మరు.

పేపర్ పఠిస్తూ లక్ష్మణ రావు

పేపర్ పఠిస్తూ లక్ష్మణ రావు


తను రచయిత అయితే రోడ్ పక్కనున్న పేవ్‌మెంట్ పై తనకు పనేంటని జనం బహుశా ఆలోచించి ఉండొచ్చు. దాదాపు 20పుస్తకాలను రాసిన రచయిత హిందీభవన్ బయట ఉన్న రోడ్లపై టీ అమ్ముకుంటున్నాడు. ఇది హిందీ సాహిత్య సమితి తాలూకు బాధ్యత ఎంత చక్కగా నిర్వహిస్తందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. హిందీ భవన్ కు వచ్చి ఉపాన్యాసాలిచ్చేంత గొప్ప సాహిత్యం ఆయనలో కనపడలేదేమో. లేక వారిలా సాహిత్య లోకానికి తనెలాంటి సేవా చేయలేదేమో. ఓ ఇరవై గ్రంధాలను రాసారు అంతే కదా ? హిందీలో ఉండే ఎంతో మంది సాహితీ పిపాసులు, రచయితలతో రావుని పోలిస్తే ఇతనొక అంటరాని రచయిత ఏమో ఆ సాహితీ సంస్థకే తెలియాలి.

పుస్తకాలంటే ప్రాణం

రోహిణి, వసంత కుంజ్ మార్గాల్లో సైకిల్ పై రౌండ్లు వేయడం రావు గారి దినచర్యలో భాగం. ఐటిఓకి దగ్గర్లో గల విష్ణు దిగంబర్ మార్గ్ లో ఆయన టీ స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్ పెద్ద గొప్పగా ఏం ఉండదు. ఓపెన్ ఎయిర్ స్టాల్ అది. ఒక బెంచి పై కిరోసిన్ స్టవ్ ఉంటుంది. ఒక టీ కెటిల్ రెండు మూడు గ్లాసులు, ప్లాస్టిక్ మగ్ ఆ స్టాల్‌లో కనిపించే వస్తువులు. తాను రాసిన ఐదు పుస్తకాలను షాపులో డిస్ ప్లే చేసి ఉంచుతారు. వర్షం వచ్చిందంటే ఇక షాప్ మూసేయాల్సిందే. పేవ్ మెంట్ పక్కనున్న సపోర్ట్ గోడ దగ్గర వస్తువులను పెట్టి. దానిపై ప్లాస్టీక్ కవర్ కప్పిపెడతారు. పక్కన సైకిల్ నిలబెట్టి, తానిపై నుంచి కవర్ వేసి తన పుస్తకాలు, తానూ తడవకుండా జాగ్రత్త పడతారు.

ఉదయం స్టాల్‌కి వెళ్లిన తర్వాత తన ఇద్దరి కొడుకులకు స్టాల్ బాధ్యత అప్పజెబుతారు. తర్వాత ఆయన ప్రయాణం మొదలవుతుంది. దాదాపు తన లిస్టులో ఉన్న 800 స్కూళ్లకు వెళ్లడమే తన తర్వాతి టార్గెట్. అందులో 400 స్కూళ్లు తన పుస్తకాలను కొన్నాయి. మిగిలినస్కూళ్లు తిరస్కరించాయి. కొత్త పుస్తకాల ముద్రన పూర్తియితే వాటిని తీసుకెళ్లే పనిలో ఉన్నారాయన. అలా గ్రంథాలను తీసుకెళ్లడంతో మొదలైన రోజు.. వాటిలో కొన్నింటిని వెనక్కి తీసుకు రావడంతో ముగుస్తుంది. కొన్ని సార్లు టీచర్ గెటవుట్ అని మొహమాటం లేకుండా అంటే. అది తనకి కోపాన్ని తెప్పించడదట. బహుశా ఆరోజు తనకు కలసి రాలేదని అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే స్కూలుకు వెళ్లి ప్రయత్నం మొదలు పెడతారాయన. తన రచనలను వారికి చూపించే దాకా తన ప్రయత్నం కొనసాగుందని అంటారాయన. బస్సు టికెట్ కొనలేని , ఆటోలకు డబ్బులు ఇవ్వలేని తన పేదరికం ఎప్పుడూ వెక్కిరించినా.. తన దగ్గర సైకిల్ ఉందనే ధీమా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగేలా చేస్తుంది. ఎండనక, వాననక పడి మరీ స్కూళ్లకు వెళ్లి తానే స్వయంగా పుస్తకాలను అమ్ముతున్నారు. తనే పుస్తకాన్ని రాసి దాన్ని అమ్ముకోవడం చాలా కష్టమైన పనే. టైం కూడా సరిపోదు. కానీ రావుకు మరో అవకాశం లేదిక్కడ.

లక్ష్మణ్ రావు రచించిన పుస్తకాలు.. వివిధ పెద్ద సంస్థలు కూడా అమ్ముతున్నాయి

లక్ష్మణ్ రావు రచించిన పుస్తకాలు.. వివిధ పెద్ద సంస్థలు కూడా అమ్ముతున్నాయి


డబ్బులు సంపాదించడంపై తనకెలాంటి ఆసక్తీ లేదు. ధనవంతుడిగా ఉండి పుస్తకాలను ప్రేమించలేకపోవడం కంటే పేద రచయితగా ఉండటం లోనే తనకు ఆనందం ఉందంటారాయన. రావు రాత్రి సమయంలో తన ఇంటిదగ్గర రచనలు చేస్తుంటారు. ఇళ్లంటే అదేదో ఇంద్రప్రస్థానం అయితే కాదు. ఒకే ఒక గది. అందులోనే తన భార్య రేఖ, ఇద్దరు కొడుకులు హితేష్, పరేష్ ఉంటారు. తన పిల్లలు ఎంత వరకూ చదివితే అంత చదివే స్వేచ్ఛనిస్తానంటారు. లక్ష్మణ రావుకి పెళ్లైన కొత్తలో తన భార్య రచనలను చేయడాన్ని వద్దనేది. కానీ అతనిలోని డెడికేషన్ చూసిన తర్వాత కాదనలేకపోయింది.

image


“చాలా మంది తను క్రేజీగా ఫీలవుతున్నానని అనుకంటారు తప్పితే... చుట్టుపక్కల ఉన్న వారు నాలో ఉన్న రచయితను గుర్తించలేకపోన్నారు. తనుండే ప్రాంతంలో ఉండే ఇతర చాయ్ వాలాలు సైతం తనని ఇబ్బంది పెట్టేలాగానే మాట్లాడుతుంటారట. వాళ్లకి రచనలపై అవగాహన లేదు. వారిలాగానే నేనొక చాయ్ వాలానే. నాలోని కళాకారుడిని గుర్తించ లేక పోవడం వారి తప్పైతే కాదంటారాయన

రన్ వే

మహారాష్ట్ర లోని అమరావతిలో లక్ష్మణరావు జన్మించారు. తన ముగ్గురు అన్నల్లో ఇద్దరు బాగా చదువుకొని సెటిల్ కాగా మూడో అన్న వ్యవసాయం చేస్తున్నారు. నలభై రూపాయిలు జేబులో పెట్టుకొని తీసుకొని ఇంటినుంచి పారిపోయిన వ్యక్తి ని నేను. ప్రపంచాన్ని చూడాలనుకున్నాను. ప్రతిదాన్ని తెలుసుకొని నేర్చుకొని గ్రంధాలను రాయలనుకున్నా. అని తన గతాన్ని చెప్పుకొచ్చారు. మొదట తాను చేరుకున్నది భూపాల్. అక్కడ ఒకరింట్లో పనివాడిగా చేరారు. అయితే యజమాని మంచివాడు కావడంతో తాను చదువుకోడానికి అవకాశం లభించింది. అక్కడ పనిచేసిన సమయంలోనే తన పదోతరగతి పూర్తి చేశారు.1975 లో రావు ఢిల్లీ చేరుకున్నారు. చాలా ఏళ్లు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారాయన. తర్వాత హైవే దాబాల్లో కప్పులు కడుక్కుంటూ జీవనం సాగించారు.1980 నుంచి అనుకుంటా తాను చాయ్ అమ్మడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ అమ్ముతునే ఉన్నారు. కానీ రావు ప్రపంచం వేరు. పుస్తకాలే ఆయనకు సర్వం. ధారాగంజ్ లోని ఫ్లీ మార్కెట్ లో పుస్తకాలను వెతకడానికే ఆదివారాలని ఆయన వినియోగిస్తారు. భారతీయ రచయితల పుస్తకాలే కాదు షేక్ స్పియర్,సొఫోక్లస్, బెర్నార్డ్ షా లాంటి వారి రచనలు కూడా బాగా ఔపోసన పట్టారు.

తన చాయ్ డబ్బా దగ్గరకు రోజూ చాలా మంది వస్తుంటారు. వీరంతా టీ తాగడానికి వస్తున్నారనుకుంటే పప్పులోకాలేసినట్లే. రావు రాసిన పుస్తకాలను చదివి వీరు ఇక్కడ అతనితో సమయం గడపడానికి వస్తుంటారు. ఆఫీసుకు వెళ్లే ముందు, ఆఫీసు అయిపోయిన తర్వాత వీరంతా ఇక్కడకు చేరుకుంటారు. ఇది ఆఫీసులకు వెళ్లేవారికి మాత్రమే కాదు రావు రచనలు చదివేవారు కూడా విష్ణు దిగంబర్ మార్గ్ లో టీ స్టాల్ అడ్రస్ కనుక్కొని మరీ వస్తుంటారు.

అలాంటి వారిలో ఒకరైన సుశిల్ శర్మ మాటల్లోనే..
“ మా ఆఫీసు సఫ్దార్ జంగ్ ఎన్ క్లేవ్ లో ఉంది. నేను ఈ రోడ్ పై నుంచి వెళ్లడానికి ప్రధాన కారణం ఇక్కడ రావు షాపు ఉండటమే. నా ఆలోచన టీం తాగడం కాదు. ఇలాంటి రచయితో సమయాన్ని గడపడం ముఖ్యం. నేను రావుతో న్యూస్, వ్యూస్ లాంటి వాటిపై పిచ్చాపాటి చేసి ఇంటికి చేరుకుంటాను ,” అంటున్నారు సుశీల్.

విద్యావంతులే కాదు సాధారణ ప్రజలను సైతం రావు రచనాలు ప్రభావితం చేశాయి. ఇక్కడ సెక్యూరిటీ గా పనిచేసే శివ అనే వ్యక్తి రావు రచనలను ఎంతో ఇష్టంగా చదువుతారట. నర్మద, రామ్ దాస్ అనే నవళ్లు శివ ఫేవరేట్ అట. ఇవి మానాన్న గారు కూడా చదువుతుంటారని శివ చెప్పారు. మరికొంతమందిని చదవమని తాను ప్రొత్సహిస్తారట.రావు రచనలన్నీ ఒక వ్యక్తి తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో అనే దానిపై ఉంటాయి. రోజువారి లక్ష్మణ్ కు ఎదుపైన కష్టాలను తన రచనల్లో చూపించరాయన. రావు కల్పించిన పాత్రలు అన్ని ధనవంతులవే. వాళ్లంతా ప్రేమకోసం,కళకోసం పడే పాట్లు నా రచనల్లో చూపిస్తానని అన్నారయన.

లక్ష్మణరావు రాసిన నర్మద పుస్తకం.. ఇంగ్లిష్‌లోనూ తర్జుమా అయింది

లక్ష్మణరావు రాసిన నర్మద పుస్తకం.. ఇంగ్లిష్‌లోనూ తర్జుమా అయింది


నా జీవితంపై ఆధారపడి నేను రచనలు చేయలేదు. నేను వాస్తవితకను వెలికితీసే ప్రయత్నం చేస్తాను. నా చుట్టుపక్కల నేను చూసే విషయాలను అవి ప్రతిబింబిస్తాయని లక్ష్మణ్ ముగించారు.

లక్ష్మణ్ రావును సంప్రదించండి. ఇలాంటి వ్యక్తులు మీకూ ఎక్కడైనా తారసపడితే మాతో పంచుకోండి. వారి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియనివ్వండి.