పదహారేళ్ల కుర్రాడు రూ.42 కోట్ల ఆఫర్ వద్దన్నాడు..  

0

పదహారేళ్లంటే, అప్పుడే టెన్త్ కంప్లీట్ అయి, కాలేజీలోకి అడుగుపెట్టి, కొత్త ప్రపంచాన్నిచూస్తూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకునే వయసు. క్లాసులు, వీలైతే సినిమాలు, టైం దొరికితే షికార్లు ఇవి తప్ప ఆ టైంలో పెద్దగా ఇంట్రస్టింగ్ అనిపించవు. కానీ 16 వయసు కుర్రాడు టైం వేస్ట్ చేయకుండా ఓ వెబ్ సైట్ క్రియేట్ చేశాడు. అది అలాంటి ఇలాంటి సైట్ కాదు. దాని గురించి తెలిసిన కొందరు ఇన్వెస్టర్లు 42 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అయినా కుర్రోడికి ఆ డీల్ నచ్చక తిరస్కరించాడు. ఇంతకూ ఏంటా వెబ్ సైట్. ఏముంది అందులో..

లండన్ యార్క్ షైర్ లోని డ్యూస్ బర్రీకి చెందిన మహ్మద్ అలీ అనే పదహారేళ్ల కుర్రాడు రూపొందించిన వెబ్ సైట్ ఇధి. దాని పేరు వీనీడ్1.కామ్. ప్రైస్ కంపారిజన్ వెబ్ సైట్. క్రిష్ అనే 60 ఏళ్ల ఆంట్రప్రెన్యూర్ తో కలసి దీన్ని డెవలప్ చేశాడు. ఇది బయ్యర్లకు ఉపయోగపడే సర్వీస్. కార్ల అమ్మకందారులను, కొనుగోలుదారులను ఒకేవేదిక మీదికి తచ్చే ప్లాట్ ఫామ్. అలాగని ఇదేదో సాదాసీదా అడ్వర్టయిజింగ్ సైట్ కాదు. రెగ్యులర్ మార్కెటింగ్ మోడల్ అంతకన్నా కాదు. రియల్ టైంలో డబ్బుకు డబ్బు సమయానికి సమయాన్నీ ఆదా చేస్తుంది.

సైట్లోకి వచ్చి ఫలానా ప్రాడక్ట్ కొనాలని ఎవరైతే అనుకుంటారో, సదరు ప్రాడక్ట్ అమ్మకందారుడికి బజర్ వినిపిస్తుంది. దాంతో ఇద్దరూ కనెక్టవుతారు. కీ వర్డ్స్ ద్వారా మాట్లాడుకుంటారు. డీల్ నచ్చితే ప్రాడక్ట్ సేల్ అవుతుంది. అలా అనేక మంది బయ్యర్లు నేరుగా కస్టమర్లతో డీల్ చేసుకోవచ్చు.

ఈ సైట్ గురించి తెలిసి కొందరు ఇన్వెస్టర్లు కొంటామని ముందుకొచ్చారు. 42 కోట్ల రేటు మాట్లాడుకున్నారు. కానీ అలీ ఒప్పుకోలేదు. కారణం, అంతకంటే విలువైన సైట్ అది అంటాడాయన. అయితే వచ్చిన ఇన్వెస్టర్లకు ఆల్రెడీ గ్లోబల్ డేటా డ్రివెన్ కంపెనీ ఉంది. అయినా వాళ్లకు అర్ధం కాలేదు దాని వాల్యూ ఏంటో. ఒక్కసారి అది జనాల్లోకి వెళ్తే ఎంత ఉపయోగం ఉంటుందో తెలియకే, అంత తక్కువ ధరకు అడిగారని అలీ అంటున్నాడు.

అంతకు ముందు అలీ ఒక వీడియో గేమ్ ప్రాజెక్ట్ తయారుచేశాడు. అది బీభత్సంగా హిట్టయింది. 30వేల యూరోలు వచ్చాయి. జనవరి 28న లాంఛ్ అయిందీ వీనీడ్1.కామ్ వెబ్ సైట్. ప్రస్తుతానికి కాంపిటీటర్లు లేరు. అదే పెద్ద అడ్వాంటేజ్. 

Related Stories