జూన్ 2 నుంచి 10వరకు హైదరాబాదులో తెలుగు వెలుగుల పండుగ  

0

జూన్ 2 నుంచి 10వరకు హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వంనిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని ఈ మహాసభలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతాయని సీఎంప్రకటించారు.

తెలంగాణ సాహిత్య అకాడమీతో పాటు సంగీత - నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, జానపద అకాడమీలను కుడాఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. చక్కటి తెలుగు భాష, చక్కటి కవిత్వం తెలంగాణలో ఉందని తెలంగాణసాహితీ ప్రభావం ప్రపంచానికి చాటేందుకు ఈ అకాడమీలు వేదికలు కావాలని సీఎం ఆకాంక్షించారు.

తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన సీఎం- యావత్ ప్రపంచం గుర్తించేవిధంగా, చరిత్రలో చిరస్థాయిలో నిలిచేలా సభలు నిర్వహించాలని ఆదేశించారు. తెలుగు మహాసభలు సందర్భంగాతెలంగాణ సాహితీ వైభవాన్ని చాటే విధంగా హైదరాబాద్ లో హోర్డింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈమహాసభలకు దేశ, విదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానించాలని సీఎంపేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా అవధానాలు, కవి సమ్మేళనాలు, వివిధ సాహిత్య ప్రక్రియలపై సదస్సులునిర్వహించాలని, తెలంగాణ కవుల అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా నందిని సిధారెడ్డిని నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలుగుమహాసభల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.

Related Stories

Stories by team ys telugu