కాపీరైట్ తీసుకోవడం కాఫీ తాగినంత ఈజీయా?

మరొకరిలా ఉండాలనుకోవడం పొరపాటుమనలా మనమే ఉంటాం. ఎవరి ప్రత్యేకత వారిదే. మరొకరిలా ఉండాలని ప్రయత్నిస్తే మన ప్రత్యేకత పోతుందిఇతరుల మేధో సంపత్తిని మనం కాజేయాలనుకోవడం సమంజసం కాదుఅలా చేయాలని ప్రయత్నిస్తే చట్టం చూస్తూ ఊరుకోదు.

0

మన ఐడియాలను, మనం తీసుకున్న ఫోటోలను, మన రచనల్ని ఎవరు బడితే వారు వాడుకోవచ్చా ? అలా వాడుకుంటే వారిపై చర్య తీసుకోవడానికి చట్టం ఎలాంటి రక్షణ  కల్పించింది ?

ఏదైనా రచన చేయడం చాలా సులువు. అయితే చేసిన రచన, వర్క్‌కు సంబంధించి కాపీరైట్‌కు దరఖాస్తు చేయడం చాలా కష్టం. వివిధ ఉత్పత్తులు, ఆర్టిస్టుల పెయింటింగ్స్, రచయితల నవలలు, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాంలు...ఇలా ఒకటేమిటి ? మన సృజనాత్మకతకు సంబంధించిన వాటికి రక్షణ కల్పించడం కాపీరైట్ యాక్ట్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశ్యం.

మీరు ఏ సంస్థ స్థాపించినా, ఏ ప్రోడక్ట్ డిజైన్ చేసినా తప్పకుండా కాపీరైట్ చట్టాన్ని అనుసరించి ముందుకెళ్ళాలి. కాపీరైట్ విషయంలో వివిధ కంపెనీలకు అవగాహన కల్పిస్తున్నారు గౌరవ్ సింఘాల్, అనన్య దుద్దు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎల్ఎల్‌బీ పూర్తిచేసిన గౌరవ్, బెంగళూరు నల్సార్ లా యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గత కొన్నాళ్ళుగా మేధో సంపత్తి హక్కులకు సంబంధించి పనిచేస్తున్నారు. పాట్రాకోడ్ సర్వీసెస్‌లో అనలిస్టుగా ఉన్న అనన్య అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీ లో మెడికల్ లా, ఎతిక్స్‌లో పీజీ డిప్లోమా చేశారు. బెంగళూరులో మేధో సంపత్తి హక్కులపై పీజీ డిప్లోమా చేశారు.

  • ఒరిజినల్, ప్రచురించబడిన, ప్రచురణకు నోచుకోని వివిధ వర్క్‌లను కాపీరైట్ చట్టం ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఆయా రచయితల మేధో సంపత్తికి రక్షణ లభిస్తుంది. ఒక రచన, లేదా మ్యూజిక్, లేదా చిత్రలేఖనానికి సంబంధించి రచయిత జీవిత కాలంతో పాటు సదరు వ్యక్తి చనిపోయాక కూడా 60 ఏళ్ళపాటు కాపీరైట్ పరిధిలో ఉంటుంది.
  • సినిమా కథలు, సినిమాలు, ఫోటోలు, సౌండ్ రికార్డింగ్‌లు ప్రసారం అయిన, లేదా విడుదలైన రోజునుంచి 60 ఏళ్ళపాటు కాపీరైట్ చట్టం పరిధిలో ఉంటాయి. ఈ లోపు ఎవరైనా ఆయా రచనలను తస్కరిస్తే కాపీరైట్ చట్టం కింద చట్టం నుంచి రక్షణ కోరవచ్చు. దుర్వినియోగం చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చు.

ఒకవేళ ఒక రచయిత తన రచనను పునర్ముద్రించినట్లయితే ఆ విషయాన్ని ఆ రచయిత స్పష్టంచేయాలి. కాపీరైట్ ఉన్న వ్యక్తి ఆ విషయాన్ని అసలు రచయితకు తెలియచేయాలి.

కాపీరైట్ ఉల్లంఘనలు జరిగితే చట్టం నుంచి రక్షణ పొందడానికి ఖచ్చితంగా ఆ కాపీరైట్‌ను రిజిస్టర్ చేయించుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ కాపీ చూపించి దోషులపై పోరాడే అవకాశం ఉంటుంది. కోర్టు నుంచి ఇంజెంక్షన్ ఆర్డర్ పొందే వీలుంటుంది.

వివిధ పరిశ్రమల్లో పనిచేసే మేధావులు తమ వర్క్‌కి సంబంధించి కాపీరైట్ పొందడం ఎంతో అవసరం. ఎందుకంటే వారి మేధస్సు చాలా తక్కువ కాలం కలిగి ఉంటుంది. ముఖ్యంగా వినోద పరిశ్రమలో పనిచేసే సృజనాత్మక కళాకారులు ఇలాంటి విషయాల్లో జాగరూకతతో వ్యవహరించాలి.

ఈమధ్యకాలంలో స్టార్టప్‌ల విషయంలో కొన్ని మేధోపరమయిన ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. స్టార్టప్‌లు కూడా తమ ఆలో్చనలు, డిజైన్లకు సంబంధించి ఆయా కంపెనీలు న్యాయనిపుణులను సంప్రదించి, కాపీరైట్ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

స్టార్టప్ కంపెనీలకు సంబంధించి ...

  • ప్రొడక్ట్ స్నాప్‌షాట్
  • వెబ్‌సైట్ డిజైన్లు
  • అడ్వర్టైజ్‌మెంట్లు
  • సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాంలు
  • యాప్‌లకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్‌లు

నిపుణుల సలహాతో ముందుకెళితే ఇలాంటి విషయాల్లో చట్టపరమయిన రక్షణ ఉంటుంది.

సృజనాత్మకతకు సంబంధించిన విషయాల్లో రచయితలు, కళాకారులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కాపీరైట్ తీసుకోవడం ఎంతో సులభం. దోపిడీ నుంచి విముక్తి పొందేందుకు, తమ ప్రొడక్ట్, లేదా తమ రచన పదికాలాలపాటు తమ చేతిలో ఉండేందుకు ఈ కాపీరైట్ దోహదపడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కాపీరైట్ అవసరమా లేదా అనేది ఆలోచించుకోవాలి. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాంల విషయంలో కాపీరైట్ పొందడం అన్ని విధాలా శ్రేయస్కరం.

క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తూ ప్రస్తుతం ప్రారంభం అవుతున్న స్టార్టప్ కంపెనీలకు కాపీరైట్ ఆయుధం ఎంతో అవసరం. నూతన తరం యువతీయువకులు తమ ప్రతిభకు పదును పెడుతూ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళుతున్నారు. వెబ్‌సైట్ డిజైన్లు, ప్రోడక్ట్ ఐడియాలు, బ్రోచర్లు, విజిటింగ్ కార్డుల విషయంలో జాగ్రత్తలు అవసరం.

మీ కంపెనీకి సంబంధించిన లోగో ని కాపీరైట్ చేయించుకోవచ్చు. ఆర్టిస్టుల వర్క్, ఐడియా అన్నీ కాపీరైట్‌లో పొందుపరుచుకోవచ్చు. ఎవరైనా మన లోగోని కాపీ చేసినా, మన ఐడియాని వాడుకున్నా, న్యాయపరమయిన ఇబ్బందులు వచ్చినా కాపీరైట్ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది.

మీరు మీ మెదడుకి పదును పెట్టి పనిచేయడం కాదు, మీ ప్రతిభను ఎవరూ దొంగిలించకుండా కాపాడుకోవడం ఇప్పుడున్న కర్తవ్యం. అందుకే కాపీరైట్ చట్టం మీకు రక్షణగా నిలబడుతుంది.