ఆఫ్ లైన్ స్టోర్లకు కస్టమర్లను వెతికి పెట్టే ‘వాక్ 2 షాప్’

ఆఫ్ లైన్ స్టోర్లకు కస్టమర్లను వెతికి పెట్టే ‘వాక్ 2 షాప్’

Saturday May 07, 2016,

3 min Read


ఆన్ లైన్ మార్కెట్ ఎంత వ్యాపించినప్పటికీ, ఆఫ్ లైన్ మార్కెట్ లో దాని వాటా వేళ్లపై లెక్కపెట్టాల్సిందే. ఆన్ లైన్ కస్టమర్ల సంఖ్య పెరిగినప్పటికీ, ఆఫ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గిన దాఖలాల్లేవు. అయితే భవిష్యత్ లో ఈ పరిస్థితుల్లో మార్పు రాదని మాత్రం ఇప్పుడే చెప్పలేం. అప్పుడు ఆఫ్ లైన్ షాప్స్ ఆన్ లైన్ వైపు మళ్లితేనే వ్యాపారం సాధ్యమవుతుంది. అయితే ప్రతి స్టోర్ ఈ కామర్స్ మొదలు పెట్టాలంటే జరగని పని. పెద్ద పెద్ద బ్రాండ్ లు అయితే ఓకే కానీ, చిన్నా చితకాత దుకాణాలకు బడ్జెట్ సరిపోదు. చాలా మందికి టెక్నాలజీపై అవగాహన లేకపోవడం పెద్ద సమస్య. దీనికి పరిష్కారం చూపుతానంటోంది హైదరాబాదీ స్టార్టప్ వాట్ 2 షాప్.

వాక్ 2 షాప్ పనితీరు

ప్రారంభించిన మూడు నెలల్లోనే ఐదు వేలకు పైగా డౌన్స్ లోడ్స్ తో దూసుకుపోతోంది వాక్ 2 షాప్. రోజుకి 3 వందల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వెబ్ సైట్ తో పాటు యాప్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది వాక్ 2షాప్.

image


“వాక్ 2 షాప్స్ అనేది ఒక రిటైల్ బ్రాండింగ్ సొల్యూషన్” వెంకట్

ఈ స్టార్టప్ సీఈఓ గా వ్యవహరిస్తున్నారు వెంకట్. రిటైల్ మార్కెట్ లో తమ యాప్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని వివరించారు. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న యూజర్లకు పుష్ నోటిఫికేషన్ అందిస్తారు. అయితే గూగుల్ లో అనుసంధానం అయిన వ్యవస్థ కావడం వల్ల యూజర్ షాపింగ్ లో ఉన్నప్పుడు ఆ స్టోర్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడున్న ఆఫర్ల గురించి చెబుతారు. ఇదే విషయం అటు రిటైలర్లకు కూడా వివరిస్తారు. యూజర్ ఆ స్టోర్ దగ్గరకు వచ్చిన విషయం తెలియజేస్తారు. అప్పుడు ఆ స్టోర్ లో ఉన్న ఆఫర్లు యూజర్ కి పంపించడానికి వీలవుతుంది. ఈ రకంగా అటు రిటైలర్లతో బిటుబి వ్యాపారం చేస్తూనే, ఇటు యూజర్లతో బిటుసి ప్లాట్ ఫాంలో సర్వీసు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ వందల బ్రాండ్ లు తమతో టై అప్ అయ్యాయని అంటున్నారు. హైదరాబాద్ లో మ్యాక్స్ లాంటి రిటైల్ స్టోర్ తమతో కలసి పనిచేస్తోంది. షాపర్స్ స్టాప్ లాంటివి కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. 

వాక్ 2 షాప్ టీం

దీని ఫౌండర్ గోవింద్ పుట్ట. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లేబర్ లా అండ్ మేనేజ్మెంట్ నుంచి పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశారు. రెండున్నర దశాబ్దాల ఇండస్ట్రియల్ ఎక్స్ పీరియన్స్ ఉంది. వెంకట్ భాసుం సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉంది. కంపెనీ మార్కెట్ స్ట్రాటజీ లాంటివి ఈయన చూస్తున్నారు. మరో 30 మంది ఆన్ రోల్, ఆఫ్ రోల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

గోవింద్ పుట్ట , వెంకట్ 

గోవింద్ పుట్ట , వెంకట్ 


వాక్ 2 షాప్ సవాళ్లు

ఆఫ్ లైన్ స్టోర్ లను గుర్తించడం పెద్ద సవాల్. అలాంటి వాటిని గుర్తించి సర్వీసు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత స్టాక్ డిటెయిల్స్ అప్ డేట్ చేయించడం అన్నింటికంటే పెద్ద సమస్య అంటున్నారు. దీంతో పాటు ఆఫర్ల గురించి అప్ డేట్ చేయించడం కూడా పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు. ఆఫ్ లైన్ స్టోర్ల యజమానులకు టెక్నికల్ స్కిల్స్ తక్కువ. వాటిని సులువైన మార్గాల్లో తెలియచేస్తున్నారు. తమ యాప్ లో యూజర్ ఇంటర్ఫేజ్ డిజైనింగ్ తో ఇలాంటివి సులభతరం చేశారు. ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. దీన్ని తొందరలోనే అధిగమిస్తామని వెంకట్ అంటున్నారు.

పోటీదారులు

బెంగళూరు కేంద్రంగా స్ట్రీట్ స్మార్ట్ , బాంబేలో మరో స్టార్టప్ ఇదే తరహా వ్యాపారంలో ఉన్నాయి. స్థానికంగా షేక్ మామా అనే ఓ యాప్ ఇలాంటి సొల్యూషన్ పై పనిచేస్తోంది. అయితే ఇవన్నీ లొకల్ స్టార్టప్. వాక్ 2 షాప్ అనేది గ్లోబల్ రికగ్నిషన్ ఉన్న స్టార్టప్. అనేక దేశాల్లో దీని సర్వీసులు ఇస్తుందని వెంకట్ చెప్పుకొచ్చారు.

image


ఫండింగ్

రెండు కోట్ల దాకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి సీడ్ ఫండ్ గా సమకూర్చుకున్నారు. ఈ ఏడాది చివరికల్లా సిరీస్ ఏ రౌండ్ ఫండ్ రెయిజ్ ఆలోచనలో ఉన్నట్లు వెంకట్ చెప్పారు.

ఇప్పటికి దాకా ఈ అప్లికేషన్ ని 13 దేశాల్లో డౌన్ లోడ్ చేసుకున్నారు. చాలా ఇంటర్నేషన్ బ్రాండ్ లు టై అప్స్ అవుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఆరు మెట్రోల్లో పూర్తిస్థాయి మార్కెట్ ను గ్రాబ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. భారతీ రిటైల్ లాంటి సంస్థలు రిటైల్ వ్యవహారాలు తమకు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఇలా చాలా సంస్థలతో టై అప్స్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి వెంకట్ ముగించారు. 

వెబ్ సైట్