ఇల్లు కావాలంటే మాకు చెప్పండి !

విద‌ర్భలో వినూత్నమైన ఘ‌ర్ ఫైండ‌ర్మ‌హారాష్ట్ర‌లోని విద‌ర్భ ప్రాంతంలో పెరుగుతున్న రియ‌ల్ బూమ్‌ చూశాక ఇద్ద‌రు స్నేహితుల‌కు ఓ మంచి బిజినెస్ ఐడియా వ‌చ్చింది. ఆ టైమ్ లో చాలా మంది కుర్రాళ్ళు స్కైస్ర్కాప‌ర్స్ వెంట, భారీ నిర్మాణాల వెంట ప‌డితే- నిఖిల్ నింబోర్కర్ , నిఖిల్ కిటుక‌లే మాత్రం భిన్నంగా ఆలోచించారు. సొంత ఇల్లు కొనాల‌న్నా, అమ్మాల‌న్నా , చివ‌రికి అద్దెకి తీసుకోవాల‌న్నా- జనం ప‌డే అవస్థలపై వీరిద్ద‌రూ దృష్టిపెట్టారు. అలాంటి స‌మ‌స్య‌కు సమాధానమే ఘ‌ర్ ఫైండర్ .కామ్.

ఇల్లు కావాలంటే మాకు చెప్పండి !

Monday August 24, 2015,

2 min Read


ఎలా మొద‌లైంది?

మ‌హారాష్ట్ర విద‌ర్భ ప్రాంతంలో నాగ‌పూర్, అమరావ‌తి డివిజ‌న్లున్నాయి. ఈ రెండింటి ప‌రిధిలో ఏడు జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో రియ‌ల్ ఎస్టే ట్ బూమ్ బాగా క‌నిపిస్తోంది. వెబ్ సైట్ పెట్టే ముందు ఇక్క‌డి సామాజిక స్థితిగ‌తులై ఈ ఇద్ద‌రు మిత్రులు పూర్తి స్థాయిలో అధ్య‌యనం చేశారు. విద‌ర్భ ప్రాంతం నుంచి ముంబై, పుణె లాంటి న‌గ‌రాల‌కు గ‌తంలో ప‌నుల కోసం వెళ్ళిన యువ‌త ఇప్పుడు సొంత ఊరికి వ‌చ్చి వుండాల‌నుకుంటోంది. అయితే, ఎక్క‌డో ఉన్నవారికి ఇక్క‌డ సొంతూళ్ళో ఇళ్ళ స్థలాల‌ను, ఇళ్ళ‌ను వెతుక్కోవ‌డం, ధ‌ర‌లు మాట్లాడుకోవ‌డం ఇవ‌న్నీ కొంత క‌ష్టంగానే అనిపించాయి. కొన‌డానికి డ‌బ్బున్నా.. లావాదేవీల‌కే భ‌య‌ప‌డుతున్నారు. మంచి రియ‌ల్‌ ఎస్టేట్ సేవ‌లందించే న‌మ్మ‌క‌స్తులైన బ్రోక‌ర్లును వెతికిప‌ట్టుకోవ‌డంమే వీరికి పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఈ స‌మ‌స్య‌ను అర్థం చేసుకున్న ఇద్ద‌రూ దీనికో ప‌రిష్కారం కనుక్కునే ప‌నిలోప‌డ్డారు. విద‌ర్భ ప్రాంత‌వాసుల‌కే ప్ర‌త్యేకంగా ఓ వెబ్ సైట్ ను రూపొందించారు. విదర్భ వాసుల అవ‌స‌రాలు ఓ విద‌ర్భ‌వాసికే తెలుస్తాయంటారు వీళ్ళు. అందుకే ఈ పోర్ట‌ల్ ను వారి కోసమే రూపొందించిన పోర్ట‌ల్ అంటున్నారు.

ఒక‌ప‌క్క 99 ఎక‌ర్స్. కామ్, హౌజింగ్.కామ్, కామ‌న్ ఫ్లోర్ .కామ్ లాంటి బ‌డా సంస్థ‌లు భారీ పెట్టుబ‌డుల‌తో పోటీ ప‌డుతున్నాయి. ఈ క్రమంలో విద‌ర్భ ప్ర‌త్యేక‌త‌తో ఆ పోటీని త‌ట్టుకోవాల‌ని నిఖిల్ ద్వ‌యం ప్ర‌య‌త్నిస్తోంది. అమరావ‌తి జిల్లాకే ప‌రిమిత‌మై మొద‌లైన ఈ పోర్ట‌ల్ ఇప్పుడు మొత్తం విద‌ర్భ ప్రాంతానికంత‌టికీ విస్త‌రించింది. అమ‌రావ‌తి, అకోలా, నాగ‌పూర్ జిల్లాల్లో ఈ వెబ్ సైట్ కి చాలా ఆద‌ర‌ణ వుంది. 40 మంది రియ‌ల్ ఎస్టేట్ బిల్డ‌ర్ల‌తో, 150 మంది ఏజెంట్ల‌తో ప్రస్తుతం ఈ సైట్ కి ఒప్పందాలున్నాయి.

ప్ర‌తి ఒప్పందం వెనుక చాలా త‌నిఖీలుంటాయి. నిఖిల్ నింబోర్క‌ర్ స్వ‌యంగా ఆయా బిల్డర్లు, బ్రోక‌ర్లు ద‌గ్గ‌ర‌కెళ్ళి వారి క్రెడిబిలిటీని ప‌రీక్షిస్తారు. ఆ త‌ర్వాతే వెబ్ సైట్ లో చేరుస్తారు. దీని వ‌ల్ల కొనుగోలుదారుకు మేలు జ‌రుగుతుంది. మ‌రోవైపు కేవ‌లం నిఖార్స‌యిన బ్రోక‌ర్లు, బిల్డ‌ర్ల‌ను మాత్ర‌మే వెబ్ సైట్ లో చేర్చుకునే అవ‌కాశం వుంటుంది.

ఘ‌ర్ ఫైండ‌ర్ .కామ్ వెబ్ సైట్ ప్ర‌మోష‌న్ కోసం ఈ మ‌ధ్య అమ‌రావ‌తి గ్రాండ్ మెహ‌ఫిల్ ఇన్ హోట‌ల్ లో మూడురోజుల ప్రాప‌ర్టీ షోను కూడా నిర్వ‌హించింది. విద‌ర్భ ప్రాప‌ర్టీ ఎక్స్ పో పేరుతో నిర్వ‌హించిన ఈవెంట్‌కు మార్కెట్ లో మంచి ఆద‌ర‌ణ వ‌చ్చింది.

పార్ట‌న‌ర్స్ నిఖిల్ కిటుక‌లే పూనెలో వుండి సేల్స్, అండ్ మార్కెటింగ్ ప‌నులు చూస్తుంటారు. నిఖిల్ నిబోర్క‌ర్ మాత్రం అమరావ‌తిలోనే వుండి, ఎనిమ‌ంది మంది టీమ్ తో సంస్థ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తూ వుంటారు. ఇద్ద‌రూ రెండు వేర్వేరు న‌గ‌రాల్లో వున్నా.. సమన్వయంలో ఏమాత్రం తేడారాదు. మా ఇద్ద‌రి మ‌ధ్య వుండే మంచి స‌మ‌న్వం వ‌ల్ల దూరం పెద్ద ఇబ్బంది కావ‌డం లేదు అంటారు నిఖిల్ నింబోర్క‌ర్.

image


భ‌విష్య‌త్తేంటి..

ప‌దిల‌క్ష‌ల ఫండింగ్ తో మొద‌లైన ఘ‌ర్ ఫైండ‌ర్ .కామ్ వ‌చ్చే ఏడాదిలో మ‌హ‌రాష్ట్ర‌లోని మిగిలిన న‌గ‌రాల‌కు కూడా విస్త‌రించాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తోంది.