సీఎం భద్రతా వ్యవహారాలు చూస్తున్న తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్

సుభాషిణి సక్సెస్ స్టోరీ

సీఎం భద్రతా వ్యవహారాలు చూస్తున్న తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్

Saturday November 26, 2016,

2 min Read

ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే భధ్రతను పర్యవేక్షించడమంటేనే ఎంతో రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఒక సీఎం సెక్యూరిటీ హెడ్ ఆఫీసర్ అంటే మాటలా? అందునా ఒక మహిళా ఐపీఎస్ అంటే ఇంకా రిస్కో ఆలోచించండి. ఆ విభాగంలో చాలామటుకు పురుషులే ఉంటారు. ఎందుకంటే సీఎం మూమెంట్ చాలా సున్నితమైన అంశం. అగ్రెసివ్ గా ఉండాలి. చీమచిటుక్కున్నా అలర్ట్ అవ్వాలి. ఏమాత్రం అసత్వానికి అవకాశం లేని జాబ్. చిన్న తప్పయినా క్షమించే సవ్వాలే లేని టఫ్ టాస్క్. ప్లానింగ్ దగ్గర్నుంచి పని అయ్యేంత వరకు నిరంతరం టచ్ లోఉండి కోఆర్డినేట్ చేసుకోవాలి. మహామహా సీనియర్లు, తలపండిన వాళ్లే ఆ సెక్షన్ లో ఉంటారు. ఓవరాల్ గా మగవాళ్లయితే ఆ జాబ్ హాండిల్ చేస్తారనే భావన నాటుకుపోయింది.

అలాంటి బాధ్యతలను సీనియారిటీతో సంబంధం లేకుండా భుజానికెత్తుకుంది యువ ఐపీఎస్ సుభాషిణి శంకరన్. దేశంలోనే ఒక సీఎం భద్రతా వ్యవహారాలు చూస్తున్న తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆమెనే.

image


సుభాషిణిది మధ్యతరగతి కుంటంబ నేపథ్యం. సొంతూరు తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణం. పేరెంట్స్ 1980లో ముంబైకి షిఫ్టయ్యారు. అక్కడే స్కూలింగ్. సెయింట్ జేవియర్ కాలేజీలో సోషియాలజీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. జేఎన్ యూ ఢిల్లీ నుంచి పీజీ, ఎంఫిల్ కంప్లీట్ అయింది.

జేఎన్ యూలో ఉండగానే సుభాషిణి యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. మహిళలు, టెర్రరిజం అనే అంశాలతో పాటు ఎల్‌టీటీఈ సంస్థలపై అధ్యయనం చేసి లా అండ్ ఆర్డర్ విషయాలపై పట్టు సాధించారు. 2010లో మెయిన్స్ ర్యాంక్ 243 వచ్చింది. హైదరాబాద్ పోలీస్ అకాడెమీలో ట్రైనింగ్. అనంతరం గువాహటి, బిస్వంత్, సిల్చాపూర్లలో ఏసీపీగా, తేజ్‌పూర్‌లో అడిషనల్ సూపరిండెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం అసోం చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే వ్యవస్థలో మార్పు వస్తోంది. మహిళలు అన్ని చోట్లా రాణించగలుగుతున్నారు. సిస్టమ్ అడ్జస్ట్ అవుతోంది. ఇదొక మంచి పరిణామం అంటారామె. డ్యూటీ పట్ల తనకున్న సిన్సియారిటీ ముఖ్యమంత్రి భద్రతా విభాగంలో ముఖ్యఅధికారిగా ఎంపికవ్వడానికి కారణమైందని సుభాషిణి అన్నారు.