ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెండికొండలు

ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెండికొండలు

Friday March 04, 2016,

2 min Read

జ్యువెలరీ టక్కున గుర్తొచ్చేవి బంగారం, వజ్రాభరణాలు. వాటిని ఇష్టపడని మగువలుండరు. అయితే, డైమండ్, గోల్డుపై ఎక్కువగా ఇంట్రస్ట్ చూపించే మహిళలు....వెండిని మాత్రం కాస్త పక్కకు పెడతారు. సిల్వర్ జ్యువెలరీని కొనేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చరు. మరి అలాంటి సిల్వర్ జ్యువెలరీకి కూడా సొబగులద్ది వాటికి బంగారంబాబులా తయారుచేస్తూ మార్కెట్ ను దున్నేస్తున్నారు.  

image



దివ్యా బాత్రా, ప్రగ్యా బాత్రా అక్కాచెల్లెళ్లు. 2014 సెప్టెంబర్ లో క్విర్క్‌ స్మిత్ పేరుతో వెండి ఆభరణాల తయారీ సంస్థను నెలకొల్పారు. వెండి ఆభరణాలంటే ఇష్టపడే మగువలకోసం సరికొత్త డిజైన్స్ ను అందుబాటులో ఉంచారు. సిల్వర్ కు సంప్రదాయ డిజైన్స్ ను జోడించి, చూడగానే మనసుదోచే జ్యూవెల్లరీని తయారు చేశారు. 

ఈ అక్కా చెల్లెళ్లది ఆగ్రా. ఆభరణాల డిజైనింగ్ మీదున్న ఇంట్రెస్ట్ తో దివ్య 11ఏళ్ల క్రితమే ఈ ఇండస్ట్రీలోకి వచ్చింది. 2004లో నిఫ్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన దివ్య, అమ్రపాలిలో డిజైనింగ్ కేరీర్ స్టార్ట్ చేసింది. ఏడాదిపాటు జైపూర్ లోని పెర్ల్ అకాడమీలో టీచింగ్ ఫ్యాకల్టీగా కూడా చేసింది. అంతేకాదు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనీష్‌ అరోరా దగ్గర జ్యూవెలరీ డిజైనర్ గా కూడా వర్క్ చేసింది. 2007, 2008లో లండన్ జరిగిన ఫ్యాషన్ వీక్ దివ్య తన డిజైన్స్ ను ప్రదర్శించింది. డైమండ్ జ్యూవెల్లరీలో ప్రసిద్ధి చెందిన ఫాబ్ జ్యూవెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో దివ్య కొన్నాళ్లు పనిచేసి....పోయిన ఏడాదే ముంబై నుంచి బెంగుళూర్ కు షిఫ్ట్ అయ్యింది.

image



ఇక దివ్య చెల్లెలు ప్రగ్యా.. ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎంబీఏ ఇన్సిడ్ లో పూర్తి చేసింది. బ్రెయిన్ అండ్ కంపెనీలో పనిచేసిన ప్రగ్యా... ప్రస్తుతం ఇన్ మొబి సంస్థలో స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ విభాగంలో పనిచేస్తోంది. వీకెండ్ లో మాత్రం క్విర్క్‌ స్మిత్ కోసం సమయం కేటాయిస్తోంది ప్రగ్యా.

జైపూర్ టూ బెంగుళూరు... సవాళ్లతో సావాసం

బిజినెస్ ను విస్తరించేందుకు ఈ అక్కచెల్లెల్లు ఇద్దరు బెంగుళూర్ కు షిష్ట్ అయ్యారు. దివ్య జ్యూవెలరీ డిజైన్స్ మీద దృష్టి సారిస్తే.... ప్రగ్యా మాత్రం కంపెనీ మార్కెటింగ్, సేల్స్ విభాగాన్ని చూసుకుంటోంది. అయితే క్విర్క్‌ స్మిత్ వర్క్ అంతా బెంగుళూర్ నుంచి కొనసాగినప్పటికీ... జైపూర్ లోనే జ్యూవెలరీ తయారీదారులున్నారు. దీంతో దివ్య జైపూర్ లోనే వర్క్ షాప్ ఏర్పాటు చేసి ఆభరణాల తయారీలో బిజీగా ఉన్నారు. బెంగుళూర్ టు జైపూర్ తిరుగుతూ వర్క్ చేయడం ఛాలెంజిగ్ గా తీసుకుని మరీ వర్క్ చేస్తున్నారు దివ్య, ప్రగ్యా. క్విర్క్‌ స్మిత్ సేల్స్‌ అన్ని ఫేస్ బుక్ పేజ్ ద్వారానే జరుగుతుంటాయి. బెంగుళూర్ లో సోల్ సాంటే, కిట్స్ మండిలో జ్యూవెలరీని సెల్స్ చేస్తుంటారు. అంతే కాదు కొన్ని ఎక్స్ క్లూజివ్ డిజైన్స్ ను టిమ్రి పేరుతో మరో కలెక్షన్ స్టోర్ ను కూడా ఏర్పాటు చేశారు.

image


క్విర్క్‌ స్మిత్ ముందున్న మరో సవాల్ ఏంటంటే.. సిల్వర్ జ్యువెల్లరీని సేల్ చేయడం. వెండి ఆభరణాలను కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. కానీ సిల్వర్ అంటే ఇష్టపడే కస్టమర్స్ ను ఆకర్షించడం అంత కష్టమేమీ కాదంటోంది దివ్య. తమ వద్ద ఉన్న జ్యూవెల్లరీ డిజైన్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు డిజైన్స్ ను తెగ ఇష్టపడుతున్నారని, అందుకు పెరుగుతున్న సేల్సే నిదర్శనం అంటున్నారు.

ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య స్టార్ట్ చేసిన తమ బిజినెస్ మంచి లాభంలో ఉందంటున్నారు. ఇప్పుడు తమకు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయని ఈ అక్కాచెల్లెల్లు మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ సక్సెస్ వెనుక తమకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ క్రెడిట్ ఇస్తున్నారు. ఈ ఏడాది నుంచి క్విర్క్‌ స్మిత్ బిజినెస్ ఈ-కామర్స్ లో కి ప్రవేశించబోతోంది. 2016నాటికి వీరి వ్యాపారం ఇంతకు నాలుగింతలు అయ్యే అవకాశం ఉంది.