వీళ్లు కరెంట్ అవసరం లేని వాషింగ్ మెషీన్ తయారు చేశారు..!!  

0

ఐడియా రాగానే సరిపోదు. దానికి ఆవిష్కరణ జతచేయాలి. అది సామాన్యుడి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడాలి. అలాంటి ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్ మార్కెట్లో చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి కోవలోకి చెందిందే కరెంటు అవసరం లేని ఈ వాషింగ్ మెషీన్.

వాషింగ్ మెషీన్ ఏంటి.. కరెంటు అవసరం లేకపోవడమేంటి.. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు కథ చదవండి మీకే అర్ధమైపోతుంది.

మనకు తెలుసు. నిత్యం మనం వాషింగ్ మెషీన తో ఎన్ని కుస్తీలు పడతామో.. ధోబీలతో ఎంత ఇబ్బంది పడతామో.. లాండ్రీ సర్వీసుల గోల అందరికీ అనుభవమే. పనిమనుషులు ఎంత నమ్మకంగా ఉన్నా ప్రతీసారీ డిపెండ్ అవలేం. అర్జెన్సీ ఉన్నప్పుడే అవసరానికి కనిపించరు. డ్రై క్లీనింగ్ ఖర్చు ప్రతీసారీ తట్టుకోలేం. సరేలే అని సర్దుకున్నా.. ఫ్యాబ్రిక్ విషయంలో నష్టపోతాం. ఒక్కోసారి మనకు ఇష్టమైన బట్టలు వాళ్ల చేతుల్లో పడి నాశనమవుతుంటాయి.

కథక్ మెహతా ఈ విషయంలో చాలా స్టడీ చేసింది. ఎంతోమంది మహిళల అభిప్రాయాలు సేకరించింది. సమస్య మూలాలు వెతికింది. అందరూ చెప్పే రీజన్ ఒక్కటే. ఎంతో సున్నితమైన బట్టలు వాషింగ్ మెషీన్ మూలంగా పాడైపోతున్నాయని.

సెంటర్ ఫర్ ఇన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) అహ్మదాబాద్ నుంచి టెక్ మానేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసింది కథక్. బిజినెస్ బేస్డ్ ఇన్నోవేటివ్ ప్రాడక్ట్ తయారు చేయాలనేది ఆమె లక్ష్యం. సరిగ్గా అప్పుడే పరిచయమయ్యాడు సోయెన్ వెర్మీర్. డచ్ జాతీయుడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఇండియా వచ్చాడు. ఇద్దరి అభిప్రాయాలూ, ఆలోచనలూ కుదిరాయి. రోజుల తరబడి ప్రాడక్ట్ మీద రీసెర్చ్ చేశారు. యాప్స్, డిజిటల్ బేస్డ్ ప్రాడక్టుల మీద వాళ్లకు నమ్మకం లేదు. వాటికి వ్యతిరేకం కూడా. అలా మేథోమథనం తర్వాత 2014లో మోనోనో అనే వెంచర్ స్టార్ట్ చేశారు.

మోనోనో అనేది వాషింగ్ మెషీన్ ఒక్కటే కాదు.. ఖరీదైన బట్టలను సుతిమెత్తగా, ఒక మల్లెపూవులా చూసుకునే లాండ్రీ డివైజ్ కూడా. అన్ని మెషీన్లలా అది పీస్ బై పీస్ రుబ్బేయదు. బట్టల పట్ల చాలా కేరింగ్ గా వుంటుంది. ఐదంటే ఐదు నిమిషాల్లో 8 కుర్తాలు.. లేదంటే 8 షర్టులను ఉతికేస్తుంది. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు. కరెంటుతోనూ పనిలేదు. బట్టలు అందులో పడేసి, డిటర్జెంట్ పోసి.. రెండు నిమిషాలు చేత్తో తిప్పితే చాలు. మిలమిలలాడే తెలుపు. మొన్ననే, అక్టోబర్ 23న అహ్మదాబాద్ లో ప్రాడక్ట్ లాంఛ్ చేశారు. ధర కేవలం రూ. 11వేలు మాత్రమే.

యువర్ స్టోరీ టేక్

మార్కెట్లో ఆన్ లైన్ లాండ్రీ సర్వీసులు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సదరు కంపెనీ మరింత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పైగా జెంటిల్ వాషర్ అనేది కొత్తగా వచ్చిన ప్రాడక్ట్. జనం దీన్ని రెగ్యులర్ వాషింగ్ మెషీన్లతో తప్పకుండా పోల్చుతారు. పైగా మాన్యువల్ అని చెప్తున్నారు. అంటే కరెంట్ అవసరం లేదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే.. ఐదు నిమిషాల్లో 8 బట్టలు ఉతకడం అనే అంశాన్ని కూడా ఇళ్లలో వాడే మెషీన్లతో కంపార్ చేసుకుంటారు. ఏదేమైనా, ఈ కొత్త ప్రాడక్ట్ జనాలకు నచ్చితే, తప్పకుండా మార్కెట్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. అందులో సందేహం లేదు.

ఇదెలా పనిచేస్తుందో చూడండి 

Related Stories