ఆన్ డిమాండ్ ఎకానమీ యాప్స్ కోసం సరికొత్త ప్లాట్‌ఫామ్ హైపర్ ట్రాక్

Thursday February 18, 2016,

3 min Read

ఉబర్ రైడ్ యాప్ చూడండి. ఎస్టిమేషన్ టైమ్ ఆఫ్ అరైవల్, అలాగే డ్రైవర్ ఫొటో, కాంటాక్ట్ నెంబర్.. ఇలా అన్ని వివరాలు ఉంటాయి. అన్ని యాప్స్‌లో ఈ వివరాలు ఉండవు? ఎందుకు ఉండవు? ఉంటే బాగుంటుంది కదా. సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేశారు.. కశ్యప్ దేవరా. ఆ ఆలోచనే ఆన్ డిమాండ్ ఎకానమీ యాప్స్ కోసం ఒక సరికొత్త ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేసింది. 

హైపర్‌ట్రాక్ ఏర్పాటు వెనుక..

కశ్యప్.. ఓ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. గత 15 ఏళ్లుగా ఇండియా, సిలికాన్ వ్యాలీ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఈ మధ్య కాలంలో రైట్ ‌థాఫ్, చౌపటి బజార్, చలోలను ప్రారంభించి, ఆ తర్వాత కొంతకాలానికి అమ్మేశారు. భారత స్టార్టప్ కంపెనీలకు హైపర్ ఫండింగ్ చేస్తున్నవారి వివరాలతో కూడిన పుస్తకం ‘ది గోల్డన్ టాప్’ అనే పుస్తకాన్ని రాశారు. ఇక తపన్ విషయానికొస్తే ఇటీవలే కవర్‌ఫాక్స్‌గా మారిన గ్లిట్టర్‌బగ్ సంస్థలో కెరీర్ మొదలుపెట్టారు. చలో స్టార్టప్‌లో ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సర్వర్ టీమ్‌కు నేతృత్వం వహించారు. కశ్యప్, తపన్ ఇద్దరూ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులు.

సరుకుల సరఫరా విషయంలో ఈటీఏ (అంచనా సమయం) చెప్పడం సవాలుతో కూడుకున్నది. ఒక చోటి నుంచి మరోచోటికి వెళ్లాలంటే చాలా అంశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ట్రాఫిక్ లేని సమయంలో ఒకలా, ఆఫీస్ సమయంలో మరోలా టైమ్ చెప్పాల్సి ఉంటుంది. ఇక వాహనాలను బట్టి కూడా ఈ అంచనా సమయం మారుతూ ఉంటుంది. కానీ హైపర్ ట్రాక్ దాన్ని కచ్చితంగా చెప్తుంది. అందుకోసం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. జీపీఎస్ డాటా సమస్యతో కూడుకున్నప్పటికీ క్లౌడ్ విధానంలో విశ్లేషించి లోకేషన్‌ను బరాబర్ గుర్తిస్తాం అని తపన్ అంటున్నారు. హైపర్ ట్రాక్‌ను ఉపయోగించడం వల్ల రోడ్డుపై డ్రైవర్ ఎలాంటి గందరగోళం లేకుండా, గమ్యాన్ని చేరుకుంటారని ఆయన చెప్తున్నారు.జ

‘‘జియోస్పేషియల్ డాటాను సాధించడం చాలా కష్టం. ఒక్కసారి ట్రాక్ చేయడం మొదలుపెడితే, ఒక్క రోజులోనే వేలాది డాటా పాయింట్లు జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ డాటాను స్టోర్ చేసి విశ్లేషించడం అంత ఈజీ కాదు. ఈ డాటాను అంతటిని స్టోర్ చేసి, ఏవైనా సందేహాలుంటే డాష్‌బోర్డు ద్వారా గానీ, ఏపీఐల ద్వారా గానీ తీర్చేందుకు సహకరిస్తాం’’- తపన్.

ఆన్ డిమాండ్ కంపెనీలు డెలివరీలను ట్రాక్ చేయడానికి రెండు మార్గాలున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఓఎస్ ద్వారా లొకేషన్ డాటాను రిసీవ్ చేసుకుని, దాని ఆధారంగా, గూగుల్ మ్యాప్స్ ద్వారా చేరుకోవడం ఒక పద్ధతి. మరో పద్ధతి- డెలివరీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌గా పేర్కొనే డ్రైవర్ యాప్ సాస్‌ను ఉపయోగించడం. కానీ చాలా ఆన్ డిమాండ్ స్టార్టప్స్‌లో పనిచేసే డెవలపర్లు ఎక్కువగా మొదటి పద్ధతినే ఉపయోగిస్తున్నారు. అందుకు కారణం తమ విధానాలకు డ్రైవర్ యాప్ సరిపోకపోవడం ఒకటైతే, ఆ యాప్ కోసం భారీగా చెల్లించాల్సి రావడం మరోటి. వీటికి బదులుగా హైపర్ ట్రాక్ డెవలపర్ టూల్ ఎస్‌డీకే, ఏపీఐలతో కూడుకున్నది. తమ సొంత డ్రైవర్ యాప్‌లకు ఎస్‌డీకేలను యాడ్ చేసుకుని, హైపర్ ట్రాక్ ఏపీఐలకు ఎక్కడ పికప్ చేసుకోవాలో, ఎక్కడ డెలివరీ ఇవ్వాలో చెబితే సరిపోతుంది. ఈ వివరాలు అందిస్తే చాలు హైపర్ ట్రాక్ ఆ ఆర్డర్‌ను తీసుకుని కస్టమర్లకు, బిజినెస్ ఆపరేషన్స్ మధ్య వారధిగా నిలుస్తుంది. అలాగే భవిష్యత్‌లో రిపోర్టింగ్‌కు, అనలైజ్‌కు వాడేందుకు ఈ డాటాను స్టోర్ కూడా చేస్తుంది.

undefined

undefined


ఇప్పటివరకు ఉన్న ఎంటర్‌ప్రైజ్ సాస్‌లకు బదులుగా తమది ఒక్కటే డ్రైవర్ సెంట్రిక్ ఏపీఐ విధానమని హైపర్‌ట్రాక్ యాజమాన్యం చెప్తున్నది. ఇన్‌హౌజ్‌ అభివృద్ధికి అయ్యే ఖర్చులో కొద్ది మొత్తంతోనే ట్రాకింగ్ సమస్యను హైపర్‌ట్రాక్ పరిష్కరిస్తున్నది. అలాగే ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సంస్థ పనితీరు ఎలా ఉండే అవకాశం ఉందో విశ్లేషించుకునేందుకు కూడా హైపర్‌ట్రాక్ డేటాను అందుబాటులో ఉంచుతుంది. 

డజనుకు పైగా పార్ట్‌నర్స్..

హైపర్‌ట్రాక్‌కు ప్రస్తుతం డజనుకు పైగా బెటా పార్ట్‌నర్స్‌ ఉన్నారు. అలాగే రోజుకు వెయ్యి డెలివరీలకు పైగా ట్రాకింగ్ చేస్తున్నది. భారత్, సిలికాన్ వ్యాలీలో వీరి సేవల కోసం ఎదురుచూసే సంస్థలున్నాయి. కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా పనితీరును అంచనా వేసుకుంటున్నారు. మరింత విస్తరించే కొద్దీ, మరిన్ని కంపెనీలను సేవా పరిధిలోకి తీసుకొస్తాం అంటున్నారు తపన్. గూగుల్ మ్యాప్స్, ఉబర్ మ్యాప్స్‌ను రూపొందంచడంలో సహకరించిన ఇండియా, సిలికాన్ వ్యాలీ ఇండస్ట్రీ నిపుణులే హైపర్‌ట్రాక్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. అలాగే ఇన్వెస్టర్లు కూడా పెద్ద మొత్తంలోనే ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు.

అవకాశాలు అపారం..

ఈ-కామర్స్ బిజినెస్ విస్తరించి రెండు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ, వ్యాపార సంస్థల్లో కేవలం 5% మాత్రమే ఆన్‌లైన్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ట్యాక్సీ, రెస్టారెంట్స్, గ్రోసరీస్, ప్లంబింగ్ సర్వీసెస్.. ఇలా ఇలాంటి సేవలన్నీ ఇటీవలే ఆన్‌లైన్‌లోకి వస్తున్నాయి. ఇందుకు కారణం స్మార్ట్‌ఫోన్లు రావడమే. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఈ కామర్స్‌ ద్వారా బుక్ చేసుకుంటే ఒక్క రోజులోనే వస్తువు ఇంటికి చేరుతున్నది. ప్రస్తుతమైతే 35 నిమిషాల్లో లేదా నిర్ణయించిన సమయంలోనే ప్రాడక్ట్‌ను డెలివరీ చేసేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.