మీ 'యాప్' సక్సెస్‌కు పది సీక్రెట్స్ !

ఒక మిలియన్ యాప్ డౌన్‌లోడ్స్ కష్టమేం కాదు తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాన్ని అందించే అద్భుతమైన సైట్స్ఆన్ లైన్ చిట్కాలతో అదిరిపోయే ‘యాప్’ వ్యాపారంప్రఖ్యాత ఆన్ లైన్ వేదికలపై యాప్స్ ప్రచారం ఉత్తమం

0

పదిలక్షల యాప్ డౌన్ లోడ్సా..! యాప్స్‌ను అభివృద్ధి చేసే వారికి ఇది అంత సులభమైన లక్ష్యం కాదు. చాలా యాప్ డెవలపర్స్ .. ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు. అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తుంటారు. కానీ.. ఈస్థాయిని అందుకునే విషయంలో మాత్రం ఎందుకో ఘోరంగా విఫలమవుతుంటారు.

మీ యాప్ డౌన్ లోడ్స్‌ను పెంచుకోవడం సమర్థవంతమైన, సహాయకరమైనది. దానికి పది ఆన్‌లైన్ దారులున్నాయి. దీంతో మీరు అనుకున్న మిలియన్ మార్క్ లక్ష్యాన్ని సులభంగా, వేగంగా చేరుకోగలరు.

తెలివైన యూఐ(UI) (Brilliant UI)

మీ యాప్ వినియోగదారుల్ని ఆకర్షించలేక పోయినట్లయితే, మీరు ఏం చేసినా ప్రయోజనముండదు. మీ వినియోగదారులు చాలా ఏళ్లుగా పరిణితిని సాధించినవాళ్లు. కాబట్టి.. మంచి యాప్ కోసం వాళ్లు సమయాన్ని, పెట్టుబడిని పెట్టడానికి సిద్ధంగా వుంటారు. ఇందులో రెండు విషయాలు. మొదటిది.. యూఐ(UI) అన్ని డివైస్‌లలోనూ స్పందించేలా వుండాలి. రెండోది.. దాన్ని మొదటిసారిగా వినియోగించినప్పుడే వారికి అమితమైన సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాలి.

ఒక యాప్(అప్లికేషన్)ను అభివృద్ధి చేసే డెవలపర్ ప్రధానంగా మనసులో ఉంచుకోవాల్సింది .. ఆకర్షించగలిగే , సమర్థవంతంగా ఉపయోగపడే గొప్ప యాప్ ను రూపొందించడం. వినియోగదారులకు సహాయపడేలా దానికి సరికొత్తగా పేర్లను పెట్టడం.

Crash Free App

వినియోగదారులెవరూ కాలం చెల్లిన యాప్ (అప్లికేషన్)లను ఇష్టపడరు. సున్నితంగా, కాలానుగుణంగా పనిచేసే యాప్స్ అంటేనే మోజుపడతారు. రూపకర్తలు కూడా ప్రధానంగా దీనిపైనే దృష్టి పెట్టాల్సుంటుంది. బీటాలో యాప్‌లను పరీక్షించడమనేది కూడా డెవలపర్స్‌కు ఇచ్చే సలహా. ఇందులో చాలా ప్లాట్‌ఫామ్‌లున్నాయి.

1. బీటా లిస్ట్(Betalist)

2. ఎర్లీ బర్డ్ (Erli Bird)

3. బీటా టాక్స్ (Beta Talks)

4. బీటా బౌండ్ (Beta Bound)

ఇంకా చాలా రకాల ఆన్ లైన్ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫామ్ లు అప్లికేషన్ డెవలపర్స్ సమర్థవంతమైన యాప్ లను తయారుచేసేందుకు, వాటిని విక్రయించేందుకు తోడ్పడుతున్నాయి. మీ యాప్స్ కు వచ్చే రివ్యూలను బట్టే వాటి సమర్థత , వినియోగం ఆధారపడి వుంటుంది. కొన్ని రివ్యూలయితే.. మన యాప్స్ ను నిరర్థకమైన, ప్రయోజనం లేనివిగా కూడా తేల్చేస్తుంటాయి.

ప్లే స్టోర్‌లో యూజర్ రేటింగ్ (User Ratings on Playstore )

పనికిరాని అప్లికేషన్స్‌ ను తయారు చేయడమే కాదు.. వినియోగదారులు వాటికి అందించే తక్కువ రేటింగ్‌తో ఆ యాప్ చాలా నిరర్థకమైనదిగా తేలిపోతుంటుంది. డెవలపర్ ప్రధాన లక్ష్యం యాప్‌కు సంబంధించిన సమాచారాన్ని ఓ క్రమ పద్ధతిలో వినియోగదారులకు తెలియజేస్తుండాలి. వారి మద్దతును పొందగలగాలి. ఈ రంగంలో అనుభవజ్ఞులు చెప్పేదేంటంటే... వినియోగదారుల ‘యాపీ’నెస్‌ను అర్థం చేసుకోవాలని. యాప్ డెవలపర్స్ బృందం మొత్తం రూపకల్పనకు ముందే వాటిని క్షేత్ర, సూక్ష్మస్థాయిలో ఆలోచించాలి. వినియోగదారుల పునర్విమర్శలను, వాళ్లు ప్లే స్టోర్ లో ఇచ్చే రేటింగ్ లను పరిగణనలోకి తీసుకుని పరిశీలించాలి. దీనివల్ల యాప్స్ ను రూపొందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుస్తాయి. యాప్ అభివృద్ధి చేసే వాళ్లు వినియోగదారుల అనుభవాలను ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా.. వారికి అత్యుత్తమ సేవలను, ఫలితాలనందించే ఉత్పత్తిని అందించేందుకు వీలుంటుంది.

In-App Referrals

చాలామంది వినియోగదారుల మౌత్ టాక్‌తో యాప్స్‌కు విపరీతమైన ఆదరణను లభిస్తుంది. క్యాబ్ ఇండస్ట్రీ ఇలాంటి యాప్స్‌ను వినియోగించడంలో ముందుంది. మీరు తయారు చేసే యాప్ కూడా నలుగురు చెప్పుకునేలా వుండాలి.

కంటికి ఆకట్టునే ఉత్పత్తిని తయారు చేయాలంటే చాలామంది ఉత్పాదకదారులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ఎంతో సమయాన్ని, డబ్బును ఖర్చు పెడుతుంటారు. అందుకే ప్లగ్ అండ్ ప్లే పద్ధతి ఇందులో మంచిది. చాలా సులభంగా సమస్యలను పరిష్కరించేది కూడా. యాప్ వైరాలిటీ అనేది ఇలాంటిదే.

యాప్ వైరాలిటీస్ రూపకర్తలు ఎదుర్కొనే చాలా సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంటుంది. ఈ-కామర్స్ అప్లికేషన్ ను రూపొందించడంలో దేశంలోనే సమర్థవంతమైనది పేరుగాంచింది కూడా. షాపింగ్, మొబైల్ రీచార్జ్, ట్రావెల్, టెలికామ్ లాంటి నిత్యావసరాలకు ప్రయోజనకరంగా వుండేలా యాప్ లను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది యాప్ వైరాలిటీస్.

ఆమోదయోగ్యం (Please The Press)

ప్రఖ్యాత ఆన్ లైన్ వేదికలో మీ యాప్ కు సంబంధించిన పునర్విమర్శలు వచ్చాయంటే... అది మీ అప్లికేషన్ కు అదనంగా ఎంతోకొంత ఉపయోగకరంగా వుంటుంది. అలాంటి ఉత్పత్తి త్వరగా, వేగంగా ఎదిగేందుకు ఆస్కారముంటుంది. లక్షల మంది పాఠకులు ఆన్ లైన్ లో వీక్షిస్తుంటారు కాబట్టి.. వాళ్లలో కొందరైనా అనుకూలమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశముంటుంది. అది ప్లే స్టోర్ లో యాప్ కు పేరుతెచ్చేందుకు సహకరిస్తుంది. కాబట్టి రివ్యూలకు భయపడకుండా ఒక మంచి యాప్ ను తయారుచేసిన రూపకర్తలు.. వాటిని పేరున్న ఆన్ లైన్ వేదికలపై ప్రదర్శించుకోవడమనేది మన ఉత్పత్తిని బాగా ప్రచారం చేసుకోవడమే అవుతుంది. ఉదాహరణకు యువర్ స్టోరీ యాప్-ఫ్రైడే ప్లాట్ ఫామ్ కు మద్దతిస్తుంది. ఇది ఎన్నో యాప్స్ ను ప్రారంభించిన మంచి ఆన్ లైన్ వేదిక .

సరైన వేదికపై ప్రారంభం (Launching On The Right Platform)

యాప్ ను ప్రారంభించే ముందు ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వడమనేది అదనంగా ఉపయోగకరంగా వుంటుంది. దీనివల్ల మీ యాప్ యొక్క విశిష్టత, దీర్ఘాయువు మరింత పేరుగుతుంది. వాణిజ్యం, సమాచార సంబంధమైన విషయాలు ఎక్కువ బడ్జెట్ తో కూడుకున్నవే అయినా.. ప్రస్తుత కాలంలో వినియోగదారులు, యాప్ కమ్యూనిటీ నుంచి వచ్చే రివ్యూలు, స్పందనే వీటన్నింటికంటే గొప్పది.

ఒక యాప్ లేదా ఉత్పత్తి ఆన్ లైన్ వేదికపై ప్రదర్శించినప్పుడు.. దాన్ని ఆదరించి వినియోగించే వాళ్లకు చాలా ఆకర్షణీయంగా కనబడాలి. ప్రోడక్ట్ హంట్ (Product Hunt) అనేది అలాంటి ఆన్ లైన్ పోర్టలే. మీరు రూపొందించే ఉత్పత్తికి సరిపోయే రూపాన్ని, ప్రదర్శనను కల్పిస్తుంది ప్రోడక్ట్ హంట్. ఇందులో నుంచి వచ్చే వినియోగదారుల ప్రతిస్పందనలు, పునర్విమర్శలు మీ ఉత్పత్తి పురోగతికి అండగా నిలుస్తుంది. అదనపు ఆకర్షణను కట్టబెడుతుంది.

యాప్ డౌన్ లోడ్స్ పెంచే ఇన్ యాప్ షేర్ ఇంటర్నెట్ (Growth Hacking In App Share Intent )

యాప్ డౌన్ లోడ్స్ ను పెంచుకోవడానికి అతి సులభమైన మార్గం .. ఇన్ యాప్ షేర్ ఇంటర్నెట్ (In App Share Intent). చాలా యాప్స్ కు సాధారణ ఇంటర్నెట్ షేరింగ్ పై నియంత్రణ వుండదు. ఇదే సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ఫోన్ లకు చేరి ప్రచారం కల్పించే దారికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. చాలా మంది వినియోగదారులు తమకు కావాల్సిన దానికోసం ఎన్నో అనవసరమైన ఐకాన్ లను వెదుకుతుంటారు. అలాంటప్పుడు మీ యాప్ యొక్క విశిష్టతను లక్షల మంది వినియోగదారుల్లో ఎవరని ఎన్నకుంటారు .

విషయమే పెట్టుబడి (Invest Into Content )

ఈ రోజుల్లో ఏ వ్యాపారమైనా ..పేరుతోనే జనాల్లో విస్తృత ప్రచారాన్ని పొందగలుగుతోంది. ఆ పేరు కూడా ఆ వ్యాపారం లేదా ఉత్పత్తి విశేషాలను తెలిపేలా వుండాలి. యాప్ లను రూపొందించే వ్యాపారం ఇందుకు మినహాయింపేమీ కాదు. యాప్ విశిష్టత తెలిసేలా దాని పేరుండాలి. దీనివల్ల ఎలాంటి అయోమయం లేని ఉపయోగకరమైన యాప్ ను దిగుమతి చేసుకునేందుకే ఎక్కువ మార్గాలుంటాయి.

1. యాప్ రూపకర్తలు విధిగా ఆన్ లైన్ బ్లాగులను చేరుకునేలా సూక్ష్మమైన వెబ్ పేజ్ లను తయారు చేయాలి. దీనివల్ల వినియోగదారులు యాప్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వెసులుబాటు వుంటుంది. ఇదే పెద్ద ప్రచారాస్త్రమవుతుంది.

2. బ్లాగులు, చిన్న చిన్న వెబ్ పేజీలు, థర్డ్ పార్టీ రివ్యూలు ద్వారా యాప్ కు మార్కెట్ విలువల్ని పెంచుకోవచ్చు. వినియోగదారులే కాకుండా , యాప్ ను చూసి బాగుందని చెప్పే వాళ్ల స్పందనలు కూడా .. మన ఉత్పత్తి జనం నోళ్లలో నానేలా చేస్తుంది. అన్నింటికంటే దృశ్యమానం లేదా దృశ్య రూపంలో మన ఉత్పత్తిని వినియోగదారులకు చూపించడమనేది తిరుగులేని ప్రచారాస్త్రం. దృశ్యాల రూపంలో అయితే మన ఉత్పత్తి యొక్క సేవల్ని 74 శాతం మంది అర్థం చేసుకునే అవకాశముంది.

సామాజిక వేదికపై నిలవాలి (Up Your Social Game)

వినియోగదారుల్ని మీ యాప్ పట్ల ఆకర్షితుల్ని చేసి దగ్గర చేసుకోవడానికి మరో మంచి మార్గం సామాజిక అనుసంధాన వేదికలు. మీ యాప్ విశిష్టతల్ని వినియోగదారులకు తెలిపేందుకుకే కాదు. మీ ఉత్పత్తిలోని లోటు పాట్లను, సవరణలను వినియోగదారులు తమ ప్రతిస్పందనలు, అభిప్రాయాల ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుంది.

సంప్రదాయ పద్ధతులను వ్యతిరేకించే వారికి సామాజిక మాధ్యమాలు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వేదికగా చెప్పొచ్చు. కాబట్టి.. యాప్ రూపకర్తలు కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడానికి వీటిని విరివిగా వాడుకోవాలి. మరో అద్భుతమైన ఆలోచన కూడా వుంది. అదే.. యాప్ ను సామాజిక మాధ్యమాలతో అనుసంధానం చేయడం. ఇది వినియోగదారులు ఉత్పత్తికి సంబంధించిన సకల సమాచారం తెలుసుకునేందుకు చాలా దోహదపడుతుంది. నచ్చితే ఇతరులకు ఇదే వేదికపై తమ అభిప్రాయాలను, స్పందనలను తెలియజేసే అవకాశమూ వుంటుంది.

డిస్కౌంట్ ట్యాగ్..తిరుగులేని అస్త్రం (Stir Up A Discount )

చివరగా.. మీరు మీ యాప్ కు ధర ను నిర్ణయించాలనుకుంటే, డిస్కౌంట్ అనే పదం వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని గ్రహించాలి. ఇది మీ యాప్ ను ఉపయోగించే వారినే కాకుండా కొత్త వినియోగదారుల్ని తెచ్చిపెడుతుంది. పైగా మీ యాప్ వద్దనుకున్న వారిని కూడా మరోసారి ప్రయత్నించి చూద్దామని వినియోగించుకునేలా ఆకర్షిస్తుంది.

ఇలా పండంటి ‘యాపీ’నెస్ వ్యాపారానికి పది సూత్రాలు తూ.చ. తప్పకుండా పాటిస్తే.. లక్షల డౌన్ లోడ్స్ మార్క్ అనేది పెద్ద విషయమేం కాదు. సో... యాప్ డెవలపర్స్ ..! ఈ సూత్రాలను అప్లికేషన్లను రూపొందించేటప్పుడు పాటిస్తారు కదా...!