రెండు సార్లు నడకపోయినా... స్టార్టప్‌తో స్థిరపడిన ఆత్రేయి

రెండు సార్లు నడకపోయినా... స్టార్టప్‌తో స్థిరపడిన ఆత్రేయి

Monday July 06, 2015,

4 min Read

“మనం దేన్నైనా విపరీతంగా కోరుకున్నప్పుడు.. మనకు జీవితం సవాల్ విసురుతుంది. మన ధైర్యాన్ని, దానిపై మనకున్న ఇష్టాన్ని పరీక్షిస్తుంది. ఏం జరగలేదు అనుకుంటామో... లేక ఆ సవాల్ ఎదుర్కునేందుకు సిద్ధంగా లేమని అనుకుంటామో! ఏదైనా సరే ఆ సమయంలో మనం వ్యవహరించే తీరు మనల్ని అద్దం పడుతుంది. అయితే సవాల్ మన సమాధానం కోసం ఎదురుచూడదు. జీవితం ఎప్పటికి వెనక్కు జరగదు” పాలో కోల్హో.

పాలో చెప్పిన విషయాలను ఆత్రేయి నిహార్‌చంద్ర అంగీకరిస్తారు. జీవితం ఆమెకు ఎన్నో సవాళ్లు విసిరింది. బహుశా బలహీన వ్యక్తి వేరే ఎవరైనా అయితే.. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయేవారు. భయంకరమైన సవాళ్లు, వాటితో చేసిన ప్రయాణం కారణంగా... ఆత్రేయి మరింత ధృడంగా మారారు. ఇప్పుడింత ధైర్యవంతురాలిగా ఆమె ఉన్నారంటే... అది జీవితం నేర్పిన పాఠాల నుంచే.

image


'రివైజ్ డైట్' వ్యవస్థాపకురాలు ఆత్రేయి. పెద్దగా త్యాగాలు చేయకుండానే ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాలు గడిపేలా చేసేందుకు.. తన జీవితాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు... అంకితం ఇచ్చానంటారు. బరువు తగ్గడం, తద్వారా ఆరోగ్యంపై ఉండడంపై రివైజ్ డైట్ సహాయం చేస్తుంది.

రెండోసారి నడక నేర్చుకున్న ఆత్రేయి

ఆంట్రప్రెన్యూర్‌షిప్ ప్రయాణాన్ని తన 17వ ఏటే ఆత్రేయి ప్రారంభించారు. చదువు కొనసాగిస్తూనే తన తండ్రి వెంచర్ ప్రోనైక్ ఫోర్జ్ అండ్ ఫ్లాంగ్స్‌తో కలిసి పని చేశారామె. జీవితం ఎప్పుడూ ప్రశాంతగా ఉండదు కదా.. 23 ఏళ్ల సమయంలో విధి ఆమెను వెక్కిరించింది. ఒక యాక్సిడెంట్ కారణంగా.. ఆమె ఒక లిగ్మెంట్ కూడా దెబ్బతింది. దీంతో ఏడాదిపాటు ఆమె మంచానికే పరిమితమయ్యారు. చిన్న వయస్సులోనే ఆమెకు ఇది తీవ్రమైన దెబ్బ. నడక వంటి కనీస అవసరాలకూ ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి తనకు తాను స్వయంగా నడిచేందుకు ఆమెకు 14నెలలు పట్టింది. ఈ సమయంలో తన ఇంటికి దగ్గరలోని నేచురోపతి సెంటర్‌లో... అక్కడి ట్రీట్మెంట్ విధానాలను, వారు అవలంబించే సైన్స్‌ను అర్ధం చేసుకున్నారు మైత్రేయి.

website

image


యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మైత్రేయి బెంగళూరుకు మారి, ఐఐఎంలో ఎన్ఎస్ఆర్ విభాగంలో జాయిన్ అయ్యారు. కోర్స్ పూర్తయ్యాక ఐటీ ఉద్యోగం వెతుక్కోవడం కష్టమైంది. 

“నిజానికి మా నాన్నగారి కొంతమంది స్నేహితులకు సొంత కంపెనీలున్నా.. వారు కూడా నాకు జాబ్ ఇవ్వలేదు”అని చెప్పారు మైత్రేయి.

ఈ పరిస్థితికి ఇతరులను నిందించడం, మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేయకుండా.... తిరిగి ఐఐఎం బెంగళూరుకు చేరిన ఆత్రేయి... పరిశోధనలు ప్రారంభించి, పీహెచ్‌డీ వైపు దృష్టి మళ్లించారు. ఆ సమయంలోనే పరిచమైన వ్యక్తే తర్వాత ఆమె భర్తగా మారారు. బెంగళూరులోనే నివాసముంటూ ఓ ఫుడ్ బ్లాగ్ నిర్వహించడం ప్రారంభించారామె. భారతీయ స్పైసీ వంటకాలను.. అదే రుచితో, మరింత ఆరోగ్యంగా ఎలా వండొచ్చో చెప్పేదే ఈ బ్లాగ్. రివైజ్ డైట్‌కు ఇదే పునాది.

మరో యాక్సిడెంట్‌తో కథ మొదటికి

ఆత్రేయి నిర్వహించిన ఫుడ్ బ్లాగ్ సూపర్ సక్సెస్ అయింది. ఐఐఎం బెంగళూరులో ఉద్యోగం కూడా బాగానే ఉంది. ఈ సమయంలో ఎవరైనా అనుకునేదొక్కటే. ఆమె కష్టాలన్నీ తీరిపోయాయనే. అయితే.. ఆమెకు ఎదురైన సవాళ్లకు ఇది ప్రారంభం మాత్రమే. ఈ సమయంలో ఆత్రేయికి మరోసారి యాక్సిడెట్ అయింది. తిరిగి అదే మోకాలు దెబ్బతింది. కొన్ని నెలలకు ఆ కాలు పూర్తిగా పని చేయడం మానేసింది.

ఈసారి పరిస్థితులకు ఆత్రేయి ముందుగానే సిద్ధమయ్యారు. ఐఐఎం బెంగళూరుకు తాత్కాలికంగా సెలవు ఇచ్చి... గతంలో ఆమెకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ దగ్గరకు వెళ్లారు. అఫ్‌కోర్స్.. బెంగళూరులో అత్యంత ఖరీదైన ట్రీట్మెంట్ చేయించుకోలేకపోవడం కూడా ఇలా సొంతూరికి వెళ్లడానికి గల మరో కారణం

సాధారణంగానే సానుకూల ఆలోచన ధోరణి గల వ్యక్తి కావడంతో.. మరోసారి ఎదురైన ఈ పరిస్థితిని పూర్తిగా ఆస్వాదించాలని భావించారు ఆత్రయి. 

“ ప్రతీ నల్లటి మేఘం చుట్టూ ఒక వెండి గీత ఉంటుంది”అంటున్నారు ఆత్రేయి. 

గుజరాత్‌లోని నాచురోపతి సెంటర్ నుంచి ఆమె ఆరోగ్యంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సర్జరీ చేయించుకోకుండా బరువు తగ్గాలని సూచించారు డాక్టర్లు. దీనిద్వారా కాలిపై బరువు తక్కువగా పడుతుందని చెప్పారు. అయితే దెబ్బతిన్న లిగ్మెంట్‌తో బరువు తగ్గడం అనేది సామాన్యమైన విషయంకాదు. దీంతో ఆమె చిన్నపాటి ఎక్సర్‌సైజులు, యోగాలతోపాటు.. ఆహారంపై దృష్టి పెట్టారు. ఇది ఆమె త్వరగా కోలుకోవడానికి, షెడ్యూల్ కంటే ముందుగా బెంగళూరు రాగలగడానికి కారణమైంది.

ఊహ తెలిశాక రెండోసారి నడక నేర్చుకున్న ఆత్రేయి... రెట్టించిన ఉత్సాహంతో.. సమస్యలు లేకుండా జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు. కుటుంబం నుంచి కూడా మద్దతు తగ్గిపోతుండడంతో... ఐఐఎం బెంగళూరుకు మళ్లీ రాసాగారు. అయితే.. ఇందుకు ఖర్చు ఎక్కువ అయిపోతోంది. ఆత్రేయి స్వయంగా ఫుడ్, న్యూట్రియంట్ స్పెషలిస్ట్ కావడంతో... సొంతగా ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభించాలంటూ స్నేహితులు సలహా ఇచ్చారు. దీంతో రివైజ్ డైట్ మరోసారి ఆమె జీవితంలో కీలకంగా మారింది.

ఆరోగ్యంపై దృష్టి పెడితే బరువు తగ్గినట్లే

“మీరు బరువు తగ్గడంపై దృష్టి పెట్టకండి, మీ ఆరోగ్యంపై ఆలోచించండి. వెయిట్ లాస్ అంటే అదేమీ నష్టపోవడం కాదు. ప్రజలకు తమ ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. నిజానికి అనారోగ్యాలకు దూరంగా ఉండడం అంత కష్టమైన విషయమేం కాదు. జీవితంలో ఆరోగ్యం, సహనం... ఈ రెండు సరైన స్థాయిలో ఉంచుకోగలిగితే.. మనస్సు రెట్టించిన ఉత్సాహంతో ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది” అంటున్నారు ఆత్రేయి.

తన స్నేహితులతో కలిసి రివైజ్ డైట్ వెంచర్‌ను ప్రారంభించారు మైత్రేయి. షవర్మ రోల్స్, జంక్ ఫుడ్ తింటూనే.. 2 నెలల్లో తొలి క్లయింట్‌ 12కిలోల బరువు తగ్గడంతో ఈ స్టార్టప్‌కు బూస్ట్ వచ్చింది. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే అనతి కాలంలో పదిమంది నోళ్లలో నానింది. ఏడాది కాలంలో 100మంది క్లయింట్స్‌ను ట్రీట్ చేశారు. వీరిలో అధికశాతం మహిళలే.

image


ప్రస్తుతం దేశవ్యాప్తంగా పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు... ఇలా అందరికీ సర్వీసులు అందిస్తోంది రివైజ్ డైట్. వారి రోజువారి ఆహారం తీసుకుంటూనే... రెండేళ్లలో 200మందికి పైగా బరువు తగ్గేందుకు సహాయపడ్డారు ఆత్రేయి. నెలకు ₹1200 ఛార్జ్ చేస్తారు ఆత్రేయి. ఈ రంగంలోని ఇతర ఏ కంపెనీలతో పోల్చినా... ఇది చాలా తక్కువే.

ఏడాదికి 200మంది క్లయింట్లకు చేరుకోవాలన్నది ఆత్రేయి ప్రస్తుత లక్ష్యం. న్యూట్రిటౌన్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్, ఆత్రేయిలు ప్రారంభ సర్వీసులు ఉచితంగానే ఇస్తున్నారు. వెయిట్‌లాస్‌తో పాటే... తీవ్రవ్యాధులు కలవారికీ సర్వీసులు అందిస్తున్నారు. ఇప్పుడామె ఫుడ్ & న్యూట్రిషన్ విభాగంలో ఎంఎస్‌సీ చేస్తున్నారు. న్యూట్రిషన్, ఫుట్, నాచురోపతి విభాగాల్లో తనకు గల అనుభవంతో... తన వెంచర్‌ను విస్తృతపరచేందుకు నిధులు సేకరించాలని భావిస్తున్నారు. ఏటా 80వేల మందికి తన సర్వీసులు అందించగలగాలన్నది ఆమె ఫ్యూచర్ టార్గెట్.

రెండు సార్లు నడక కోల్పోయిన ఒక వనిత... ఈ స్థాయికి చేరగలగడం నిజంగా అభినందనీయం. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

website