కాలేజ్ డ్రాపౌట్.. హ్యాకర్‌గా మారి ఇప్పుడో సంస్థ సారధి

హ్యాకింగ్ నుంచి పారిశ్రామిక వేత్త వరకూకాలేజ్ డ్రాపవుట్ నుంచి టెక్నిప్రెన్యూర్ వరకూతిట్టిన వారే నోరెళ్లబెట్టే వరకూఓ హ్యాకర్ జీవితమే ఇండియా ఇన్ఫోటెక్

కాలేజ్ డ్రాపౌట్.. హ్యాకర్‌గా మారి ఇప్పుడో సంస్థ సారధి

Wednesday May 13, 2015,

6 min Read

ఓ హ్యాకర్ జీవితం ఇలాంటి మలుపు తీసుకోవడం అసాధారణ విషయం. కాలేజ్ డ్రాపవుట్ సాంకేతిక పారిశ్రామిక వేత్తగా ఎదగడంలో ఎన్నో కీలక దశలున్నాయి. ఇండోర్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన శశాంక్ చౌరీ... అల్లారుముద్దుగా పెరిగాడు. 13ఏళ్ల వయసులోనే కంప్యూటర్‌తో అతనికి ఏర్పడ్డ ప్రేమానురాగాల కారణంగా... జీవితం మలుపు తీసుకుంది. రాత్రంతా కంప్యూటర్ గేమ్స్ ఆడి... ఉదయం స్కూల్‌నే కాదు, పరీక్షలనీ ఎగ్గొట్టేసేవాడు. తర్వాతి కాలంలో కోడింగ్ అతనికి ప్రాణమైంది. అతని ఫ్రెండ్స్ బ్యాచ్‌కి హ్యాకింగ్ చాలా ఇష్టం. చాట్ రూముల్లో ప్రతీ కోడింగ్ చేసే వ్యక్తీ... బెస్ట్ హ్యాకర్ అయ్యేందుకు ప్రయత్నించేవారు. లైఫ్ జర్నీలో అడుగులేసేందుకు అతనికి... ఇది చాలా ఉపయోగపడింది. క్రాక్‌పాల్.కాం నుంచి ప్రతీ ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసినందుకుగాను... శశాంక్‌కు$ 50డాలర్లు లభించేవి.

శశాంక్ చౌరి, ఇండియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు

శశాంక్ చౌరి, ఇండియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు


హ్యాకింగ్‌లో కింగ్

ఇంజినీరింగ్ కాలేజ్‌ మొదటి ఏడాదిలో కూడా హ్యాకింగ్ ని కంటిన్యూ చేసాడు శశాంక్. "నేను 40 భారత ప్రభుత్వ వెబ్ సైట్లు , 100 బడా కార్పొరేట్ సంస్థల వెబ్‌సైట్లను.. 18 నిమిషాల్లోపే హ్యాక్ చేయగలిగాను. వీటిలో ఎన్‌టీపీసీ టెండర్లు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ కూడా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ సరిగా లేదంటూ CERT(కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం), NIC(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌)లకు దీనిపై రిపోర్ట్ పూర్తి స్థాయి రిపోర్ట్ పంపాయి. అయితే వారు దీన్ని పట్టించుకోలేదం"టారు శశాంక్.

వైరస్‌లను ట్రాక్ చేయడం, ఒకదాని వెంట ఒకటి చొప్పున అల్గారిథంలు రాయడం అతనికి కంప్యూటర్ నేర్పిన విద్య. ఇండోర్ పోలీసులకు రెండేళ్లపాటు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్‌గానూ బాధ్యతలు నిర్వహించాడు శశాంక్. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రధాన సమస్య వెబ్ సెక్యూరిటీనే అయినా... దీని ద్వారా డబ్బు సంపాదించడం చాలా కష్టమన్నది ఇతని వాదన. అలాగే ఇంటర్నెట్ ఆధారిత చెడు కార్యకలాపాలకు... ఇంటర్నెట్ రిలే చాట్ నెట్వర్క్‌లే వేదికలంటారు శశాంక్.

"ఐఆర్‌సీ చాట్‌లలో మనం ఎవరితో చాట్ చేస్తున్నామో తెలిసే అవకాశం ఉండదు. ఇంటర్‌పోల్, ఎఫ్‌బీఐ, సీఐఏ, డెఫ్‌కాన్ హ్యాకర్స్, లూల్సెక్, నాజీగోడ్జ్... ఇలా కొన్ని సంస్థల వ్యక్తులు ప్రతీ రంగంలోనూ ఉంటారు. వీటితోపాటు కొన్ని పెద్ద కంపెనీలు పారితోషికం ఇచ్చేవిధంగా హ్యాకర్లను నియమించుకుంటాయి. ఓ ఏడాది పాటు ఇలాంటి బాధ్యతలే నిర్వహించినా... నేను పాతుకుపోవాల్సింది ఇందులో కాదనే విషయం నాకర్ధమైంది. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమైనా అవుతుంది. లేదా చెడుకైనా ఉపయోగపడ్తుంది. ఇతరుల మెయిల్స్‌లోకి హ్యాక్ అయి, మానిటర్ చేయడాన్ని వృత్తిగా చేసుకోవాలని నేననుకోలేదంటారు శశాంక్.

ఇంజినీరింగ్ పూర్తి చేయడంపైనా అంతగా ఇంట్రస్ట్ కలగలేదు. కోర్సులు, కరికులం చాలా బోరింగ్‌గా అనిపించడంతో... సెకండియర్‌లోనే టాటా చెప్పేశారు శశాంక్.

image


ఈ కాలేజ్ డ్రాపవుటే వెబ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్

స్టీవ్ జాబ్స్ ఓ కాలేజ్ డ్రాపవుట్. అయినా సరే యాపిల్ అనే మహా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అపరమేధావి జాబ్స్. బిల్‌గేట్స్ కూడా హార్వర్డ్‌లో చదువును మధ్యలో ఆపేసి మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పారు. ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బెర్గ్ కూడా కాలేజ్ డ్రాపవుటే. అయితే భారత్‌లో మాత్రం మధ్యలోనే చదువు మానేసేవాళ్లంటే సదభిప్రాయం ఉండదు. తల్లిదండ్రులు శశాంక్‌ని ఏమీ అనకపోయినా.. చుట్టుపక్కల వారు మాత్రం విమర్శించే ఒక్క ఛాన్స్ కూడా వదులుకోలేదు.

తర్వాతేం చేయాలి ? ఏదైనా సంస్థకు వెబ్ సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా ఎందుకు వ్యవహరించకూడదు ? ఈ ఆలోచన వచ్చిందే తడవు... రెస్యూమెను... తన కార్పొరేట్ ఎక్స్‌పీరియన్స్ కూడా జోడించి సిద్ధం చేశారు. అంతే తాను గడపాలనే జీవితానికి తగినంతగా ఆదాయం రాసాగింది. తనకి ఉద్యోగమిచ్చే సంస్థ అధిపతిని ఇంప్రెస్ చేసేలా, తన జాబ్ ఉండాలని ఆలోచించారు శశాంక్. “ నేను చేసే పనికి తగిన సంస్థ ఇండోర్‌లోనే ఉందపుడు. వాళ్ల క్లయింట్స్ వెబ్‌సైట్స్‌లోకి హ్యాక్ అయ్యి... వాళ్ల లోటుపాట్ల ఆధారంగా వ్యాపారం పెంచుకోవచ్చనే వ్యాపార ఆలోచన చెప్పాను. నా రిక్రూట్‌మెంట్ అప్పటికప్పుడే జరిగిపోయిందం"టారు శశాంక్.

ఏడాదిన్నరపాటు అక్కడ పని చేయగా... 3 మార్లు ప్రమోషన్ అందుకున్నారు శశాంక్. ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్న స్థాయిలో.. మరో సంస్థ నుంచి భారీ ఆఫర్ రావడంతో ఆ జాబ్‌ను వదిలేశారు శశాంక్. కొత్త సంస్థలో 45 రోజులపాటు పనిచేశాక కూడా రూపాయి వేతనం కూడా అందలేదు. వచ్చే అవకాశం లేదనే విషయం అర్ధం కావడంతో ఆ నిమిషంలోనే ఉద్యోగం వదిలేశాను. అప్పుడతని జేబులో ఉన్నది ₹5 వేలు మాత్రమే.

ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ప్రెజెంట్ పాట్లు

ఫిబ్రవరి 23, 2009న సాయంత్రం 5గం.లకు ఉన్న జాబ్ వదిలేసి రోడ్డు మీదకొచ్చాశారు శశాంక్. కాలేజ్ డిగ్రీ లేదు. ఉద్యోగం ఎవరైనా ఇచ్చే ఆశ కూడా కనిపించలేదు. వెంటనే ఆన్‌లైన్ వర్కుల వేటలో పడ్డారాయన. అదే రోజు రాత్రి 8గం.లకు పీఎస్‌డీ టూ ఎక్సెల్ కన్వర్ట్‌ వర్క్ ఒకటి దొరికింది. దానికొచ్చే పారితోషికం 18డాలర్లు. రాత్రంతా తన ఇంట్లోని పెంటియం3 కంప్యూటర్‌పై వర్క్ చేసి.. దాన్ని పూర్తి చేసేశారు. కొత్త కంప్యూటర్ కొనడానికే ఈ కష్టమంతా. అలాగే కొంతకాలం కొనసాగింది జీవితం. దీని వెనకాల ఉన్న ఆలోచన ఓ సంస్థను తానే ప్రారంభించడమే. ఓ నెలలో కొత్త కంప్యూటర్ వచ్చేసింది. తర్వాత మరో కంప్యూటర్ రాగా... ఓ స్నేహితుడు కూడా జతయ్యాడు. ఆ తర్వాత మరో సిస్టం, ఇంకో ఫ్రెండ్. ఈ ఇద్దరూ కూడా ఇంజినీరింగ్ కాలేజ్ మేట్స్. ఇంజినీరింగ్ పూర్తి చేసి కూడా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నవారే.

అయితే ఈ స్నేహితులిద్దరూ మంచి ఆఫర్‌లు రావడంతో కాలక్రమంలో శశాంక్‌ను వదిలేసి వెళ్లిపోయారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లోకి అడుగుపెట్టారు శశాంక్. అక్టోబర్ 2009లో ఇండియా ఇన్ఫోటెక్ సంస్థను.. అతి కొద్ది మంది టీంతోనే స్టార్ట్ చేశారు. సర్వీస్ ఆధారిత కంపెనీలకు, ఉత్పత్తి ఆధారిత సంస్థలకు తేడాని అతి కొద్ది కాలంలోనే తెలుసుకోగలిగానంటారు శశాంక్. “ మా సంస్థ ఉన్నత స్థాయికి ఎదగాలంటే... ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్‌లోకి రావాలని నాకు అర్ధమైంది. అయితే... నా దగ్గరున్న అతి కొద్ది నిధులతో ఇది సాధ్యమయ్యే విషయం కాదు. దీనికో పరిష్కారం కనుగొన్నా. ప్రోడక్ట్స్‌నే సర్వీస్‌లా విక్రయించాలని"- శశాంక్

ఇలా ఓ స్టార్టప్ కంపెనీ... ఈ-కామర్స్ వెబ్‌సైట్లను అభివృద్ధి చేసే సంస్థగా రూపాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలకు ఎస్ఈఓ సర్వీసులు అందించింది. “ మేం ఎస్ఈఓ ప్రాసెస్‌ను అభివృద్ధి చేశాం. ఇదే ప్లాట్‌ఫాంలో చిన్నచితకా మార్పులతో చాలామంది క్లయింట్లకు ఇచ్చాం. బల్క్ ప్రాజెక్టులను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి ఈ మోడల్ మాకు ఎంతో ఉపయోగపడింది. తక్కువ మంది ఉద్యోగులు, చాలా తక్కువ వసతులతోనే ఈ ఘనత సాధించగలిగాం. మా క్లయింట్లకు విక్రయానంతర సేవలు అందించడం ద్వారా... సుదీర్ఘ కాలంపాటు వారితో అనుబంధాన్ని కొనసాగించాం. మా మొదటి ఐదుగురు ఎస్ఈఓ క్లయంట్లలో ముగ్గురితో ఇప్పటికీ వ్యాపారం నిర్వహిస్తున్నాం" - శశాంక్

కంపెనీ ప్రారంభించిన తొలి ఏడాదిలో.. వారంలో 7 రోజులు ఆఫీస్‌లోనే ఉండేవారు శశాంక్. "నేను ఆఫీస్‌లోనే ఉండేందుకే మొగ్గు చూపుతా. ఎందుకంటే... అలా ఉంటే ఎక్కువగా పని చేసే అవకాశముంటుందం"టారు శశాంక్. ఆ సమయంలో అతని ఇంటికీ, ఆఫీస్‌కి మధ్య దూరం కేవలం 7 కిలోమీటర్లే.

image


10వేల ఎస్ఈఓ ప్రాజెక్టులు

ఫిబ్రవరి 2014నాటికి జేబులో ₹5వేలతో రోడ్డుమీదకొచ్చి నిలబడి ఐదేళ్లు పూర్తయింది శశాంక్‌కి. ఇప్పుడు ఏటా ₹5 కోట్లు సంపాదించే స్థాయిలో ఉన్నారాయన. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు హ్యాండిల్ చేయడం ఈ కంపెనీ వర్కింగ్ స్టయిల్. ప్రతీ నెలా కనీసం 300 ప్రాజెక్టులు పూర్తి చేసేసేవారు. ఇప్పటికీ చేతిలో 425ప్రాజెక్టులు ఉన్నాయని చెబ్తారు. “ ఒకేసారి అధిక స్థాయిలో ప్రాజెక్టులపై పని చేయడం ద్వారా ఎక్కువ పెట్టుబడి, వనరులే కాదు... అదే స్థాయిలో పరిశోధనకూ మాకు అవకాశం చిక్కేది. మార్కెట్లో ప్రతికూల పరిస్థితులొచ్చినపుడు తట్టుకోడానికి ఈ తరహా విధానం తోడ్పడుతుంద"ని చెబ్తారు శశాంక్. ఆ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ అభినవ్ శర్మ చెప్పే గణాంకాల ప్రకారం... ఫిబ్రవరి 2014నాటికి 10వేల ఎస్ఈఓ ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన ఘనతను సాధించారు.

ప్రస్తుతం ఇండియా ఇన్ఫోటెక్ సంస్థకు 4వేల మందికి పైగా క్లయింట్లున్నారు. "లాభాల మార్జిన్లు పెరిగేలా మా బిజినెస్ మోడల్‌లో మార్పులు చేసుకున్నాం. ఇదే రంగంలోని ఇతర కంపెనీలతో పోల్చితే... మా ఆదాయం-లాభం మార్జిన్ చాలా ఎక్కువ"అంటారు శశాంక్. ఎస్ఈఓ రంగంలో మమ్మల్ని సూపర్ హీరోలుగా చూస్తారు మా క్లయింట్లు అంటోందీ కంపెనీ.

ఇండియా ఇన్ఫోటెక్ వ్యాపారంలో మూడింట రెండొంతుల భాగం యూఎస్ నుంచే వస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం అమెరికాలో డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వ్యాపార సామర్ధ్యం 62 బిలియన్ డాలర్లు. ఇప్పుడు అనేక కంపెనీలు పెయిడ్ యాడ్స్‌లోకి వచ్చేస్తున్నాయి. శశాంక్ అంచనాల ప్రకారం డిజిటల్ మార్కెటింగ్ రంగంలో సోషల్ మీడియా విపరీత ప్రభావం చూపనుంది. “ యాపిల్ టీవీ, క్రోమ్‌కాస్ట్ వంటి టెలివిజన్ సాధనాల ద్వారా... వీడియో ఆప్టిమైజేషన్ శరవేగంగా వృద్ధి చెందే ఛాన్స్ ఉంది. వీడియా యాడ్ రంగం పెరుగుదల ఊహకు అందడం కష్టమం"టారు శశాంక్

స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ నియామకం చాలా క్లిష్టమైన పని. “నేను ఎవరినైనా ఇట్టే నమ్మేస్తా. గుడ్డిగా నమ్ముతాను అంటారందరూ. నా దృష్టిలో మన దగ్గర పని చేసే వ్యక్తులను ఎంతగా నమ్మితే... అంతగా వారు స్వచ్ఛందంగా, సమర్ధవంతంగా పని చేస్తారు”

ఈ తరహా వ్యక్తిత్వంతో కొన్ని ఇబ్బందులు కూడా పడ్డ విషయాన్ని శశాంక్ గుర్తు చేసుకున్నారు. తాను మొదటగా రిక్రూట్ చేసుకున్నవారిలోనే ఏడుగురు.. తన దగ్గరే ఉంటూ రైవల్ కంపెనీకి పని చేస్తున్న విషయం తెలుసున్నారు. అందులో తన మిత్రులు కూడా ఉన్న విషయాన్ని గుర్తించారు. “ ఆ ఏడుగురిని అప్పటికప్పుడే తొలగించా. మళ్లీ నా టీంని డెవలప్ చేసుకున్నా. ఓ ఏడాది క్రితం కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గత అనుభవాల నుంచి నేనేం నేర్చుకోలేకపోయానని అప్పుడు అర్ధమైంది. నేను ఇప్పిటికీ నా టీంని గుడ్డిగానే నమ్ముతా”-శశాంక్

“నేను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. అందుకే నేను నిజాయితీ, ఖచ్చితత్వం, క్రమశిక్షణ, సామర్ధ్యం, నమ్మకం... వీటన్నిటినీ నా టీం నుంచి కోరుకుంటా. ఈ విషయంలో రాజీ పడను. అందుకే నాది పర్ఫెక్ట్ టీం. నా వర్కింగ్ స్టయిల్‌కు దగ్గరగా లేని వ్యక్తిని ఒక్కరోజు కూడా నా కంపెనీలో ఉంచడానికి ఇష్టపడను"-శశాంక్

గతంలో రోజుకు 18 గంటలు కష్టపడేవారు శశాంక్. ఇప్పుడంత అగ్రెసివ్‌గా లేనంటూ నిజాయితీగానే చెబ్తారాయన. ప్రస్తుతం ప్లానింగ్, ప్రాసెస్, మెథడ్స్, ఎగ్జిక్యూషన్‌కే పరిమితమయ్యా. ఇప్పటికీ ప్రతీ రోజూ 8-10 గంటలు పని చేస్తా. నా ప్రారంభపు స్కిల్స్ అయిన హ్యాకింగ్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను మరింతగా అభివృద్ధి చేసి... టెక్నాలజీ రంగానికి నా వంతు సాయం చేయాలనుకుంటున్నా- శశాంక్

శశాంక్ ఇప్పుడు మరో విషయం గమనించాడు. తన దగ్గరున్న సూపర్ బైక్‌నో, రేసింగ్ కార్‌నో బయటకు తీస్తున్నపుడు... పొరుగింటి వాళ్లు చూసే చూపుల్లో స్పష్టంగా మార్పును గుర్తిస్తున్నానంటారు శశాంక్.