చిన్నపిల్లలు అయిపోవాలంటే రాహ్‌గిరికి వచ్చేయండి !

కార్‌లెస్ రోడ్లే ప్రధాన లక్ష్యంఈవెంట్ చేపట్టిన మొదటి దక్షిణాది నగరంగా హైదరాబాద్ఇప్పటికే 50వేలు దాటుతున్న పార్టిసిపెంట్స్పర్యావరణ సమతుల్యంపై అవగాహనరోడ్లపై యోగా,జుంబాలు అదనపు ఆకర్షణ

0

మారోడ్లు మా ఇష్టం అంటున్నరు హైదరాబాదీలు. ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే వీరిని ఆపేవారు లేరు మరి. ఉదయం సూర్యోదయంతో ప్రారంభమయ్యే రాహగిరి హ్యాపీ స్ట్రీట్స్ తొమ్మిదిన్నరతో ముగుస్తుంది. రోడ్లపై ఎవరికి ఇష్టం వచ్చించి వాళ్లు చేసుకోవచ్చు. దీంతో మన భాగ్యనగర జనాలు రోడ్లపై చిందులేస్తున్నారు. పిల్లల ఆటపాటలకు అంతులేదు. ఇండియాలో మొదట గుర్గావ్‌లో ప్రారంభమైన ఈ రాహగిరి ఇప్పుడు హైదరాబాద్ చేరుకుంది. రోడ్లపై వాహనాలకే కాదు పాదచారులకు కూడా హక్కుందనే క్యాంపైన్‌లో భాగంగా ఇది ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ క్యాంపైన్ ఇప్పుడు ఇండియన్ సిటీలకు చేరుకుంది.

నడవటం, సైకిల్ పై చక్కర్లు కొట్టడం, ఆడటం, పరిగెత్తడం, అలసిపోవడం, సొలసిపోవడం, ఆనందిచండం, చిన్ననాటి గప్ చుప్ గేమ్స్ అన్నింటినీ వరసపెట్టి ఆడిపడేయడం, ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయి. ఫిజికల్ ఎక్సర్‌సైజులు, యోగా, మ్యూజిక్, సింగింగ్, డ్యాన్సింగ్ ఇలా చెప్పుకుంటే లిస్ట్ చాంతాడు అంత అవుతుంది. వీటన్నింటినీ రాహగిరి హ్యాపీ స్ట్రీట్స్‌లో మనం చూడొచ్చు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, నెక్సెస్ రోడ్‌లో ప్రతీ వారం వీటితో మానసిక ఆనందాన్ని పొండమే కాదు, చిన్ననాటి గుర్తులను మరోసారి నెమరవేసుకోవచ్చు. రోజురోజుకీ ఈ క్యాంపైన్‌కు ఆదరణ పెరగడం కాదు.. సిటీ జనాలు అన్నింటినీ మరచి దీనిలో పాల్గొంటున్నారు.

రాహగిరిలో టిఎస్ఐఐసి ఎండి రాజేష్ రాజన్
రాహగిరిలో టిఎస్ఐఐసి ఎండి రాజేష్ రాజన్

ఈవెంట్స్

చిన్నప్పుడు వీధిలవెంట పరిగెత్తిన రోజులు బహుశా ఇప్పటి తరం చిన్నారులకు తెలియక పోవచ్చు. నగరంలో మారిపోయిన సామాజిక పరిస్థితులు అందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఇండోర్ గేమ్స్ మాత్రమే పిల్లలకు ఆటవిడుపుగా మారిపోయాయి. భవిష్యత్ తరాలకు ఇక ఔట్ డోర్ ఆటలంటే టీవీల్లో చూసుకోవల్సిందే అనేలా సమాజం మారిపోయిందనండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి సిట్యువేషన్ పై ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పునకు రూపమే ఈ రాహగిరి. అంటే వారంలో ఒకరోజు జరిగే స్ట్రీట్ ఈవెంట్ ఇది. నగర జనాలు వారి వీధులపై ( స్ట్రీట్) హక్కును పొండానికి ఇది ఉపయోగపడుతుంది. వారి కమ్యూనిటీతో కలసి , జివితంలో మిస్ అవుతున్న ఎన్నో విషయాలను మరోసారి గుర్తు చేసుకొనే అవకాశం వస్తుంది. భారత్‌లో 2013 నవంబర్‌లో గుర్గావ్‌లో ఇది ప్రారంభమైంది. గతేడాది హైదరాబాద్ గచ్చిబౌలీలో రాహగరి మొదలై బ్రహ్మాండమైన సక్సస్ అయింది. కొలంబియాలని బగోటాలో వారం వారం జరిగే ‘కిక్లోవా’ కాన్సప్ట్ నుంచి ఇన్‌స్పైర్ అయిన క్యాంపైన్ ఇది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. ఓపెన్ స్ట్రీట్స్, సమ్మర్ స్ట్రీట్స్ లాంటివి చాలా దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి.

స్టెప్పులేస్తున్న హైదరాబాదీలు
స్టెప్పులేస్తున్న హైదరాబాదీలు

రాహగిరి డే లో ప్రధానంగా ఉద్దేశాలు

1. సైక్లింగ్ ని ప్రమోట్ చేయడం, వాకింగ్, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ను వాడటంపై అవగాహన

2. వీధులన్ని జనానికి సంబంధించనవే విషయాన్ని గుర్తు చేయడం. వాహనాలకు మాత్రమే వీధులపై హక్కుందనే భావన్ని తొలగించడం. పాదచారులకోసం కూడా రోడ్లున్నాయనే విషయం చెప్పడం.

3. యాక్టివిటీ లైఫ్ స్టైల్‌ను ప్రోత్సహించి ఆరోగ్యకరమైన జివితాన్ని గడిపేలా చేయడం

4. సామాజికంగా కమ్యూనిటీల మధ్య ఉన్న అంతరాలను తొలగించి వారి మధ్య సఖ్యతను పెంచడం

5. పర్యావరణ సమస్యలపై చర్చించడం, పరిష్కరించడం

దీనివెనక ఎవరు ?

గుర్గావ్ లో ప్రారంభమైన ఈ రాహగిరి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ చేరుకోవడానికి దాదాపు ఏడాదిపైనే సమయం పట్టింది. ఇప్పటికైనా ఇది మన భాగ్యనగరానికి చేరుకోడానికి దీని వెనక ఎన్నో ఎన్జీఓలున్నాయి. సక్సస్‌ఫుల్‌గా ప్రతీవారం రాహగిరి కొనసాగుతోందంటే వెనకుండి నడిపే వ్యక్తులు లేకపోతే కుదరని పని. సామాజిక ప్రయోజనంతో చేస్తోన్న దీనికి జనం నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది. ఇప్పటి దాకా ఈ మహత్తర కార్యంలో పాల్గొన్నవారి సంఖ్య 50వేలకు దాటిందని అంచనా. ప్రతి ఆదివారం ఈ సంఖ్య పెరుగుతూ ఉంది.

నగరాలనేవి జనం కోసం ఉన్నాయి. కార్లకోసమో లేదా వెహికల్ల కోసమో కాదు. 70శాతం మంది జనం వారు డ్రైవ్ చేయకుండా రోడ్‌ని ఉపయోగించడం లేదు. హైదరాబాద్‌లో 22శాతం మంది జనానికి కార్లు, మోటార్ సైకిళ్లు ఉన్నాయి. వారు మాత్రమే రోడ్లను దర్జాగా ఉపయోగిస్తున్నారు. అవి కాకుండా పాదచారులు రోడ్లపై ఎలాంటి హక్కు లేదా అనే కొత్త ప్రశ్నలు మొదలయ్యే స్థితికి చేరుకుంది. దీన్నిమార్చాలనేది మా ఈ రాహగిరి అంతిమ లక్ష్యం.అని ప్రశాంత్ బాచు అన్నారు.

ప్రశాంత్ బాచు
ప్రశాంత్ బాచు

అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ప్లానర్ అయిన ప్రశాంత్ బాచు రాహగిరి ఈవెంట్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఎన్నో ఎన్జీఓలు దీనికోసం పనిచేస్తున్నాయి. ప్రశాంత్ టీం రాహగిరి సక్రమంగా సాగేలా .. గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తోంది. రాహగిరికి ఉన్న మరో ప్రధాన లక్ష్యం కార్ ఫ్రీ రోడ్‌లు. కార్లు లేని రోడ్లను వారంలో ఒకరోజైనా చూస్తే.. పర్యావరణ సమతుల్యం సాధించవచ్చు. కార్లను ఇళ్లకే పరిమితం చేసి సైకిళ్లపైనా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై బయలకు వెళ్లేలా చేయడం, నడవడాన్ని ప్రోత్సహించడం. దీని ద్వారా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవరుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. టిఎస్‌ఐఐసి, టిఎస్‌టిడిసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, గూగుల్ ,హెచ్ఎస్బిసి, ఏడిపి,జెడిఎ లాంటి కార్పోరేట్ సంస్థలు రాహగిరి ని ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగిపోతోంది. పర్యావరణ సమతుల్యం కాపాడే గొప్ప ఆశయంతో ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న ఇలాంటి పోకడలను అందిపుచ్చుకున్న దక్షిణ భారత దేశంలో మొదటి నగరంలో హైదరాబాద్ నిలిచింది.

ఇది మన భాగ్యనగరంలోని ఆదివారం జరిగే రాహగిరి సందడి. మీరు కూడా ఇందులో పాల్గొనాలంటే సండే మార్నింగ్ టైంలో సైబరాబాద్ లోని బయోడైవర్సిటీ రోడ్ లేదా నెక్లెస్ రోడ్ చేరుకోండి.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik