మ్యాట్రెస్ పరిశ్రమలో మకుటం లేని రాజుగా 'పెప్స్'

మ్యాట్రెస్ పరిశ్రమలో లీడర్ గా ఎదుగుతున్న ‘పెప్స్’.స్ప్రింగ్ మ్యాట్రెస్ పరిశ్రమలో 55 శాతం వాటా సంపాదించిన ‘పెప్స్’ఆ బ్రాండ్ కొనాలన్నా 7 రోజులు ఆగాల్సిందే

మ్యాట్రెస్ పరిశ్రమలో మకుటం లేని రాజుగా 'పెప్స్'

Saturday June 13, 2015,

4 min Read

image


గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుండి మ్యాట్రెస్ (పరుపు) పరిశ్రమలో ఉన్న ఆయన, తన 55 ఏటా స్ప్రింగ్ మ్యాట్రెస్ పరిశ్రమకే మార్గదర్శకులుగా నిలిస్తున్న కంపెనీని స్ధాపించారు. స్ప్రింగ్ మ్యాట్రెస్ పరిశ్రమలో 55శాతం వాటా సంపాదించిన ‘పెప్స్’ మ్యాట్రెస్, ప్రశాంతమైన నిద్రకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది.

‘పెప్స్’ మ్యాట్రెసెస్ కంపెనీ మ్యానేజింగ్ డైరెక్టర్, సహా వ్యవస్ధాపకులు కే మాధవన్‌తో మాట్లాడిన యువర్ స్టోరీతో, కంపెనీ ప్రయాణం గురించి వివరించారు.

ప్రారంభం ఎలా ?

2005-06 లో ఓ మంచి అవకాశాన్ని గుర్తించడంతో ఈ ప్రయాణం మొదలైంది. స్ప్రింగ్ మ్యాట్రెస్ తయారు చేయగలిగే సామర్ధ్యం ఉన్న ఓ ఫ్యాక్టరీ, కొయంబతూర్‌లో అమ్మకానికి ఉందని తెలిసింది. అప్పట్లో స్ప్రింగ్ మ్యాట్రెస్ పరిశ్రమ వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదంటున్న మాధవన్, ఆయన ఇద్దరు పార్ట్‌నర్స్‌తో కలిసి ఈ వెంచర్ ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. సముద్రమంత అవకాశం ఉన్నప్పటికీ అప్పట్లో కేవలం ఒక్క ప్రత్యర్ది మాత్రమే ఈ రంగంలోఉన్నారనేది మాధవన్ చెప్పిన మాట.

సాధించిందేంటి ?

మొదట్లో అస్దిరంగా ఎదిగిన ‘పెప్స్’, తన మొదటి సంవత్సరంలో కేవలం 8, 700 మ్యాట్రెస్లు మాత్రమే తయారు చేయగలిగింది. 2013-14 లో సుమారు 1.48 లక్షల మ్యాట్రెస్ తయారు చేయగలిగింది. దీనితో 2010-11 నుండి 2013-14 వరకు వాళ్ల వృద్ధి రేటు 38శాతానికి చేరుకుంది. “ఎట్టి పరిస్ధితుల్లో సాంప్రదాయ మ్యాట్రెస్‌ను స్ప్రింగ్ మ్యాట్రెస్‌తో ఒవర్ టేక్ చేయాలని భావన ఉండేది. ప్రపంచంలో 77 శాతం మంది పరుపులపైనే పడుకుంటారు. అలాగే 35 శాతం భారతీయులు ప్రతీ ఏటా విదేశాలకు పర్యటిస్తుంటారు, మేము చేయాల్సిందల్లా సరసమైన ధరకు లగ్జరీ ఇవ్వడమంటారు మాధవన్”. ఇక వారి విజయానికి మరో కారణం వారి డిస్టిబ్యూటర్లు, ఒకప్పుడు 47 డీలర్లున్న ‘పెప్స్’ కు ఈ రోజు దేశ వ్యాప్తంగా 9,050 డీలర్లు ఉన్నారు.

జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్లుగా కే మాధవన్, జీ శంకరంతో పాటు టెక్నాలజీ డైరెక్టర్ పి.మంజునాధ్ కలిసి ‘పెప్స్’ ప్రారంభించారు. “మ్యాట్రెస్ పరిశ్రమ బ్యాగ్రౌండ్ ఉన్న మాకు, తయారీ విధానం, కస్టమర్ అవసరాలు, కొత్తగా చేయాల్సిందేమిటో తెలుసంటారు మాదవన్.” ఈ ముగ్గురు కూడా గత 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నారు.

‘పెప్స్’ మ్యాట్రెస్ తయారీలో వాడే టెక్నాలజీ, అమెరికాకు చెందిన ‘రెస్టానిక్’ బ్రాండ్‌కు సమానంగా ఉంటుంది.

కే. మాధవన్, పీ. మంజునాధ్, జీ శంకర్ రామ్.(పెప్స్ మ్యాట్రెస్ వ్యవస్ధాపులు

కే. మాధవన్, పీ. మంజునాధ్, జీ శంకర్ రామ్.(పెప్స్ మ్యాట్రెస్ వ్యవస్ధాపులు


ప్రారంభంలోని సమస్యలు

మొదట్లో స్ర్పింగ్ మ్యాట్రెస్ అంటే చాలా మందిలో ఓ రకమైన అసంతృప్తి ఉండేది. దీన్ని కొంత మంది సోఫా కమ్ బెడ్ అనేవారు. “అలాంటి వాటిలో ఆరు నెలల్లోనే స్ప్రింగ్స్ బయటకొచ్చేసి ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ''ఇక మ్యాట్రెసెస్ అంటే.. బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చుతో కూడిన సరుకని చాలా మంది అనుకుంటారు. ఒక్క స్ప్రింగ్ మ్యాట్రెస్ ఖరీదులో మూడు సాంప్రదాయ పరుపులు కొనచ్చనే భావన చాలా మందిలో ఉంది'' - మాధవన్.

ఈ రకమైన ఆలోచనలను ఎదురుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓ సబ్ బ్రాండ్ తయారు చేసారు. వాటిని అఫర్డబుల్ లగ్జరీగా పిలుస్తారు. అంతర్జాతీయ స్థాయికి అనుకూలంగా ఉండే విధంగా సరుకును చూసే వారి కోసం ఓ సబ్ బ్రాండ్, పూర్తిగా లగ్జరీ కావాలనుకునే వారికి మరో బ్రాండ్ ప్రారంభించారు. అంతే కాకుండా స్ప్రింగ్ మ్యాట్రెసెస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముందు డిస్ట్రిబ్యూటర్లకు ట్రైనింగ్ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కస్టమర్ల టేస్ట్‌కు అనుగుణంగా తమ ప్రాడక్ట్స్‌ను మార్చుకుంటూ వెళ్లారు.

వీరి మ్యాట్రెసెస్ క్వాలిటీ, విశ్వసనీయత, మన్నికతో పాటు నాణ్యతకు పేరు గాంచింది. అంతే కాకుండా ఈ మ్యాట్రెసెస్ కొన్నా, డెలివరీ కోసం 7 రోజులు వేట్ చేయాల్సిందే. “ఆ వేయిటింగ్ పీరియడ్ ని 24 గంటలకు చేయడాన్ని ఇప్పుడు ప్రాధాన్యంగా తీసుకున్నామంటున్నారు.”

ప్రకటనలు

“మొదటి నాలుగు సంవత్సరాల వరకు ఎలాంటి ప్రకటనలపై ఖర్చు పెట్టలేదు, ప్రతీ కస్టమర్‌తో పర్సనల్ రిలేషన్‌షిప్ పెంచే విధంగా ఉండాలని ప్రయత్నించాము. అయితే ఈ మధ్యే ప్రకటన ఇవ్వడం ప్రారంభించామంటున్నారు”. ‘పెప్స్’ తన మొదటి ప్రకటన గత ఏడాదే ఇచ్చింది, అలాగే కొన్ని నెలల క్రితం బాంగ్లాదేశ్ లో ఏషియా కప్ స్పాన్సర్ చేసింది.

image


“నేను ప్రారంభించిన సమయంలో, కాటన్ మ్యాట్రెస్ మాత్రమే కనిపించేవి. నిద్రించడానికి అంత ఖర్చు పెట్టడం అవసరమా అనుకునే వారు చాలా మంది ఉంటారని అంటున్నారు మాధవన్.” మ్యాట్రెస్ పరిశ్రమకు సంబంధించి ప్రాడక్ట్ కొనే సమయంలో కస్టమర్ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది. “చాలా మందికి ఎలాంటి మ్యాట్రెస్ వాడుతారు ? ఎంతకాలంలో దాన్ని మారుస్తారు ? అందులో ఉండే వెరైటీలు తెలుసా ? అని అడిగితే ఎంతో మందికి వాటిపై అవగాహనే ఉండదంటున్నారు.”

‘పెప్స్’ నిర్వహించిన సర్వే ప్రకారం, బెంగుళూరులో యావరేజ్‌గా నాలుగున్నర గంటలు నిద్రపోతారని తెలిసింది. “చాలా మందికి నిద్రలేకపోతే వాటి ప్రభావం గురించి పెద్దగా అవగాహన ఉందడంటున్నారు మాధవన్”.

బ్రాండ్ బిల్డింగ్

తమ బ్రాండ్ బిల్డింగ్ కోసం పెప్స్ ‘స్లీప్’ అనే పదం వాడుతుంది, అంతే కాకుండా అచ్చు బెడ్ రూమ్‌లా ఉండే వారి రిటైల్ ఔట్లెట్లను ‘ది గ్రేట్ స్లీప్ స్టోర్స్’ గా పిలుస్తారు. “కస్టమర్లను వచ్చి మా మ్యాట్రెస్ ట్రై చేయమని అంటాము, ఓ సారి పడుకుని, సౌకర్యవంతంగా ఉందా, లేదా చూసుకోమంటాము, ఒకరికి నచ్చేది, మరొకరికి నచ్చాలని ఉండదంటారు.”

వీటితో పాటు ది గ్రేట్ స్లీప్ స్టోర్స్ ‘పెప్స్’ బ్రాండెడ్ కు సంబంధించిన పిల్లోస్, బ్లాంకెట్స్, మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ కూడా విక్రయిస్తారు. “బెడ్ మేకింగ్ కూడా ఓ కళ, ప్రశాంతమైన నిద్ర కోసం ప్రజల ఆలోచన ఆరోగ్యకరంగా లేదు. సగానికి పైగా బెడ్ షీట్ లేకుండా పడుకునే వారు కూడా ఉన్నారంటున్నారు మాధవన్. ''మా ప్రాడక్ట్స్ విక్రయించే వాళ్లంతా కూడా ప్రాడక్ట్ రేంజ్ గురించి అవగాహన ఉన్నవారితో పాటు, కస్టమర్లు ఏ మ్యాట్రెస్ కొనాలో సహాయపడటానికి అన్ని విధాల సహకరిస్తారు. పిల్లోస్ కూడా మ్యాట్రెస్ అమ్మేంత ఉత్సాహంతోనే అమ్ముతారు.

‘పెప్స్’ అతిపెద్ద మార్కెట్ ఇప్పుడు కెరళాతో పాటు తమిళనాడు. డిల్లీ, ముంబయి, పుణే, బెంగుళూరు కూడా స్ట్రాంగ్ మార్కెట్లుగా నిలుస్తున్నాయి. “మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా స్ధిరపడాల్సిన అవసరం ఉంది. అయితే మిగితా వాటిలా రాణిస్తున్నట్టు కనిపించడంలేదంటారు మాధవన్”. ఇటీవల వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో అడుగుపెట్టిన ‘పెప్స్’, త్వరలో అస్సాంలో కూడా వెంచర్ చేయబోతున్నారు. కస్టమర్లతో డీల్ చేయడంతో పాటు, అతిథ్య రంగంవైపు కూడా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.

'పెప్స్' తో పనిచేయడం

“ఇక్కడ వర్క్ కల్చర్ క్రమశిక్షణ తో కూడింది, అయితే ఉద్యగి- బాస్ లా కాకుండా ఓ గురువు- శిష్యుడి లా ఉండేట్టు చూస్తాం. అంతే కాకుండా వ్యాపార స్ధిరత్వం కోసం సిస్టమెటిక్‌గా మా ప్రాసెస్ ఉండేటట్టు దృష్టి సారిస్తామటున్నారు”.

సలహా

1. ఏదైనా చేయాలనే సంకల్పం, ప్రయత్నం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, విజన్ తో పాటు మనసు కూడా వాటిపై పెట్టాలి.

2. స్దిరంగా కాకుండా, వాతవరణానికి అనుకూలంగా మారాలి, ఈ వయసులో కూడా ఎక్కువ సమయం అప్డేట్ ఉండే విధంగా ప్రయత్నిస్తుంటాను.