బెంగళూరుకు బవేరియన్ బీరు రుచిచూపిన ఆ నలుగురు

బెంగళూరుకు బవేరియన్ బీరు రుచిచూపిన ఆ నలుగురు

Wednesday April 15, 2015,

3 min Read


''చిన్నప్పుడు పిల్లలు పాలు తాగాలి. పెద్దయ్యాక బీర్ మాత్రమే తాగాలి'' - ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్

ష్వార్జ్‌ నెగర్ స్పూర్తితో నలుగురు మిత్రుల బృందం ఒక బీర్ పబ్ ప్రారంభించింది. సింగపూర్‌లో సుఖంగా గడిచిపోయే జీవితాన్ని. వేల డాలర్ల ఉద్యోగాన్ని వదులుకుని వచ్చి బెంగళూరులో బీర్ వ్యాపారం మొదలెట్టారీ మిత్రులు. సక్సెస్ అయ్యారు. వారాంతంలో రోజూ రెండు వేల మగ్గుల బీరు విక్రయిస్తున్నారు.

బీరు వ్యాపారానికి బీజం ఎలా పడింది ?

అరుణ్ జార్జ్, సిబి వెంకటరాజు సింగపూర్లో పనిచేసే మిత్రులు . 2008లో ఒక రోజు ఇద్దరు బీర్ చప్పరిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడే కొత్త వ్యాపారం ఆలోచన వచ్చింది. భారతోకెల్లా తొలి బీర్ పబ్ హౌజాట్ .. హర్యానాలోని గుర్గావ్‌లో కాసుల పంట పండించుకుంటున్న సంగతి గుర్తుకు వచ్చింది. సిబీ వెంకటరాజుకు తరచూ రెస్టారెంట్ ప్రారంభించే ఆలోచన వచ్చేది. తన ఆలోచనలను మిత్రుడితో పంచుకునేవారు. బెంగళూరులో ఎందుకు ప్రారంభించకూడదని అరుణ్ సూచించారు. ఇలా అప్పుడప్పుడూ జరిగే చర్చే టాయిట్ ప్రారంభానికి దారి తీసింది.

సిబి, అరుణ్ తో పాటు మరో మిత్రుడు ముకేష్‌ తోలానీ చిన్నతనంలో బెంగళూరులోని ఫ్రాంక్ ఆంటోనీ పబ్లిక్ స్కూల్లో చదివారు. తర్వాత సిబీ .. సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో డిగ్రీ పట్టా పొందారు. అరుణ్, ముకేష్ ఇద్దరూ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ చదివారు. తర్వాత అరుణ్ సింగపూర్ లోని నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు.

అరుణ్,సిబి,గ్లెన్,ముకేష్ బృందం

అరుణ్,సిబి,గ్లెన్,ముకేష్ బృందం


బీరు వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన రాక ముందు ముకేష్ ఒక రెస్టారెంట్ నిర్వహించేవారు. స్వీట్ ఛారియట్ అనే పేస్ట్రీ షాపులు నిర్వహించే గ్లెన్ విలియమ్స్ తో కలిసి బోకా గార్డెనియా అనే రెస్టారెంట్ నిర్వహించారు. తర్వాత వీరు నలుగురు కలిసి కొత్త బీరు పబ్ టాయిట్‌ను ప్రారంభించారు.

తొలుత కొందరు బంధుమిత్రుల దగ్గర పెట్టుబడిని సేకరించారు. లైసెన్సులు, క్లియరెన్సుల తొలనొప్పిని అధిగమించిన తర్వాత టాయిట్ 2010లో లాంఛనంగా ప్రారంభమైంది. టాయిట్‌కు సంబంధించిన నిర్ణయాల్లో ఓటింగ్ పద్ధతిని పాటించేవారు. నలుగురు తమ బాధ్యతలను పంచుకోవడంతో పని యంత్రంకంటే వేగంగా జరిగిపోయేది. ఆపరేషన్స్ అన్నీ సిబీ చేతిలో ఉండేవి. ఆర్థిక కార్యకలాపాలన్నీ ముకేష్ చూసుకునే వారు. మార్కెటింగ్, బ్రాండింగ్,ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాంటి పనులన్నీ అరుణ్ బాధ్యత కిందకు వచ్చేశాయి. వంటగది బాధ్యత అంతా గ్లెన్ దే. అందుకే ఇంత రుచికరమైన బీరు తయారవుతుందని మిత్రులే గ్లెన్ ను పొగుడుతారు. ఎవరైనా నాలుగు రోజులు ఊరికో.. విహార యాత్రకో వెళితే ఇబ్బంది లేకుండా చూసేందుకు అందరూ అన్ని పనులు నేర్చుకున్నారు. రుచికరమైన బీరు తయారు చేసే మాస్టర్ ఉన్నప్పటికీ ఈ బృందం కూడా బీరు తయారీలో ప్రావీణ్యం సంపాదించింది.

స్నేహ సంబంధాలే వ్యాపారంలో రాణించేందుకు అవకాశం ఇచ్చాయని సిబీ చెబుతారు. సమస్యలు ఎదురైనప్పుడు నవ్వుతూ అధిగమించడం నేర్చుకున్నామంటారు. పని బోర్ కొట్టుకండా తరచూ జోకులేసుకునే వారు. దీని వల్ల ఉత్పాదకత పెరిగిందని సిబీ చెబుతారు.

జనం ఇష్టపడిన బీర్

టాయిట్ వైస్ అనేది బవేరియాలో అత్యంత జనాదరణ పొందిన బీర్. అయితే బవేరియన్స్ తయారు చేసినంగా రుచికరంగా తయారు చేయడం మాత్రం అంత సులభం కాదు. అందుకే జర్మనీ తరహా బీరు తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. అందులో ఓపెన్ ఫెర్మంటర్ కట్టించారు. బ్యాక్టీరియా సులభంగా లోపలికి వెళ్లేందుకు వీలుగా ఓపెన్ ఫెర్మెంటర్ వాడటం బవేరియాలో ఆనవాయితీగా వస్తోంది. దీనిలో వత్తిడిని పెంచే ట్యాంకులుండవు. చిన్న మూత మాత్రమే ఉంటుంది. అయినా ఇక్కడ మాత్రం యీస్ట్‌ను కూడా వాడుతున్నారు. బెంగళూరు గాలిలో బ్యాక్టీరియా శాతంపై నమ్మకం లేకనే యీస్ట్ వాడుతున్నామని సిబి చెబుతారు.


టాయిట్ వెయిజ్

టాయిట్ వెయిజ్


బెంగళూరులో పోటీ ఎలా ఉంది

బెంగళూరు మహానగరంలో ది బియరీ క్లబ్ మరియు టాయిట్‌ను కలుపుకుని మొత్తం పన్నెండు మైక్రో బ్రివరీలున్నాయి. పోటీతోనే వ్యాపారం వృద్ధి చెందుతుందని ఈ స్నేహితులు అంగీకరిస్తున్నారు. ఇతర బ్రీవరీ యజమానులతో తరచూ మాట్లాడుతుంటామని చెబుతున్నారు. కష్టపడి పనిచేసే ఉద్యోగులు , టాయిట్ బీరును ఇష్టపడే కస్టమర్ల వల్లే వ్యాపారం వృద్ధి చెందిందని నలుగురు మిత్రులు నమ్మకం. వినియోగదారులకు మరింత సమర్థంగా సేవలందించేందుకు కూడిక్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. టాయిట్ ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోనే అగ్రగామి రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. జొమాటో, బర్ప్ సంస్థలు దీన్ని అత్యుత్తమ బీర్ పబ్‌గా గుర్తించాయి. వినియోగదారులకు టాయిట్ బీరు ఎప్పుడూ తాజాగానే అనిపిస్తోంది. వారాంతాల్లో రాత్రి పూట ఎక్కువ సేపు రెస్టారెంట్లు, పబ్‌లు తెరిచి ఉంచేందుకు పోలీసులు అనుమతించడం వీరికి వరప్రసాదమైంది. త్వరలో పుణె, ముంబైలో శాఖలు తెరిచే అవకాశం ఉంది.


image