ఆన్ లైన్ కళ్లజోడు వ్యాపారంలో దూసుకెళ్తున్న లెన్స్ ఫిట్

0

మరో హైదరాబాదీ స్టార్టప్ ఆన్ లైన్ రంగంలో దూసుకెళ్తోంది. పోటీ కంపెనీలకు దీటుగా వినియోగదారులకు సేవలందిస్తోంది. కళ్లజోళ్ల వ్యాపారంలో తిరుగులేని కంపెనీగా అవతరిస్తోంది లెన్స్ ఫిట్. ఆన్ లైన్ వ్యాపారంలోకి అడుగు పెట్టి.. ప్రారంభించిన అనతి కాలంలోనే ఆన్ లైన్ రంగంలో దూసుకెళ్తోంది. 

వంశీ సీమకుర్తి ఈ కంపెనీకి సీఈవో కమ్ ఫౌండర్. ఇంజనీరింగ్ చదివే సమయంలో చేసిన ప్రాజెక్ట్ వర్క్.. ఒక కంపెనీ ఏర్పాటుకు పునాది వేసింది. గీతం వర్సిటీలో ఇంజినీరింగ్ చదివేటప్పుడు జాగృతి యాత్రలో భాగంగా అరవింద్ ఐ కేర్ సందర్శించాడు. ఆ సమయంలోనే కళ్లజోళ్ల వ్యాపారంలో అవకాశాలపై అతడికి అవగాహన ఏర్పడింది. ఐ కేర్ రంగంపై ఒక క్లారిటీ వచ్చింది. నిజానికి మన దగ్గర ఆన్ లైన్ లో కళ్లజోళ్ల కొనుగోళ్లు తక్కువే అయినప్పటికీ.. ఆ రంగంలో కొన్ని సంస్థలే ఉండటంతో మార్కెట్ బాగానే ఉంటుంది. ఆ ఆలోచనతోనే వంశీ రంగంలోకి దిగాడు. అభిలాష్ అనే ఫ్రెండుతో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో లెన్స్ ఫిట్ డాట్ కామ్ ప్రారంభించారు.

ఫ్రేము, లెన్స్ కలిపి రూ.250కే అందించడం వీళ్ల స్పెషాలిటీ. తక్కువ రేటు కదాని నాణ్యతలో రాజీపడరు. కళ్లజోళ్ల ఫ్రేములు, సన్ గ్లాసులు, కాంటాక్ట్ లెన్స్, కళ్లజోళ్ల బాక్సులు, స్ర్కూ డైవర్ సెట్లు, కీచెయిన్ల వంటి ఇతరత్రా ఉత్పత్తులన్నీ నాణ్యమైనవే అందిస్తున్నారు. పెద్ద వాళ్లకు, పిల్లలకు వేర్వేరు డిజైన్లు అన్ని రంగుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైనే కాదు ఆఫ్ లైన్లోనూ లెన్స్ ఫిట్ స్టోర్లు ఉన్నాయి. ఇండియా మొత్తం సర్వీస్ అందిస్తున్నారు. కళ్ల జోళ్ల కోసం షాపు దాకా వెళ్లి కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని నచ్చిన కళ్లజోళ్లను లెన్స్ ఫిట్ వెబ్ సైట్లో బుక్ చేసుకోవచ్చు. ధరలు బయట కన్నా తక్కువే. పైగా 75 శాతం డిస్కౌంట్ కూడా ఉంది. ప్రాడక్ట్ లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా వంద శాతం రీఫండ్ చేస్తారు. వెబ్ సైట్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అప్ లోడ్ చేసిన తర్వాత మూడు నాలుగు రోజుల్లోనే డెలివరీ ఇస్తున్నారు. ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించి మూడు నెలలే అయినా.. స్పందన చాలా బాగుందని వంశీ సీమకుర్తి చెప్తున్నారు. ప్రస్తుతం 500 మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారని, మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.

లెన్స్ ఫిట్ ఉత్పత్తుల కొనుగోలుకు వెబ్ సైట్ తోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆఫ్ లైన్లో కావాలంటే అబిడ్స్ లో ఫ్రాంచైజీ స్టోర్ ఉంది. త్వరలోనే దేశమంతా స్టోర్లు తెరిచే ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ ఖమ్మంలో ఒక స్టోర్ పనిచేస్తోంది. త్వరలోనే హైదరాబాద్ జేఎన్టీయూ, కొంపల్లి, కూకట్ పల్లి, సూర్యాపేటలో లెన్స్ ఫిట్ స్టోర్లు ప్రారంభించబోతున్నామని కో ఫౌండర్ అభిలాష్ తెలిపారు.

లెన్స్ ఫిట్ దగ్గర రెండు వేల రకాల ఫ్రేములు, లెన్సులు ఉన్నాయి. ఇంపోర్టెడ్ కావాలన్న తెప్పించి ఇస్తారు. ఈ మధ్యే టెక్మహీంద్రాలో క్యాంపెయిన్ నిర్వహిస్తే.. భారీగా ఆర్డర్లు వచ్చాయి. 

Related Stories

Stories by team ys telugu