మొబైల్ మీడియా భవిష్యత్ గుర్తించిన స్టాపుల్

జబాంగ్ మాజీల కొత్త ప్రయోగంమొబైల్ కు ఇండియన్ బాజ్ ఫీడ్ పెద్ద ఉద్యోగం వదిలేసి మరీ ప్రయోగం వైపు

మొబైల్ మీడియా భవిష్యత్ గుర్తించిన స్టాపుల్

Thursday April 02, 2015,

4 min Read

అవును ... అది అంత సులువైన విషయం కాదు. వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కొద్దిమంది దగ్గరే అయినా అందుకు అవసరమైన పెట్టుబడులు, హంగులు ఆర్భాటాలు కూడా ఉంటాయి కానీ ఏ వ్యాపారం అనే దగ్గరే సంఘర్షణ మొదలవుతుంది. చాలా మంది ఇక్కడే చాలా మందిని సంప్రదిస్తూ ఉంటారు, లాభ నష్టాలను బేరీజు వేసుకుంటారు, అలా చాలా చాలా కసరత్తు చేసి కానీ ఏ వ్యాపారం చేయాలనేది నిర్ణయించుకో లేరు, 'ఇది; చేద్దామని కొంత సేపు అనిపిస్తుంది. అంతలోనే 'అది; అంత ఈజీ కాదు అనిపిస్తుంది.

స్టాపుల్ సంస్థ .. సీ.ఈ.ఓ అమిత్ సింగ్ విషయాన్నే తీసుకుంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి రెండు సంవత్సరాల ముందునుంచి అయన కంటి మీద కునుకులేదు. " వ్యాపారం ప్రారంభానికి ముందు నా కొత్త వ్యాపారం గురించి ఆలోచించకుండా నిద్ర పోయిన రోజు లేదు. ఎన్నో ఆలోచనలు. అన్ని ఆలోచనలు బుడగల లాంటివే. ఒక ఆలోచన కొద్ది సేపు ఎంతగానో ఊరిస్తుంది. కోట్ల వర్షం కురిపించే అవకాశంగా దర్శనమిస్తుంది. అంతలో, గాలి తీసిన బుడగలా చప్పబడి పోతుంది. ఆ ఆలోచన స్థానాన్ని మరో ఆలోచన ఆక్రమిస్తుంది. అలా ఆలోచనలు సాగిపోతూనే ఉంటాయి" అంటారు సింగ్.

స్టాపుల్.ఐ ఓ అంటే మాములు సంస్థ కాదు. ఒక విధంగా అది మొబైల్ కు భారతీయ 'బజ్ ఫీడ్' లాంటిది. 'మొబైల్ ఫస్ట్', 'యూసర్- జనరేటేడ్' కంటెంట్ ప్లాట్ ఫాం కావాలని ఉద్దేశంతో ప్రారంభించిన సంస్థ. సొంత వ్యాపారం ప్రారంభించే వరకు కూడా అమిత్ జబంగ్.కామ్ లో ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేసారు. అమిత్, ఐ ఐ టీ డిల్లీ, XLRI జంషెడ్పూర్ పూర్వ విద్యార్ధి. చాలా వరకు ప్రైవేటు ఈక్విటీ, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ విభాగాల్లో ఒక దశాబ్ద కాలం అనుభవం ఉంది.

ఎందుకు ఈ కొత్త దారి?

నిజం. మంచి ఉద్యోగంలో ఉన్నవారు మరో కొత్త ఉద్యోగం లోకి మారుతున్నారంటేనే ఎందుకలా? అనే ప్రశ్న వస్తుంది. అలాంటిది అమిత్ సింగ్ చక్కని ఉద్యోగం వదిలి వ్యాపారం చేయాలనుకున్నారంటే, ఎందుకలా అనే ప్రశ్న మరింతగా వినిపిస్తుంది. అందుకు అయన సమాధానం ,

" నేను పెట్టుబడి రంగం నుంచి వచ్చాను, అందుకే ఎప్పుడు సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలు నన్ను చుట్టూ ముడుతూ వచ్చాయి. చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలించలేదు. నేను ప్రారంభించాలని అనుకున్న అన్ని వ్యాపారాలు నాకు ఏమాత్రం పరిచయం లేని వ్యాపారాలు, బహుశా అందుకేనేమో ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు".

జబాంగ్ లో పని చేసిన పది సంవత్సరాల్లో అమిత్ సింగ్ ఇంటర్నెట్ వ్యాపారంలో ఉన్న మెళుకువలు తెలుసు కున్నారు. "జబాంగ్ ప్రారంభ బృందంలో ఒకడిగా ఇంటర్నెట్ వ్యాపారం గురించి తెలుసుకునే అవకాశం లభించింది. జబాంగ్ వరల్డ్ .కామ్ ను పునాదుల నుంచి ప్రారంభించి ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ సంస్థ గా అభివృద్ధి చేసిన బృందంలో సభ్యునిగా పనిచేస్తూనే నాకు నేనుగా కొన్ని వ్యాపార ప్రయత్నలు చేశాను. చివరికి స్టాప్లీ ప్రారంభించాను " అంటూ ఆయన వ్యాపారం లోకి ఎందుకొచ్చారు ఎలా వచ్చారు అనే విషయాన్ని చెప్పారు.

స్టాపుల్.ఐ ఓ వ్యవస్థాపకుల్లో అమిత్ సింగ్ తోపాటుగా మరొకరు కూడా ఉన్నారు . ఆయన పేరు దీపాంశు. ఆయన కూడా జబాంగ్ లో పనిచేసారు. అలా ఇద్దరి ఆలోచనలు ఒకటయ్యాయి. "జబాంగ్ లో బయట పరిస్థితిని చూస్తే మొబైల్ కంటెంట్ వ్యాపారం మాకు బాగా నచ్చింది. మొబైల్ బేస్డ్ కంటెంట్ ప్లాట్ ఫోరం ప్రారంభించాలని అనుకున్నాం" అంటూ ఆయన ఎలా ఎందుకు అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దీపాంశు ఐ.ఐ.టీ కాన్పూర్, ఐ ఎస్ బి హైదరాబాద్ పూర్వ విద్యార్ధి.

అమిత్ సింగ్, స్టాపుల్ వ్యవస్థాపకుడు

అమిత్ సింగ్, స్టాపుల్ వ్యవస్థాపకుడు


స్టాపుల్.ఐ ఓ మొబైల్ స్క్రీన్, ఉపయోగించే పద్దతుల ఆధారంగా కంటెంట్ పై దృష్టిని కేంద్రికరిస్తుంది. అంటే కంటెంట్ సింగిల్ స్క్రీన్ కి సరిపోయేలా, ఒక్కొక స్టొరీ వినియోగ సమయం తక్కువగా ఉండేలా చూడడం అన్న మాట. ఒక విధంగా చెప్పాలంటే క్యాజువల్ గేమింగ్ కు సమాన కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అనుకోవచ్చును. అంతేకాదు, ఈ ప్లాట్ ఫాం వినియోగించుకునే వారు కంటెంట్ ను వారే తయారు చేసుకో వచ్చు. లేదంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చును.. ఇంకా కావాలంటే రీ - ప్యాక్ చేసుకోవచ్చును, అని తమ ప్రోడక్ట్ గురించి దీపాంశు చెప్పారు.

ఈ కొత్త కంపెని తొలి వెర్షన్ www.staple.io పేస్ బుక్ యాప్ విడుదలయ్యాయి. త్వరలో ఆండ్రాయిడ్ అప్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కంటెంట్ పంపిస్తున్నాము. రానున్న కొద్ది వారాల్లో దాని స్థాయి, స్టోరీస్ సంఖ్య పెంచే ప్రయత్నాల్లో ఉన్నామని అమిత్ తెలిపారు.

కొత్త గా ప్రారంభమయ్యే ఇంటర్నెట్ కు పంపిణి వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవడం చాలా పెద్ద సమస్య. అయితే స్టాప్లీ ఈ విషయంలో అందరు నడిచిన దారిలో కాకుండా కొత్త దారిలో నడవాలని నిర్ణయించు కున్నారు." మంచి ప్రోడక్ట్ మొదటి సూత్రం, కొత్త దనం ఉండాలి అనేది రెండో సూత్రం, మార్పులు చేర్పులు ఎవరికీ వారు తమకు కావలసిన కంటెంట్ ను చేర్చుకునే సౌలభ్యం ఈ సూత్రాల ఆధారంగా విస్తరించాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నామని అమిత్ అంటున్నారు.

ఆదాయం ఎలా?

వ్యాపారం అన్నాక ఆదాయం అనివార్యంగా ఉండి తీరాలి . అదేలేక పొతే ఇంతే సంగతులు. అంతేకాదు ఖర్చుకు మించిన ఆదాయం ఉంటేనే వ్యాపారం సాగుతుంది. ఈ వ్యాపార ప్రాధమిక సూత్రానికి స్టాప్లీ మినహాయింపు కాదు. అందుకే బి 2 సి ప్రోడక్ట్ చుట్టూ వ్యాపారాన్ని విస్తరించు కోవాలని అంటున్నారు దీపాంశు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇది 0-1 గేమ్.ఇబ్బందులు ఎప్పుడు పారిశ్రామిక వేత్తలకే ఉంటాయి.ఇలాంటి పరిస్థితులలో సొమ్ము చేసుకోవాలంటే స్కేల్ ఉండాలి.స్కేల్ ఉంటే డబ్బు చేసుకునే మార్గాలు చాలానే ఉంటాయి అంటారు దీపాంశు.కంపెని ప్రస్తుతానికి స్పాన్సర్డ్ స్టోరీస్/టాగ్స్ సిద్దం చేసింది.

అయితే, స్టాప్లీ ద్వయానికి చాలా అశలున్నాయి. కంటెంట్ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కు తోంది. యువకులు గతంలో లాగా ఇప్పుడు న్యూస్ పేపర్స్ చూడడం లేదు. టీ వీ కూడా అంతే సెలెక్టివ్ గానే చుస్త్తున్నారు. స్పోర్ట్స్ అండ్ యూత్ చానల్స్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు. యూత్ కు కావలసిన ఎంటర్టైన్మెంట్, వార్తలు, ఇతర సమాచారం అంతా పేస్ బుక్ లేదా యు ట్యూబ్ వాట్స్ అప్ ద్వార ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే దురదృష్ట వశాత్తు, భారత దేశంలో కంటెంట్ క్వాలిటీ అంత బాగా లేదు. కొద్దికాలం క్రితం వరకు సినిమాలు కాదంటే క్రికెట్ ఈ రెండే ఉండేవి. మరో దారి ఉండేది కాదు. ఇప్పడు పరిస్థితి మారుతోంది. టీ వీ ఎఫ్, ఎ ఐ బీ లాంటి యు ట్యూబ్ చానల్స్ కంటెంట్ బాగుంటే ప్రజలు చూస్తారని రుజువు చేసాయిఅంటారు అమిత్. ఇప్పుడు .

న్యూస్ పేపర్స్, టీ వీ చానల్స్ పాతబడి పోయాయి. దానితో పాటే మార్కెట్ డాలర్స్ కూడా పరుగులు తీస్తాయా? ఆహా.. అందుకు చాలా అవకాసం ఉంది. అయితే ఎటొచ్చి పెద్ద కంపెనీలు ముందు కొచ్చి సరైన మార్గంలో డెవలప్ చేస్తే డాలర్ల మేడలే కట్ట వచ్చును ..ట