ట్యూషన్ టీచర్ల ఎంపికకు వేదిక ’ క్లెవర్ కిడ్ ’

పిల్లలను మరింత స్మార్ట్ గా తయారు చేసే యాప్తల్లిందండ్రులకు గైడ్ లైన్స్ అందిస్తూ హోం ట్యూషన్ మాస్టర్లను అందించే ఆన్ లైన్ సర్వీస్ఢిల్లీలోనే హోం ట్యూషన్ మార్కెట్ పదికోట్లు ఉంటుందని అంచనాదేశ వ్యాప్తంగా పటాపంచలు చేస్తోన్న అంచనాలు

ట్యూషన్ టీచర్ల ఎంపికకు వేదిక ’ క్లెవర్ కిడ్ ’

Thursday May 21, 2015,

2 min Read

స్కూల్ పూర్తయ్యాక పిల్లలకు ఇంట్లో ట్యూషన్ చెప్పే టీచర్లను వెతుక్కోవటం ఆషామాషీ వ్యవహారం కాదు. తమ పిల్లలకు, తమ బడ్జెట్‌కు సరిపోతూ అందుబాటులో ఉండే టీచర్ దొరకటం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే అలాంటి సమస్యకు పరిష్కారంగా మొదలైన క్లెవర్ కిడ్ అనే స్టార్టప్‌కి నిధులు చాలా సులభంగానే దొరికాయి. ఆరిన్ కాపిటల్ పార్ట్నర్స్ (మోహన్‌దాస్ పాయ్, రంజన్ పాయ్‌ల సంస్థ) ఇందులో పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి, వాటాల వివరాలు మాత్రం ఇరు సంస్థలూ వెల్లడించలేదు. వీళ్లతో పాటు ఆనంద్ కల్లుగద్దె, సునీల్ కౌల్, మైనా సాహి లాంటి ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టారు.

2014 లో షబ్నమ్ అజ్మీ ఈ స్టార్టప్ కంపెనీకి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగంలో పియర్సన్, డాటా విండ్ ( ఆకాశ్ టాబ్లెట్ ), నోకియా నిధులతో నడిచిన మిల్లీ అనే స్టార్టప్‌లో ఐదేళ్లకు పైగా పనిచేసిన షబ్నమ్ ... అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలకోసం మెరుగైన టీచర్లను వెతుక్కుంటున్నట్టు గ్రహించారు. తల్లిదండ్రుల అవసరాలను అర్థం చేసుకున్నాక తనదైన పరిష్కారమార్గంలో ఆమె విద్యారంగ నిపుణులను కలిశారు. విద్యా నిపుణులనూ, తల్లిదండ్రులనూ కలిపే ఒక వేదిక రూపకల్పనే ఆమె ఆలోచన. 

ఇద్దరూ తమ పేర్లు, అవసరాలూ, అనుభవాలూ వెల్లడించుకునే చోటు అది. తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలు తెలియజేస్తూ పేర్లు నమోదు చేసుకుంటారు. ట్యూషన్ కావాలా మరేదైనా ప్రత్యేకమైన హాబీ క్లాసులు కావాలా అనేది అందులో తెలియజేస్తారు. దీంతో తల్లిదండ్రులకు కష్టపడి వెతుక్కొవాల్సిన అవసరమే లేకుండా సునాయాసంగా పని జరిగిపోతుంది. వాళ్ల పిల్లలకు ఆ ప్రాంతంలో ఉన్న అత్యుత్తమమైన టీచర్ల బోధన అందుబాటులోకి వస్తుంది. ఈ సంస్థను ప్రారంభించిన ఆరు నెలల్లోపే క్లెవర్ కిడ్‌కి మంచి స్పందన వచ్చిందని షబ్నమ్ గుర్తించారు.

image


స్కూలు ముగిశాక చెప్పే ట్యూషన్ల మార్కెట్ ఢిల్లీ నేషనల్ కాపిటల్ రీజియన్‌లో సుమారు అరవై లక్షలమంది విద్యార్థులతో దాదాపు పదికోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. చాలామంది తల్లిదండ్రులు ఈ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవటానికి కేవలం ఎవరో నోటిమాటగా చెప్పిన విషయాన్నేనమ్మాల్సి వచ్చేది. అందువల్ల అంతంత మాత్రపు టీచర్లు దొరకటం, మంచి క్లాసుల కోసం పిల్లలు చాల దూరం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడటం తప్పేది కాదు.

“మా అధ్యయనాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యం. విద్యార్థి వయసు, మతం, తెగ, సామాజిక వర్గాన్ని పట్టించుకోం. ప్రతి ఒక్కరికీ వీలైనంత మంచి టీచర్ దొరకాలి. అత్యుత్తమమైన సమాచారాన్ని, వాళ్లమీద మార్కెట్లో ఉన్న అభిప్రాయాన్ని తల్లిదండ్రులు అందించడం మా లక్ష్యం. చివరగా పిల్లలకు ఉత్తమ బోధకులను అందించగలుగుతాం" - షబ్నమ్

వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకోసం మెరుగైన టీచర్ల సేవలు పొందటంలో ఈ కంపెనీ ఎంతగానో సాయపడింది. వచ్చే సంవత్సరం లక్షలాది మందికి సాయపడుతూ వ్యాపారాన్ని NCR నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకూ విస్తరించాలనుకుంటోంది.

''విద్యారంగంలో భారీ కంపెనీలు స్థాపించి విజయాలు సొంతం చేసుకున్న మోహన్ దాస్ పాయ్, ఉమాశంకర్ విశ్వనాథ్, మాక్స్ గాబ్రియెల్ లాంటి అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, సలహాదారులు మా విజయానికి బాటలు వేశారు. ఇలాంటి అద్భుతమైన గురువుల ప్రతిభ నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం రావటం నన్ను ఉద్వేగానికి గురిచేస్తోంది''.

“ తల్లిదండ్రుల మొట్టమొదటి భయంఎప్పుడూ వాళ్ల పిల్లల మేలు, భవిష్యత్తు గురించే ఉంటుంది. షబ్నమ్, ఆమె క్లెవర్ కిడ్ బృందం టెక్నాలజీ సాయంతో ఆ అవసరాలు తీర్చగల ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. ఇందులో చాలా పెద్ద అవకాశాన్ని, వేగవంతమైన ఎదుగుదలకు వీలుండటాన్ని గుర్తించాను. తల్లిదండ్రులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో సాయపడే భారాన్ని మోయాలనుకోవటం నచ్చే క్లెవర్ కిడ్ ని ప్రోత్సహించానంటారు'' ఇన్వెస్టర్ మోహన్‌దాస్ పాయ్.