ఈ హనీమూన్ స్వామి స్కెచ్చేస్తే మీ టూర్ సూపర్ సక్సెస్

హనీమూన్‌పై సలహాలు,సూచనలుకొత్త జంటలకు తెలియని ప్రాంతాలు వెతికిపెట్టే సంస్థనిర్ణీత ప్యాకేజీతో పాటు ప్రత్యేక కేర్ టేకింగ్పెళ్లితోపాటు టూర్ ప్లాన్ చేసే సరికొత్త స్టార్టప్

ఈ హనీమూన్ స్వామి స్కెచ్చేస్తే మీ టూర్ సూపర్ సక్సెస్

Saturday July 04, 2015,

3 min Read

హనీమూన్ స్వామి గురించి తెలుసుకునే ముందు అసలీ స్టార్టప్ ప్రారంభించడానికి గల కారణాలు తెలుసుకుందాం. నేహా,పునీత్ అగర్వాల్‌లు హనీమూన్‌కి ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, సింగపూర్ వెళ్లారు. సరిగ్గా 25వ రోజున వాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వాళ్ల ట్రిప్ అర్థాంతరంగా ముగిసిందని భావించిన వాళ్లు భవిష్యత్‌లో ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగా ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము వెళ్లిన ప్రాంతాల గురించి గతంలో వెళ్లిన వారి అభిప్రాయం తీసుకొని వెళ్లి ఉంటే బాగుండేదని అనుకున్నారు. వాళ్ల స్నేహితుల్లో కొత్త జంటలు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు వీళ్లు ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరితో మౌత్ పబ్లిసిటీ జరిగి అంతా వీరిని కలవడం మొదలు పెట్టారు. అలా ప్రాచుర్యంలోకి వచ్చిందే హనీమూన్ స్వామి సంస్థ.

image


స్థానిక బీర్ ఉంటే..బ్రేక్ ఫాస్ట్ అక్కర్లేదు

ఫరీదాబాద్‌లోని చిన్న ఆఫీసుతో 2008లో హనీమూన్ స్వామిని నేహా, పునీత్‌లు ప్రారంభించారు. సరైన ప్రణాళిక లేకుండా సమస్యలు ఎదుర్కొనే జంటలకు మద్దతివ్వడమే మా ప్రధాన ధ్యేయమని పునీత్ చెప్పుకొచ్చారు. వారి మొదటి పెట్టుబడి అక్షరాలా యాభై వేలు. అలా స్నేహితులకు సాయం చేస్తూ మొదలైన ప్రయాణం రెండేళ్లు సాగింది. అప్పుడే హనీమూన్ ప్లానర్స్ అవసరం ఎందుకుందనే దానిపై పునీత్ బ్లాగ్‌ మొదలుపెట్టారు. అది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వాళ్లను సంప్రదించడం ప్రారంభించారు. 

“కన్సల్టింగ్ ప్రారంభించిన మొదటి సారి మేం కలసిన మొదటి జంట సమీర్, కను. తర్వాత ఢిల్లీలో కైలాష్‌ని కలిసాను. వెడ్డింగ్ ప్లాన్ చేసే ఆయన హనీమూన్ ప్లాన్ కోసం మాకు కొన్ని సలహాలు అందించారు. మా రీసెర్చిలో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు చర్చకు వచ్చాయి. బ్రేక్‌ఫాస్ట్ కాకుండా లోకల్‌గా దొరికే బీర్ తీసుకోమని చాలా జంటలు చెప్పడం విశేషం. చాలా లేట్‌గా నిద్ర లేవడం వల్ల బ్రేక్ ఫాస్ట్ మిస్ అవుతున్నారు. కనుక ఓ చిన్న బార్ సెటప్ ఉంటే మంచిదని వారి అభిప్రాయం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు హనీమూన్‌కి మాంచి బూస్ట్ ఇస్తాయని'' తెలుసుకున్నాం అంటారు పునీత్. అలా ఈ కన్సల్టింగ్‌లో మొదటి సంస్థగా ఆవిర్భవించిందీ హనీమూన్ స్వామి.

“మా సంస్థ వన్ స్టాప్ సొల్యూషన్. ఇష్టాయిష్టాలు ఇతర విషయాలు కలగలిపిన యాత్రకు ప్లానింగ్ చేసే టీమ్ టీం ఉంది. దీంతో హనీమూన్‌కి ఏం తీసుకెళ్లాలి, ఏది తీసుకోకూడదనే విషయాలను మరచిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు” అని పునీత్ అంటున్నారు.
పునీత్ అగర్వాల్

పునీత్ అగర్వాల్


హనీమూన్ స్వామిని ఎంచుకోడానికి పునీత్ ప్రధానంగా చెప్పే మూడు కారణాలిలా ఉన్నాయి.

  • 1) పెళ్లి బిజీలో ఉండి హనీమూన్ ప్లాన్ చేసుకోడానికి సమయం ఉండకపోవచ్చు.
  • 2) హనీమూన్ ఎంతో ఎగ్జైట్‌మెంట్ తో కూడుకున్నది. ఎలాంటి రిస్క్ అవసరం లేకుండా యాత్ర సాగించాలని అనుకుంటారు.
  • 3)తాము గతంలో వెళ్లిన ప్రాంతాలకు వెళ్లాలని నూటికి 95 శాతం జంటలు అనుకోరు.

హనీమూన్ స్వామి అనేది ట్రిప్ పూర్తి అయిన దాకా మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

హనీమూన్ ప్లానర్ల కు ప్రత్యేక డిగ్రీ

భారత దేశంలో వెడ్డింగ్ మార్కెట్ 3500 బిలియన్లుగా నెట్ స్క్రైబ్ రిపోర్ట్ చెబ్తోంది. హనీమూన్ కోసం పెళ్లైన కొత్తజంటలు పెళ్లి ఖర్చులో 10 నుంచి 15శాతం ఖర్చు చేసినా.. 350బిలియన్లు దాటుతోంది పునీత్ లెక్కలేస్తున్నారు. హనీమూన్ ప్లానర్ల కోసం ప్రత్యేక డిగ్రీ కోర్స్ ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. హనీమూన్ స్వామితో పాటు పునీత్ ఆయుర్వేద ప్రాడక్టుల అమ్మే వ్యాపారాన్ని గడిచిన 13 ఏళ్లుగా చేస్తున్నారు. ప్రస్తుతానికి వీళ్లు ఆరుగురు సభ్యుల టీం. 

'ఓ సాధారణ సలహాలిచ్చే సర్వీసుగా మొదలైన మా ప్రయాణం ఇప్పుడిక్కడికి చేరుకుంది. భవిష్యత్ లో మరింత ముందుకు పోతుందని అనుకుంటున్నాం. మాకెంతో సంతోషాన్న కలిగించే విషయం ఇది అని' పునీత్ దంపతులు అంటున్నారు. ఇలాంటి స్పెషల్ అకేషన్ ప్యాకేజీల కోసం పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. కాక్స్ అండ్ కింగ్స్, థామస్ కుక్ లాంటివి ఉన్నప్పటికీ మాలా సలహాలు, సూచనలు ఇవ్వడం లేదు. మేం కన్సల్టింగ్‌తోపాటు మెంటారింగ్ జరుపుతామని పునీత్ చెప్పుకొచ్చారు. దీంతో జంటలకు పూర్తి స్థాయి క్లారిటీ రావడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఇదే మా బలం. మార్కెట్లో ఉన్న ఏ ఇతర కంపెనీ ఈ పనిచేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా సార్లు, హనీమూన్ ప్యాకేజి ధర ఎక్కువగా ఉంది. దీంతో వారికి అవకాశం లేకుండా ముందుకు పోతున్నారు. అలాంటివారికి మరో కొత్త దారి చూపెడుతున్నామన్నారు'.

హనీమూన్ స్వామికి అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ట్రావెలర్లు కస్టమర్లతో మాట్లాడి, వారి వివరాలుతీసుకుంటున్నారు. ఆన్ లైన్ లో ఫామ్స్‌ను ఫిల్ చేస్తున్నారు. ఈ రోజులో ఇది సాధారణ విషయమే. మాకు ఆ సౌలభ్యం ఉండదు. మా కన్సల్టెంట్ కోసం కస్టమర్లే మమ్మల్ని సంప్రదించాల్సి ఉంది. క్లయింట్స్‌ను వెతుక్కోవడం పెద్ద సవాలే అంటున్నారు పునీత్. వారి బడ్జెట్ ను పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో కూడా డెస్టినేషన్ గురించి చర్చిస్తున్నారు. వారి స్నేహితులు ఒక ప్రాంతాన్ని మాత్రమే చూశారు. అక్కడుండే మరికొన్ని అధ్భుతమైన లోకేషన్సు చూసే అవకాశం లేదు. అలాంటిది వారితో చర్చించడం వల్ల ఆ ప్రాంతంపై పూర్తి అవగాహన వచ్చే అవకావం లేదు. దీన్ని ఛేదించగలిగితే మేం విజయం సాధించినట్లే అని పునీత్ ముగించారు.