కారెక్కడానికి కలసి రండి

మనీ ట్రాంజాక్షన్ తలనొప్పులు లేని కార్ పుల్లింగ్కలసి ప్రయాణించాలనుకున్న వారితోనే ప్రయాణంఆన్ లైన్ వ్యాలెట్ తో అన్ని ఆపరేషన్స్ఢిల్లీలో విజయవంతమైన కార్ పుల్లింగ్ కమ్యూనిటీగా ఫోక్స్ వ్యాగన్

0

ఈరోజుల్లో ట్రాఫిక్ అనేది ఎంతో టెర్రిఫిక్. కార్ పుల్లింగ్ అనేది దీని సరైన పరిష్కారమే అయినా దాన్ని అమలు చేయడమే ఓ పెద్ద సవాలు . చాలా మంది దీన్ని ప్రయత్నించి విరమించుకున్నారు. ఢిల్లీలో పదివేల మంది ఫోక్స్ వేగన్ ని ఉపయోగిస్తున్నారంటే సమీర్ ఖన్నా సక్సస్ అయినట్లే. ఏ ఒక్కరో అనుకుంటే సమస్య తీరిపోదు. సమీర్ చాలమంది వ్యక్తులతో కలసి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దీన్నొక ఉద్యమంలాగా తీసుకు రాగలిగారు. అయితే గతంలో కార్ పుల్లింగ్ భారీస్థాయిలో విజయవంతం కాకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. రైడ్స్ సౌకర్యవంతంగా లేకపోవడం, ఇబ్బందికరమైన ద్రవ్య లావాదేవీల వల్ల కార్ పుల్లింగ్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

సమీర్ ఖన్నా, ఫౌండర్
సమీర్ ఖన్నా, ఫౌండర్

కొత్త ఒరవడితో సమీర్ ఫోక్స్ వ్యాగన్ ను ప్రారంభించారు. ఫోక్స్ వ్యాగన్ అనేది డబ్బును గుంజే పద్దతిని స్వస్థి చెప్పింది. క్యాబ్ సర్వీసు లో ఇతరులు వచ్చి కలవడం కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇక సమీర్ విషయానికొస్తో తాను గతంలో సిస్కో, హవాయ్, ఎరిక్సన్ లాంటి కంపెనీల్లో సీనియర్ రోల్స్ లో పనిచేశారు. ప్రతిరోజు ట్రాఫిక్ లో ఎంతో అలసిపోయిన సమీర్ రోడ్లపై కార్లలో ఒకే వ్యక్తి ప్రయాణించడాన్ని గుర్తించారు. అందరితో మాట్లాడుతూ ట్రాఫిక్ లో చిక్కు కున్న అందరూ కలసి కార్లలో ప్రయాణిస్తే.. ట్రాఫిక్ ఫ్రస్టేషన్ తీరడమే కాదు ఇంకొందరికి సాయం చేసినట్లవుతుందని వివరించారు.

ఇదెలా పనిచేస్తుంది

ఫోక్స్ వ్యాగన్ లో డబ్బులు ఎక్సెంజి చేసుకునే తలనొప్పి పూర్తిగా ఉండదు. మీ సొంత వెహికల్ లాగానే సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. వ్యాలెట్ ఫీచర్ తో ఇది పనిచేస్తుంది. ఆన్ లైన్ వ్యాలెట్ లో డబ్బులు లేకపోతే సైట్ ద్వారా క్యాబ్ బుకింగ్ సాధ్యపడదు. పర్సన్ కి ఒక కిలోమీటర్ కి 3.50రూపాయలు చార్జి చేస్తుంది. రైడ్ పూర్తియిన తర్వాత మూడు రూపాయిలు కార్ యజమానికి, అర్థరూపాయి ఫోక్స్ వ్యాగన్ అకౌంట్ లోకి వెళ్లి పోతుంది. రైడింగ్ లో ఉన్న అందరిని యాప్ లో చూపిస్తుంది. వారిలో మీ ఇష్టం వచ్చిన వారిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా మెంబర్షిప్ కానీ ఇతర చార్జీలు కానీ అవసరం లేదు.

సేఫ్టీ

కార్ పుల్లింగ్ సేఫ్టీ అనేది అన్నింటి కంటే పెద్ద సమస్య. ఎవరితో అయినా ట్రావెల్ చేయాలని లేకపోతే లేదా వారి బిహేవియర్ నచ్చక పోతే వారితో రైడ్ చేయాలా లేదా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇవి చాలా ముఖ్యమైనవి. వీటికోసం సమీర్ ఓ గొప్ప పనిచేశారు. ఆడవారి కోసం యాప్ లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఒకసారి ఈ యాప్ లో లాగిన్ అయితే ఆడవారికి అనుకూలంగా యాప్ లో కొన్న సెట్టింగ్ మారిపోతాయి. ఆడవారు సాధారణంగా ఆడవారితోనే ప్రయాణించాలనుకుంటారు. రైడ్ తర్వాత యూజర్ల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. కార్ ఓనర్ బిహేవియర్ సరిగ్గా లేకపోతే కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఏ ఇతర మెంబర్ బిహేవియర్ సరిగ్గా లేకున్నా వారిపై ఫ్లాగ్ చేయొచ్చు. ఐదు ఫ్లాగుల తర్వాత ఆ యూజర్ ని బ్యాన్ చేస్తారు.

సవాళ్లు

జనాన్ని వారి అలవాట్లను మార్చుకోమనడం అన్నింటి కంటే కష్టమైన పని. అంతా ఇదో గొప్ప ఆలోచన అంటారు తప్పితే వారు దాన్ని ఫాలో అవ్వరు. మొదటి 200మంది యూజర్లను పొందడానికి 6నెలల సమయం పట్టింది. ఇప్పుడు మాకు 10,000 మంది యూజర్లను కలిగి ఉన్నాం. ప్రతిరోజూ వందమంది యాడ్ అవుతున్నారిని సమీర్ చెప్పుకొచ్చారు.

ఫోక్స్ వ్యాగన్ టీం

ఫోక్స్ వ్యాగన్ లో 12మంది సభ్యులున్నారు. ఇది పూర్తిగా బూట్ స్ట్రాపెడ్ కంపెనీ. ఢిల్లీలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సంస్థ ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణేల్లో ప్రారంభిచాంలని చూస్తోంది. దేశంలోనే పెద్ద రైడ్ షేరింగ్ కంపెనీగా ఫోక్స్ వ్యాగన్ ను చేయాలన్నదే తన లక్ష్యమని సమీర్ అన్నారు.

ఫోక్స్ వ్యాగన్ చెప్పే పాఠాలు

1) బాధ్యత తీసుకోడానికి సిద్ధంగా ఉండాలి, క్రెడిట్ ఫ్రీ జీవితాన్ని అలవరుచుకోవాలి.

2) మీ ఉద్యోగం మానేసే ముందు మీ కుటుంబానికి ఫీడ్ ఇవ్వాలనే విషయం మర్చిపోకూడదు. తర్వతే మీ ప్రయాణం ప్రారంభించాలి.

3) రక్షణ, నిలకడ గా ఉండి గొప్ప పనులు చేయాలి

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik