కటౌట్ ఒక్కటే సరిపోదు.. కంటెంట్ కూడా కావాలి!!

కటౌట్ ఒక్కటే సరిపోదు.. కంటెంట్ కూడా కావాలి!!

Monday December 28, 2015,

4 min Read

ఏదైనా బ్రాండ్ గురించి తెలుసుకోవాలంటే.. దానికి సంబంధించిన కంటెంట్‌ చదివితే సరిపోతుంది. తమ గురించి వివరించేందుకు ప్రతి బ్రాండ్ ఒక కంటెంట్‌ సృష్టిస్తున్నది. ఆ కంటెంట్ ఆధారంగానే వినియోగదారుడికి ఆ బ్రాండ్‌ పై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకవేళ బ్రాండ్‌ స్థాయిలో కంటెంట్ లేకపోతే ఆ కంపెనీ పరిస్థితి అంతే. అందుకు చక్కటి ఉదాహరణ గ్రాబ్‌ హౌజ్. రియాల్టీ రంగంలో పెద్ద కంపెనీలకు పోటీ ఇవ్వాలనుకుంటున్న గ్రాబ్‌ హౌజ్.. తన వెబ్‌సైట్‌లో అందుకు తగిన కంటెంట్ పెట్టక ఇబ్బందులు పడుతోంది. స్టార్టప్ ప్రపంచంలో వెనుపడిన గ్రాబ్ హౌజ్ పతనంపై డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ ర్యాంక్ హైయ్యర్.ఇన్ సహ వ్యవస్థాపకులు రౌనక్ గుహా విశ్లేషణ.

సోషల్ మీడియా శకంలో ప్రతి బ్రాండ్ తమదైన కంటెంట్‌ ను క్రియేట్ చేస్తున్నది. సోషల్ మీడియాలో బలమైన ముద్ర వేయాలంటే అద్భుతమైన కంటెంట్ అవసరం. అయితే కంటెంట్ రేసుతో పడి దాని కోర్ పర్పస్ ఏంటో చాలా బ్రాండ్లు మర్చిపోతున్నాయి. ఇదో మాయలాంటిది. ఒక్కసారి దాంట్లో పడిపోయామా బయటపడటం చాలా కష్టం.

గ్రాఫిక్స్: ఆదిత్య రనడే

గ్రాఫిక్స్: ఆదిత్య రనడే


యూజర్లతో నిత్యం కమ్యూనికేట్ అయ్యేందుకే కంటెంట్‌. బ్రాండ్‌ కు సంబంధించిన సమాచారం బాగుంటేనే యూజర్లు తొందరగా అట్రాక్ట్ అవుతారు. వినియోగదారుల మదిలో బ్రాండ్ గురించి ఓ అవగాహన ఏర్పడేందుకు కంటెంట్ ఓ సాధనం.

బ్రాండ్ పర్పస్‌ ను సక్సెస్ చేయడంలో కంటెంట్‌దే కీరోల్. ఒకవేళ సక్సెస్ చేయడంలో విఫలమైతే, ఆలోమెటిక్‌ గా ఆ బ్రాండ్‌ మార్కెటింగ్‌ లో కూడా విఫలమవుతుంది. బ్రాండ్‌ ను విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టి అమ్మకాలు పెంచాలంటే చక్కటి కంటెంటే ముఖ్యం.

ఇలాంటి విపరీత పరిణామం గ్రాబ్‌ హౌజ్.కామ్ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. వాస్తవానికి గ్రాబ్‌ హౌజ్ దేశంలో అత్యుత్తమ రియాల్టీ సంస్థల్లో ఒకటి. అయితే మరో అంశంతో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మూకుమ్మడిగా ఉద్యోగులను తొలగించిన సంస్థగా పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో నిలిచింది.

స్టార్టప్‌ సంస్థలు లాభాలను గడించేందుకు ప్రధానంగా అవసరమైనది మార్కెటింగ్, టెక్, సేల్స్ ఉద్యోగులే. ఒకవేళ ఆదాయాలు ఆర్జించడంలో విఫలమయితే దాని ప్రభావం ఉద్యోగుల మీద పడుతుంది.

ఏదైమైనా గ్రాబ్‌ హౌజ్‌ కు ఇదో తీవ్ర పరిమాణం. నష్టం కలిగించే అంశం. రియల్ ఎస్టేట్ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న గ్రాబ్‌ హౌజ్‌ అగ్రస్థాయి సంస్థమీ కాదు. రియాల్టీ సంస్థ అయినప్పటికీ.. స్కూప్ వూఫ్, బజ్‌ ఫీడ్ మాదిరిగా గ్రాబ్‌ హౌజ్‌ కూడా వైరల్ కంటెంట్ మ్యాగజైన్‌ గానే సుపరిచితం. గ్రాబ్‌ హౌజ్ ప్రచురించే పత్రి ఆర్టికల్ ఆన్‌ లైన్‌లో వైరల్ సృష్టిస్తుంది. ఎంతోమంది క్లిక్ చేస్తున్నారు. వేలాదిమంది పేజీలను వీక్షిస్తున్నారు. చాలామంది గ్రాబ్‌ హౌజ్ పేజీలను వీక్షిస్తున్నా, రియాల్టీ రంగంలో మాత్రం ఆ సంస్థకు పెద్దగా గ్రోత్ లేదు. అందుకు కారణం కంటెంటే అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రాబ్‌ హౌజ్ బ్రాండ్ ఉద్దేశం ఒకటైతే.. కంటెంట్‌లో మాత్రం మరోటుంటుంది. కంటెంట్ అద్భుతంగానే ఉన్నా, బ్రాండ్ ఇమేజ్‌ను ఇనుమడించడంలో మాత్రం విఫలమవుతున్నది.

కంటెంట్ మ్యాగజైన్‌ గా మాత్రమే గ్రాబ్‌ హౌజ్ తెలిసి ఉండి, అపార్ట్‌ మెంట్ కోసం నేను ప్రయత్నిస్తున్నా, ఆ సంస్థను సంప్రదించను. ఒకవేళ సంప్రదిస్తే అది చారిత్రక తప్పిదం అవుతుంది.

సంస్థలో బ్రాండ్ మేనేజర్ ఎలా ఉండాలంటే.. సంస్థ వృద్ధికి ఎలాంటి కంటెంట్ అవసరమో గుర్తించాలి. బ్రాండ్ గుర్తింపు పొందాలంటే కంటెంట్‌ లో ఏం ఉండాలో అంచనా వేయగలగాలి. కంటెంట్‌ ను చూడగానే కస్టమర్లకు బ్రాండ్ గురించి అరటిపండు ఒలిచినంత ఈజీగా అర్థమైపోవాలి. అంతేకానీ రేటింగ్ పెంచుకోవాలన్న ఆత్రుతలో, రేసులో పడిపోయి, ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ఏదీ పడితే అది సృష్టించొద్దు. బ్రాండ్‌ కు అవసరమైనదే రాయాల్సి ఉంటుంది. అలా రాసి బ్రాండ్ ఇమేజ్‌ ను దెబ్బతీయొద్దు.

కంటెంట్‌ చూడగానే కస్టమర్ల మనసులో నిలిచిపోవాలి. స్కిన్‌కేర్ బ్రాండ్‌నే తీసుకుందాం.. స్కిన్‌కేర్ రంగానికి చెందిన కస్టమర్లను ఆకట్టుకునేలా కంటెంట్ ఉండాలి. అంతేకానీ లైఫ్ స్టయిల్ మ్యాగజైన్‌కు అవసరమైన కంటెంట్ అవసరం లేదు. అలా చేయడం వల్ల సైట్‌కు రేటింగ్ పెరుగుతుందోమో కానీ, నిజమైన కస్టమర్లు మాత్రం మిస్సవుతారు. ఇలాంటి పరిణామాలే గ్రాబ్‌హౌజ్‌ను అల్లకల్లోలం చేశాయి.

అర్బన్ కాక్‌టైల్ ఎఫెక్ట్..

రియాల్టీ రంగంలో దూసుకెళ్లాలనుకుంటున్న గ్రాబ్‌ హౌజ్‌ కష్టాలకు కారణం అర్బన్ కాక్‌ టైల్ పేజీనే. అర్బన్ కాక్‌ టైల్ లైఫ్‌ స్టయిల్ న్యూస్ మ్యాగజైన్. గ్రాబ్‌హౌజ్ కోర్ బిజినెస్‌తో అర్బన్ కాక్‌టైల్‌కు ఎలాంటి సంబంధం లేదు. అర్బన్ కాక్‌టైల్ మ్యాగజైన్ వెబ్‌సైట్‌కు వేలకొద్ది క్లిక్స్, పెద్ద సంఖ్యలో రెగ్యులర్ వీక్షకులున్నారు. వెబ్‌సై ట్‌ను చాలామంది వీక్షిస్తున్నప్పటికీ అదో రియల్ ఎస్టేట్ పోర్టల్ అని చాలామంది క్లయింట్లకు తెలియదు. గ్రాబ్‌ హౌజ్ చేసిన మరో పొరపాటేంటే.. ఒకే డొమైన్‌లో లైఫ్‌స్టయిల్ వెబ్‌సైట్‌ను ప్యారలల్‌ గా క్రియేట్ చేయడం. అర్బన్ కాక్‌టైల్ కారణంగా గ్రాబ్‌ హౌజ్‌ను కూడా లైఫ్‌ స్టయిల్‌ కు సంబంధించిన వెబ్‌సైటేనని కస్టమర్లు పొరబడుతున్నారు.

అర్బన్ కాక్‌ టైల్ పేజిలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి గ్రాబ్‌ హౌజ్ హోం పేజీలోకి వెళ్లాలంటే చాలా తతంగం ఉంటుంది. ఆ పేజీ కింది బాగంలో ప్రత్యేకించి చూస్తే కానీ హోంపేజీ లింక్ కనిపించదు. మళ్లీ హోంపేజీలోకి వెళ్లేందుకు యూజర్లకు అవకాశమివ్వనప్పుడు.. దాన్ని ప్రధాన డొమైన్ లో పొందుపర్చాల్సిన అవసరమేంటో అర్థం కావడంలేదు.

ర్యాంక్ కోసమే..

గ్రాబ్‌హౌజ్ రియాల్టీ వెబ్‌ సైట్ అయినప్పటికీ, వ్యూవర్లను అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి వ్యూహం పన్ని ఉండొచ్చు. గూగుల్ సెర్చ్‌ లో వెతికినప్పుడు కామన్‌ ఫ్లోర్‌ కంటే ముందుగానే గ్రాబ్‌ హౌజ్ కనిపించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు. కానీ ఈ వ్యూహం మాత్రం పూర్తిగా తప్పు. ర్యాంక్ మెరుగవుతునప్పటికీ బ్రాండ్ పొజిషన్ మాత్రం కోల్పోతున్నది.

అవకాశమున్నప్పుడు కంపెనీలు సమాంతర అసెట్‌లను సృష్టించొద్దా? అంటే.. సృష్టించొచ్చు. కానీ మదర్ బ్రాండ్ కింద దాన్ని ఏర్పాటు చేయొద్దు. ఒకవేళ మదర్ బ్రాండ్ కోక కోలా అంతటి పెద్ద కంపెనీ అయితే, దాని కింద మరో పేజీని సృష్టిస్తే ఎలాంటి నష్టం ఉండదు. కానీ మదర్ బ్రాండ్ పేరే కస్టమర్లకు సరిగా తెలియనప్పుడు, సమాంతరంగా మరోదాన్ని సృష్టిస్తే, దాని భారం కూడా మదర్ బ్రాండ్ పై పడి, రెండూ విఫలమయ్యే ప్రమాదాలుంటాయి. గ్రాబ్‌ హౌజ్ విషయంలో ఇప్పుడు జరిగిందిదే.

ప్రస్తుతం గ్రాబ్‌ హౌజ్ సాధిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కన్నా, అర్బన్ కాక్ టైల్ అడ్వర్టయిజ్‌ మెంట్ల ద్వారా వస్తున్న ఆదాయమే ఎక్కువ.

గ్రాబ్‌ హౌజ్ ఇప్పుడు ఏంచేయాలి?

ఒకవేళ గ్రాబ్‌ హౌజ్ మార్కెటింగ్, బ్రాండ్ స్ట్రేటజీ ఇంచార్జ్ నేనే అయి ఉంటే గ్రాబ్‌ హౌజ్ డొమైన్ నుంచి అర్బన్ కాక్‌ టైల్‌ ను తక్షణమే తొలిగించేస్తాను. ఆ తర్వాత రెండు సమాంతర డొమైన్లను, స్వతంత్రంగా ఏర్పాటు చేస్తాను.

నగరంలో అకామిడేషన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కస్టమర్లు ఎదుర్కొనే రియల్ ఎస్టేట్ సమస్యలకు సంబంధించిన కంటెంట్ ను సృష్టించడంపై గ్రాబ్‌ హౌజ్ దృష్టి సారించాలి.

ఆ తర్వాత పూర్తిగా రియల్ ఎస్టేట్ ఫార్మాట్‌ పైనే పనిచేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో సవాళ్లున్నాయి. షేర్ హోల్డర్ల అంచనాలను అందుకుని, రెవెన్యూ ఆర్జించడంలో పెద్దపెద్ద కంపెనీలే స్ట్రగులవుతున్నాయి. అందువల్ల ప్లాట్‌ ఫామ్‌ ఎలా మెరుగుపర్చాలి? కస్టమర్ల అవసరాలు ఏంటి ? వాటిని ఎలా పరిష్కరించాలన్న అంశంపై దృష్టిపెట్టాలి.

ఈ విషయాన్ని గ్రాబ్ హౌజ్ ఇప్పటికే అర్థం చేసుకుందని నేననుకుంటున్నాను. అందుకే ఉద్యోగులను తొలిగించిందని నా ఉద్దేశం.

అలాకాకుండా మరికొంత కాలంపాటు అర్బన్ కాక్‌ టైల్ కస్టమర్లను కాపాడుకుని, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవాలి. ఆ తర్వాత అర్బన్ కాక్‌ టైల్‌ ను స్కూప్ వూప్‌ లాంటి ఇతర కంటెంట్ మేగజైన్లకు విక్రయించాలి. వ్యాపారం నుంచి వైదొలిగేందుకు ఇన్వెస్టర్లకు ఇంతకన్నా మంచి వ్యూహం మరొకటి ఉండదు.

రెండు అసెట్స్ ముందుకు సాగాలంటే మరింత పెట్టుబడి రావాల్సిన అవసరముంది. ఒకవేళ కంపెనీ వృద్ధి చెందాలనుకుంటే ఎవరైనా ఒకరే సంస్థ బాధ్యతలు చూసుకోవాలి. మరి ఈ సూచనలను గ్రాబ్‌ హౌజ్ పాటిస్తుందేమో చూడాలి.

గమనిక: ఈ కథనంతో యువర్ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు. ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ రచయితవే. యువర్ స్టోరీ అభిప్రాయాలుగా భావించొద్దు..