కశ్మీర్‌లో మొదటి మొబైల్ యాప్‌ డెవలపర్

కాశ్మీర్ లో ఫస్ట్ మొబైల్ యాప్ డెవలపర్‌కాశ్మీర్ లోయలో..ఎవరికేది కావాలన్నా చిటికెలో చెప్పేసే యాప్ ప్రార్థనా సమయాల నుంచి పిజ్జా డెలివరీ వరకూ..రైల్వే టైమింగ్స్ నుంచి..హాస్పిటల్ సేవల వరకూ అన్నిటికీ డయల్ కాశ్మీర్ యాప్ సర్వేక సమస్తం

0

అన్నిట్లో నేనే ఫస్ట్..సెకండ్ ఇంకెవరో..ఉండాలి. ఈ యాటిట్యూడే మెహ్వీష్ ముస్తాక్‌ను కశ్మీర్‌లో ఫస్ట్ ఆండ్రాయిడ్ యాప్ క్రియేటర్‌గా నిలబెట్టింది. 2013లో ఈ 21ఏళ్ల వయస్సులోనే కశ్మీర్ వ్యాలీలో ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ యాప్ ను తయారుచేసేలా చేసింది.

మెహ్వీష్ ముస్తాక్
మెహ్వీష్ ముస్తాక్

కాశ్మీర్ లోయ ఎంత అందంగా ఉంటుందో అంతే స్థాయిలో రక్తపాతం, దాడులు జరుగుతుంటాయి. ఘర్షణపూరిత వాతావరణం వేళ్లూనుకుపోయింది. అలాంటి రాష్ట్రంలో మెహ్వీష్ ఈ ఘనత సాధించిందంటే దానికి ఆమెకు కుటుంబ సభ్యుల ప్రోత్సహమే కారణం. "నేనే పని చేసినా నా కుటుంబసభ్యులు అడ్డుచెప్పేవారు కాదు. నాకు ఆసక్తి ఉన్న విషయాల్లో వాళ్లే ప్రోత్సహించేవాళ్లు. అది ఎంత రిస్కీ జాబైనా సరే పోరాడి, వెంటాడి సాధించమనేవాళ్లు. అలా నా 'డయల్ కాశ్మీర్' అనే యాప్ తయారైంది " అని చెప్తోందీ డేరింగ్ లేడీ. ఫస్ట్ యాప్ డెవలపర్ అనే ఫీలింగ్ చాలా గ్రేట్ అంటోంది మెహ్విక్.

మెహ్వీష్ బాల్యం, స్కూలింగ్ అంతా శ్రీనగర్ లోనే జరిగింది. ఐతే టెక్నాలజీ పై ఇంట్రస్ట్ ఆమెకి చాలా చిన్న వయస్సునుంచే కలిగింది. వాళ్ల కుటుంబంలో మెహ్వీష్ చివరి అమ్మాయి దాంతో పాటు కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసింది. కుటుంబ నేపధ్యానికి వస్తే.. తండ్రి ఐఎఫ్ఆర్ఎస్‌లో రిటైరవగా, తల్లి గృహిణిగా తన బాధ్యతలు తాను నిర్వర్తించేది. అన్న ఇంజనీరింగ్ చేసి ఆపై ఎంబిఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడతను.

యాప్ లో ఏమేం ఉన్నాయ్..?

" ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు..ఎవరి దగ్గర ఏ సర్వీస్ దొరుకుతుందో, ఎప్పుడు ఎవరికి ఎలా అవసరం ఏర్పడుతుందో తెలీదు. అందుకే అలాంటి సేవలన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో... ఒకే చోట తెలిస్తే బావుండనిపించింది. అలాంటి పని చేయాలనిపించి. ఈ యాప్ డిజైన్ చేశాను. ఓ రకంగా ఎల్లో పేజెస్ లాంటిదనుకోండి.. " చెప్పింది మెహ్వీష్.

2013 వింటర్ సీజన్‌లో ఆండ్రాయిడ్ బెస్డే అప్లికేషన్ డెవలప్‌మెంట్ పై ఆన్ లైన్ కోర్సు చేసింది మెహ్వీష్. కోర్సులో భాగంగా స్టూడెంట్లే సొంతంగా ఓ యాప్ తయారు చేయాలి. అలా డయల్ కశ్మీర్ అనే ప్రాజెక్టును మొదలుపెట్టింది మెహ్వీష్. జస్ట్ రెండు వారాల్లో యాప్ ఫస్ట్ వెర్షన్ తయారైంది.

" అన్నిటికన్నా కష్టంగా అన్పించింది సమాచారం సేకరించడమే. ఫోన్ నెంబర్లు, అవి అందించే సేవలు, యాప్‌లో అమర్చడానికి కష్టపడాల్సి వచ్చింది. అప్పట్లో నన్ను ఏ శక్తి ప్రేరేపించిందో తెలీదు కానీ.. కశ్మీర్ ప్రజల అవసరాల కోసం ఉపయోగపడాలనేదే ముఖ్యలక్ష్యంగా పెట్టుకున్నాను " అని చెప్తోంది మెహ్వీష్. అప్పట్లో అఫిషియల్ వెబ్ సైట్లు పని చేసేవి కాదు.. ఒక్కోసారి ఆయా సైట్లలో ఇచ్చిన ఫోన్ నంబర్లు పని చేసేవి కాదు. చాలా మటుకు వాటిల్లో పాత నంబర్లు కూడా ఉండేవి.

డయల్ కశ్మీర్ యాప్ తో ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే... సమాచారం..ఓ టెలిఫోన్ డైరక్టరీలో ఎలాగైతే..కంపెనీలు వాటి ఫోన్ నంబర్లు ఉంటాయో..దానికి అదనంగా ఈ మెయిల్ ఐడీలు.. అడ్రస్ లు..అవి అందించే సేవలు డయల్ యువర్ కశ్మీర్ యాప్ లో ఉన్నాయ్.. ఇంకో ప్రత్యేకత ఏంటంటే పిన్ కోడ్ కూడా వాటికి అటాచ్ అయి ఉంటుంది. రైల్వే టైమింగ్స్, హాలిడేస్ లిస్ట్, ముస్లింల ప్రార్ధన చేసే సమయాలు.. ఇలా ఇంకొన్ని డయల్ కశ్మీర్ లొ పొందుపరిచింది మెహ్వీష్ .

మెహ్వీష్ ముస్తాక్
మెహ్వీష్ ముస్తాక్

డయల్ కశ్మీర్ యాప్ అడ్వాంటేజెస్

యాప్ లాంచైన తర్వాత అది వాడిన వారు తమకి బాగా ఉపయోగపడిందంటారు.." ఓ రోజు ఒకరి ఇంట్లో జంతువేదో చనిపోయి పడి ఉంది. ఆ ఇంట్లోవారు..ఈ యాప్‌ని వాడటం ద్వారా.. మున్సిపల్ సిబ్బందిని పిలిపించి..దాన్ని అక్కడ్నుంచి తీసివేయించగలిగారు..ఇలాంటివి వింటుంటే నాకు ఆనందంగా ఉంటుంది"

యాప్ ను వాడుతూ చాలామంది రైళ్ల టైమ్ టేబుల్ తెలుసుకుంటున్నారు. అలానే ప్రార్థన సమయం తెలుసుకుంటున్నారు. ఇలా ప్రజలకు సాయపడటంలో నా యాప్ ఉపయోగపడుతుందని అంటుంటే చాలా సంతోషంగా అన్పిస్తుంది.. " చెప్పారీ యంగ్ డెవలపర్ ..

కశ్మీర్ -యాప్

కాశ్మీర్ లోయ..కాలంతో పాటే మారుతూ వస్తోంది. ఐతే ఇక్కడ మారనిదల్లా ఒక్కటే ఘర్షణపూరితవాతావరణం..ఇదే విషయాన్ని చెప్తూ... " సమస్యలు అన్ని చోట్లా ఉన్నాయి. ఇక్కడంతా బానే ఉందని నేను చెప్పడం లేదు. ఐతే ప్రజల్లో మార్పు వస్తోంది. అది స్లోగానే కానీయండి. అసలు కదలకపోవడం కంటే... ఎంతో కొంత మూవ్ అవుతూ ఉండటం మంచిది కదా... ఆగిపోవడం కంటే.." అంటుంది. కాలంతో పాటే ఇక్కడ కూడా టెక్నాలజీ ప్రజల జీవనవిధానాన్ని మార్చుతుంది. వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఇక్కడ టెక్నాలజీ తెలిసిన జనం ఉండగా..ఇప్పుడా సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీ సాయంతో జనానికి ఉపయోగపడాలనే కోరుకునే వారూ ముందుకు వస్తున్నారు.

మెహ్వీష్ విషయానికే వస్తే..డయల్ కాశ్మీర్ యాప్‌కు మరిన్ని హంగులు అద్దాలని భావిస్తోంది. సినిమాలు..సీరియల్స్ చూడటంతో పాటు..సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు బ్రోజ్ చేయడం ఈ యంగ్ టాలెంటెడ్ హాబీలు.


మెహ్వీష్ ముస్తాక్ స్టోరీ మీకెలా అన్పించిందో మాకు మెయిల్ చేయండి..