మువ్వన్నెలతో ధగధగలాడిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా  

0

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం దుబాయ్ బుర్జ్‌ ఖలీఫా భారత త్రివర్ణంలో ధగధగ మెరిసిపోయింది. మన జాతీయ జెండా రంగుల విద్యుద్దీపాలతో 823 మీటర్ల ఎత్తున్న కట్టడాన్ని అలంకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ హాజరైన నేపథ్యంలో.. ఖలీపాను మువ్వన్నెలతో అలంకరించారు. ఈ మూడు రంగుల ఎల్ఈడీ కాంతులు అక్కడి కాలమానం ప్రకారం 25, 26వ తేదీల్లో సాయంత్రం 6.15కు, 7.15కు, తిరిగి 8.15కు జిగేల్మంటాయి. 

మేం ఇవాళ రాత్రి భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం అని బుర్జ్ ఖలీఫా అధికారిక ట్విటర్లో ప్రకటించింది.