ఆ ముప్పై నిముషాలు... ముగ్గురు కోల్కతా యువకుల జీవితాన్నే మార్చేసాయి

సరైన మార్గదర్శకం ఉంటే యువకులు ఏదైనా సాధించగలరు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారి కోసం ఓ సరికొత్త వేదికవ్యాపారులు, నిపుణులు, సామాన్యులను ఒకే వేదికపైకి చేర్చే ప్రయత్నం

0

ఎన్ఐటి వరంగల్ లో కలుసుకున్న రితేష్ సింఘానియా, సామిక్ బిశ్వాస్‌లు కోల్కతాకి చెందిన యువకులు. వీరు కాలేజీ దశలోనే ఇతర విద్యార్ధుల నుండి సలహాలు తీసుకునే వెసులుబాటు కల్పించే ఒక సాఫ్ట్‌వేర్ ప్రాడక్ట్ తయారీలో నిమగ్నమయ్యారు. గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్లిద్దరికీ ఎమ్ఎన్‌సిల్లో ఉద్యోగాలు వచ్చాయి. కానీ తమ కలల ప్రాజెక్ట్‌కి పూర్తి సమయం కేటాయించాలనే అభిలాషని వదులుకోలేదు. ఈ తరుణంలోనే కనాన్ పార్ట్ నర్స్‌కి చెందిన రాహుల్ ఖన్నాతో గూగుల్ హ్యాంగౌట్ చేసి ఒక ధృడమైన నిర్ణయానికి వచ్చేసారు.

“ఆ ముప్పై నిముషాలు, మేము పరిస్థితులని చూసే దృక్పథాన్ని మార్చేసాయి”, అంటున్నారు రితేష్. “మా ఆలోచన పరిధి మరింత విస్తృతమైంది, మా లక్ష్యాన్ని చేరుకునేందుకు స్పష్టమైన మార్గం కనబడింది”, అని కూడా చెప్తున్నారు. గౌరవ్ మిట్టల్ అనే మరో యువకుడితో ఈ ఇద్దరూ చేతులు కలిపారు. ముగ్గురు కలిసి ప్రాక్లీ ని స్థాపించారు. ప్రాక్లీ అనేది ఆంట్రప్రెన్యూర్ల కోసం రూపొందించిన ఒక సలహా వేదిక, ఇందులో ఒక ఫోన్ కాల్ లేదా ఒకరిని ఒకరు కలుసుకోవడం ద్వారా ఏదైనా వ్యాపార సమస్య కోసం డొమైన్ నిపుణులతో అనుసంధానమవ్వచ్చు. కొత్త ఆంట్రప్రెన్యూర్ల తో పాటు నిపుణులకు కూడా మేలు చేసే ప్రాజెక్టు ఇది.

సహాయం కోరుకునే యువ ఆంట్రప్రెన్యూర్లకి, సాధారణ వ్యక్తులకి కూడా వివిధ డొమైన్లకి చెందిన నిపుణులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది.

నిపుణులు తమ సమయాన్ని చక్కగా నిర్వహించుకుంటూ అపాయింట్‌మెంట్లని ఫిక్స్ చేసుకోవచ్చు, ఫలితంగా వివిధ ఆన్ లైన్ ఛానెల్స్‌లో ర్యాండమ్‌గా అభ్యర్ధనలకి సమాధానం చెప్పవలసిన అవసరం లేకుండా ఒక పద్ధతిని అనుసరించవచ్చు.

ముగ్గురూ కలిసి ప్రాక్లీని క్రమక్రమంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. జనాలకి మరింత చేరువవ్వాలని చూస్తున్నారు. “మేము కోల్కతాలో ఉంటున్నాం. కానీ సాంకేతిక కంపెనీలకి అది అంత అనువైన ప్రదేశం కాదు. పూణేలో ఇన్50హవర్స్ కి వెళ్దామని నిర్ణయించుకున్నాం, అక్కడ మాకు విజయ్ ఆనంద్ పరిచయమయ్యారు, తర్వాత ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కి ఎంపికయ్యాం,” అని చెప్పారు రితేష్. ఇంక్యుబేటర్ అనేది ప్రోడక్ట్ కి ఒక ఆకారమిచ్చి చాలా త్వరగా జనాల్లోకి వెళ్లేందుకు సహకరిస్తుంది. ఆర్ధిక లావాదేవీలు ఏమీ ఉండవు. ఎంపికైన కంపెనీల పురోగతిని వేగవంతం చేసి తదుపరి స్థాయికి (ఇలా ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఈవెంటిఫైర్) తీసుకువెళ్తారు.

2013 నవంబరులో ప్రారంభమైన ప్రాక్లీ ఇప్పుడు 25 మంది నిపుణులను ఆన్ బోర్డ్ లో కలిగిఉంది. “ఆన్ బోర్డ్ లో ప్రస్తుతం ఉన్న నిపుణులతో కలసి ఈ ప్రక్రియనంతా ఒక తాటిపైకి తీసుకొద్దామని భావిస్తున్నాం,” అంటున్నారు రితేష్. ప్రోడక్ట్ ని ప్రస్తుతానికి ఉచితంగా అందిస్తున్నా భవిష్యత్తులో నిపుణులతో కాల్ సెటప్ చెయ్యడానికి లేదా వాళ్లని కలిసేందుకు డబ్బులు వసూలు చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇప్పటికైతే, వెలుగులోకి రాని చాలామంది ప్రారంభ దశ ఆంట్రప్రెన్యూర్లు నిర్దిష్టమైన అంశాల్లో ప్రాక్లీలో సహాయం కోసం చూస్తున్నారు. ఆంట్రప్రెన్యూర్లు అందరికీ సాంకేతిక అవగాహన ఉండటం వల్ల మొదటగా ప్రోడక్ట్ ప్రామాణీకరణ ఈ రంగంలో చేస్తున్నారు. ఫలితాల ఆధారంగా మోడల్ బయటకు వస్తుంది.

“ఐడియా వ్యాలిడేషన్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఒ, గ్రోత్ హ్యాకింగ్ అనేవి ఇప్పుడు డిమాండ్ ఉన్న డొమైన్లు,” అంటూ తమ సైట్ లో ప్రారంభం నుంచీ ఉన్న యూజర్స్ ని చూసి చెప్తున్నారు రితేష్. కస్టమర్ ని సంపాదించడం ఎలా, ఒక ఐడియాని పరీక్షించడం ఎలా అనేవి ఇక్కడ చాలా సాధారణమైన ప్రశ్నలు. ఇక్కడ ప్లాట్ ఫామ్ అనేది రిఫరీ పాత్ర పోషిస్తుంది, సరైన సూచనలని అందిస్తుంది. “ప్రజల సలహాని తీసుకునేందుకు ఈ వేదికపై రావడానికి ఆంట్రప్రెన్యూర్లు కొద్దిగా తటపటాయిస్తున్నారు. సలహా తీసుకుంటే కొంత మొత్తం చెల్లించాలనే కానెప్ట్ ను వాళ్లు గతంలో ఎప్పుడూ వినకపోవడం వల్ల ఇలా జరుగుతున్నాది. కానీ ఈ వేదికని ఉపయోగించుకుంటున్నవారు మాత్రం చాలా లాభపడ్డారు,” అంటారు రితేష్. ఆంట్రప్రెన్యూర్ షిప్ తో దీన్ని అనుసంధానించి, ఆ తర్వాత ఇతర డొమైన్స్ లోకి కూడా వెళ్లడమే వీరి ఆలోచన.

Feeling good to present and getting inspired as well from "your story".

Related Stories