'గ్రోన్ అవుట్‌'తో HR మేనేజర్ల పని చాలా సులువు

విషయ పరిజ్ఞానం, సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించగలిగే ప్రతిభ, నైపుణ్యం, వృత్తికి కట్టుబడి ఉండటం, క్రమశిక్షణ...! ఏ సంస్థ అయినా... తమ ఉద్యోగస్థుల్లో కోరుకునే లక్షణాలు ఇవే..! అయితే ఎంతగా కాచి వడబోసినా.. నియామక ప్రక్రియలోనే సదరు వ్యక్తిలో తమకు కావాల్సిన క్వాలిటీలన్నీ ఉన్నాయో లేదో కనుక్కోవడం దాదాపూ అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ ప్రక్రియను సులభతరం చేయడమే కాదు... నియామకాలను మరింత ఆసక్తిగా మలుస్తామంటున్నారు ఢిల్లీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు. అదెలాగో మనమూ తెలుసుకుందాం.

'గ్రోన్ అవుట్‌'తో HR మేనేజర్ల పని చాలా సులువు

Tuesday June 23, 2015,

3 min Read

హైరింగ్‌లో అనుభవజ్ఞుల సిఫార్సులు కొంతమేర మంచి ఫలితాలనే అందిస్తున్నప్పటికీ.. అందులోనూ కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. అయితే.. పూర్తిగా మాన్యువల్ అయిన ఈ ప్రక్రియను సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ )మోడల్‌లో కంప్యూటరీకరించి "గ్రోన్ అవుట్" అనే సరికొత్త బిజినెస్ టు బిజినెస్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు సుమిత్ గుప్తా, హర్ సిమ్రన్ వాలియా అనే ఇద్దరు కుర్రాళ్లు. ఏ సంస్థకైనా తమ ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర నెట్వర్క్‌ను అందించడమే మా పని" అంటారు గ్రోన్ అవుట్ సీఈఓ కమ్ కో ఫౌండర్ సుమిత్ గుప్తా.

ప్రస్తుతం గ్రోన్ అవుట్ భారతీయ మార్కెట్ పైనే ఎక్కువగా దృష్టిసారిస్తోంది. మార్చ్ లో లాంచ్ చేసిన ఈ సంస్థ ప్రోడక్ట్ ను ప్రస్తుతం 12 B2B సంస్థలు వినియోగించుకుంటున్నాయి.

image


నాస్కాం గుర్తింపు పొందిన గ్రోన్ అవుట్

రాజస్థాన్‌లోని ఓ చిన్ని పట్టానికి చెందిన సుమిత్... ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. చంఢీఘఢ్ కు చెందిన హర్ సిమ్రన్ ఢిల్లీ IITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒరాకల్, మెకెఫీ వంటి సంస్థల్లో పనిచేశాడు. అయితే మంచి ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని సొంత బిజినెస్‌ను ప్రారంభించడంలో హర్ సిమ్రన్ ఎంతో ఒత్తిడికి గురయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే మునుపటిలా నెలనెలా తన అకౌంట్‌లో భారీ పే చెక్ పడదు సరికదా... తనకే ఎదురు ఖర్చు అవుతుంది. అయితే... సొంత పరిశ్రమను నెలకొల్పాలన్న జిజ్ఞాస... ఆ కష్టాలన్నీ ఇష్టంగా భరించేలా చేసింది.

"ప్రస్తుత వ్యవస్థను సమూలంగా మార్చేయాలన్నదే మా అంతిమ లక్ష్యం" అని అంటారు సుమిత్. నియామకాలపై తగినంత పరిశోధన చేసిన తరువాత.. ఆ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే కాకుండా.. ఆసక్తిగానూ మలచాలని నిర్ణయించుకున్నారు ఈ యువ వ్యాపారవేత్తలు.

2013 జనవరీలో గ్రోన్ అవుట్ ను తీర్చిదిద్దడం ప్రారంభించారు సుమిత్, హర్ సిమ్రన్. ఆల్ఫా, బీటా అభివృద్ధి దశలో చంఢీఘడ్, హిమాలయాల నుంచి పనిచేశారు. బీటా వర్షెన్ పూర్తైన తరువాత.. 2013 నవంబర్ లో తమ సంస్థను ఢిల్లీకి మార్చారు. "ఢిల్లీకి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి మా వ్యాపారంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. బీటా వర్షెన్‌ను పరీక్షించి, ఆమోదం పొందిన తరువాత మాకు పెట్టుబడులు లభించాయి. అంతేకాక నాస్కాం ఎంపిక చేసిన పదివేల స్టార్టప్స్‌లో మా సంస్థ కూడా చోటు దక్కించుకుంది. ఆ తరువాత షార్ట్ లిస్ట్ చేసిన 500 స్టార్టప్స్ లోనూ మా సంస్థ ఉంద"ని గర్వంగా చెబుతారు సుమిత్.

అలా ఇద్దరితో మొదలైన గ్రోన్ అవుట్ సంస్థలో ప్రస్తుతం ఏడుగురు సేవలు అందిస్తున్నారు.

బిజినెస్ మోడల్

"గ్రోన్ అవుట్ విన్నూత్నమైన ఆలోచన, ప్రక్రియకు పేటెంట్ పొందేందుకూ కృష్టి చేస్తున్నాం. ఎన్టెలో, విసిల్ వాక్, యెస్ గ్రాఫ్, రోల్ పాయింట్, మై పరిచయ్ మాకు బలమైన పోటీదారులు. ఈ సంస్థలు మా మార్కెట్ ను దెబ్బతీసే అవకాశం ఉందని'' చెబుతున్నాడు సుమిత్.

సుమిత్ అంచనా మేరకు ఈ రంగంలో రెండు రకాల నియామక ప్రక్రియలు ఉన్నాయి.

1. కాండిడేట్ సోర్సింగ్‌కు అవకాశం కల్పించేది

2. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందించేది

"అయితే గ్రోన్ అవుట్ మీకు అత్యంత సులభమైన మార్గాన్ని సూచిస్తుంది. దీని ద్వారా సంస్థలు తమకు కావాల్సిన నిపుణుడిని తమ సొంత సంస్థలోనే కనుగొనే వెలుసుబాటు కల్పిస్తోంది. ఒక్కసారి రిక్రూటింగ్ మేనేజర్ గ్రోన్ అవుట్ వేదికపైకి వస్తే... అతనికి మరో చోటుకు వెళ్లాల్సిన పనే ఉండద"ని వివరిస్తున్నాడు సుమిత్.

image


ప్రాథమిక స్థాయిలో క్లయింట్లకు తమ ఉత్పత్తని ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది గ్రోన్ అవుట్. తమ ఉత్పత్తి విలువ ఏంటో అర్ధమయ్యాక... నాలుగో నెల నుంచి కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంది. అయితే ధర కూడా నెలకు ఎంతమంది ఉద్యోగులు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.

సాంకేతిక పరిజ్ఞానంపై తమ క్లయింట్ లకు అవగాహన కల్పించడం గ్రోన్ అవుట్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. " మా ఉత్పత్తిని వినియోగించుకునేవారిలో చాలా మందికి సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. వారిలో ఎక్కువ మంది ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులనే ఆచరిస్తున్నారు. కాబట్టి, వారికి గ్రోన్ అవుట్ గురించి అవగాహన కల్పించడం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నద"ని అంటాడు సుమిత్.

"నూతనంగా ఏర్పాటైన సంస్థలకు ఓ బలమైన బృందాన్ని నిర్మించుకోవడం అనేది ఓ సవాలు లాంటిది. అదే గ్రోన్ అవుట్ కు కలసివచ్చే అంశం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో మేమే మొదటి అడగువేశామ"ని గర్వంగా చెబుతాడు గ్రోన్ అవుట్ సహ వ్యవస్థాపకుడు సుమిత్.