ముగ్గురు మిత్రుల 'చెత్త'శుద్ధి

చెత్తను వినియోగించకోవడం ఎలా ?

చెత్తతో వ్యాపారం.. పర్యావరణ సమతుల్యం

ముంబైలో ప్రారంభమైన చెత్త ఉద్యమం

దేశం మొత్తమ్మీద విస్తరిస్తామంటున్న ‘సంపూర్ణ్ ఎర్త్ ’

This story is a part of Portraits of Purpose series sponsored by DBS Bank.

0

కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కదేదీ కవితకనర్హం అన్నట్లు.. చేయాలే కానీ చెత్తతో కూడా వ్యాపారం చేయొచ్చని నిరూపిస్తున్నారు ఆ ముగ్గురు. అయితే దానికి సామాజిక చైతన్యాన్ని జతచేశారు. మంచిగా ఉండటం అంటే.. నువ్వు చేయాలనుకున్న పని చేసేయడమే. అని అబ్రహం సెట్రకియాన్ అమెరికాలో జరిగిన ఓ వ్యాంపైర్ షో లో చెప్పారు. “ప్రపంచాన్ని దెయ్యాలు, పిశాచాలు ఏమీ చేయలేవని.. చేసేదంతా మనుషులే అని ఆయన అభిప్రాయం. జనం పడేస్తోన్న చెత్తతో పర్యావరణానికి ఎన్నో రకాలుగా నష్టం జరుగుతోందనేది ఆన మాటల్లోని అర్థం. పర్యావరణంపై చెత్త ప్రభావం చాలా ఎక్కువగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి.

దెబర్త బెనర్జీ, జయంత్ నటరాజు, రిత్విక్ రావ్ భారతదేశంలో ఉన్న చెత్తను మార్చే పనిని మొదలు పెట్టారు. అయితే ఇందులో భాగంగా వీళ్లంతా అవగాహనా లేమితోపాటు విచక్షణపై పెద్ద యుద్దమే చేయాల్సి వస్తోంది. ఈ యుద్ధానికి వీరు ఉపయోగించే ఆయుధాలు తమ దగ్గరున్న ఇంజనీరింగ్, మాస్టర్ డిగ్రీలే. ‘సంపూర్ణ్ ఎర్త్’ పేరుతో ముంబై కేంద్రంగా ఓ స్టార్టప్‌ని ప్రారంభించారు. ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ చేస్తుంది.

దెబర్త బెనర్జీ, జయంత్ నటరాజు, రిత్విక్ రావ్
దెబర్త బెనర్జీ, జయంత్ నటరాజు, రిత్విక్ రావ్
“ మా పక్కింటివాళ్లు ఇంటిలో చెత్త పడేయడానికి రెండు రకాల బ్యాగులను ఉపయోగించమని చెబితే ముందుగా ససేమిరా అన్నారు. 6నెలల నిర్విరామ క్యాంపైన్ తర్వాత టీం ఎఫర్ట్ మార్పు తీసుకురాగలిగింది.” అని విజయ శ్రీనివాసన్ అనే క్లెయింట్ చెప్పుకొచ్చారు.

సుధీర్ఘ ప్రయాణం తర్వాత తాము కొత్త విషయాన్ని గుర్తించామనేది ఈ యువ ఇంజనీర్ల మాట. జనం ఆలోచనా విధానంలో మార్పులొస్తున్నట్టు గమనించారు. చెత్తను వారు డీల్ చేసే విధానంలో వస్తున్న మార్పులు చూస్తే వీళ్లలో కొత్త ఆశలు చిగురించాయి.

“శుభ్రత అనేది నా పెరట్లో నుంచే ప్రారంభించాలనే అంశం బాగా ప్రాచుర్యం పొందింది. ప్రత్యుత్పాదక సాధనాల ద్వారా వేస్ట్ మెటీరియల్‌ని తిరిగి ఎలా ఉపయోగించాలనే దానిపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశాం. ద్రవపదార్థ చెత్తని ఏ రకంగా వేరుచేయాలనే విషయాలు ఇప్పుడిప్పుడే జనం గ్రహిస్తున్నారు. మా నినాదాలు పబ్లిక్‌లోకి వ్యాప్తి చెందుతున్నాయి” అని కో ఫౌండర్, డైరెక్టర్ దేబర్త బెనెర్జీ అంటున్నారు.

చెత్తను వేరుచేసి తూస్తున్న మహిళా సిబ్బంది
చెత్తను వేరుచేసి తూస్తున్న మహిళా సిబ్బంది

భారతదేశం మొత్తం మీద లక్ష మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజూ బయటకు విడుదల అవుతోంది. ఇందులో తొంబై శాతం వ్యర్థాన్ని కనీసం పట్టించుకోవడంలేదు. ఇందులో కొంత శాతం డికంపోజ్ జరగడం వల్ల మీథేన్ వాయువులను గాల్లోకి వెదజల్లుతోంది. మరో విషయం ఏంటంటే చెత్తను తీసుకెళ్లే వారి వ్యవస్థ మరింత దారుణంగా ఉంది. సమాజం చక్కగా ఉండాలంటే.. ఆ సమాజం వెదజల్లే వ్యర్థాలను పద్ధతి ప్రకారం నిర్వర్తించే వ్యవస్థ ఉండాలి. అలా జరగాలంటే దానిపై మనందరికీ బాధ్యత ఉండాలి. మన చుట్టుపక్కల చెత్తను తీసుకెళ్లే వారిపై మనకుండే చిన్నచూపు మన వ్యవస్థను మరింత దిగజార్చేస్తోంది. సంపుర్ణ్ అర్త్ రోజువారి కూలికి వచ్చే వారికి డిగ్నిటీని ఇస్తుంది. గతంలో డంపింగ్ చేయడానికే పనిచేవారిగా ఉన్న వీరంతా ఇప్పుడు గుర్తింపు పొందిన ఉద్యోగులుగా ఉన్నారు. వీరి సంపాదన కూడా పెరిగింది. రీసైకిల్ వ్యవస్థను తయారు చేయడంలో వీరి పాత్ర ఎంతైనా ఉందనే చెప్పాలి. గతంలో చెత్త పనివారిగా ఉన్న వీరంతా.. ఇప్పుడు స్లీవ్‌ను ధరిస్తున్నారు. ఆ స్లీవ్ పై వేస్ట్ మేనేజర్స్ అని రాసి ఉంటుంది. ఇది వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

టీం విషయానికొస్తే.. దెబర్త పూణేలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తీరిక సమయాల్లో ఎన్‌జీఓలో కార్యకర్తగా చేసేవారు. సామాజికంగా పరిస్థితులను అర్థం చేసుకోడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. తీరిక సమయాల్లో చేసే పనైతే ఇది కాదని అప్పుడే ఆయన గుర్తించారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో సోషియల్ ఆంట్రపెన్యువర్‌షిప్‌లో మాస్టర్స్ తీసుకోవాలని నిర్ణయించుకొని అందులో చేరారు. సంపూర్ణ్ ఎర్త్ ఆలోచనకు బీజం పడింది ఇక్కడే. రిత్విక్, జయంత్, దేబర్తలు కలిసింది ఇదే ఇనిస్టిట్యూట్ లోనే. 

వీరిది 2010 మాస్టర్స్ బ్యాచ్. ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్, ఆంట్రపెన్యువల్ మనసుతో ఆలోచించారు. టెక్నాలజి సాయంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అనేది ముగ్గురిని ఒకేతాటిపైకి తీసుకొచ్చింది. ముగ్గురు పర్యావరణ ప్రేమికులే కావడం విశేషం. అంతే కాదు అభివృద్దిని కాంక్షించే వ్యక్తిత్వాలే. ఇవన్నీ కలగలసి చెత్త నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్‌) ప్రారంభమైంది. మొదటిదశగా చదువుకునే రోజుల్లో వాలంటీర్లుగా పనిచేశారు. కొన్ని ఎన్‌జీఓలకు ఫ్రీలాంసర్లుగా పనిచేశారు. ఈ క్రమంలోనే స్ట్రీట్ ముక్తి సంఘటన అనే ఓ స్వచ్ఛంద సంస్థకు పనిచేశారు. ఈ సంస్థ చెత్త తీసుకెళ్లే వారి హక్కుల కోసం పనిచేస్తుంది. దాంతో పాటు చెత్త నిర్వహణ కార్యక్రమాలను విరివిగా చేపట్టేది. చెత్త నిర్వహణ వ్యవస్థలోనే అసలు లోపం ఉందని గుర్తించారు. చెత్త తీసుకెళ్లే వారి దగ్గర నుంచి మార్పు తీసుకు రావాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.

చెత్తను వేరుచేసి కంపోస్టులా మారుస్తున్న మేనేజర్లు
చెత్తను వేరుచేసి కంపోస్టులా మారుస్తున్న మేనేజర్లు

“ ప్రస్తుత చెత్త నిర్వహణ వ్యవస్థను చక్కదిద్దితే.. అది పర్యావరణానికి మేలుచేస్తుంది. దీంతోపాటు సామాజికంగా చాలా రంగాలపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక పరంగా చూసినా లాభదాయకంగా కనిపించింది.”- దెబర్త

చెత్త నిర్వహణ అనేది గొప్ప సమాజానికి సరైన ఉదాహరణగా చెప్పొచ్చు. దీంతో ఎక్కువ మందికి చేరువ కావొచ్చు కూడా. కంపోస్టు ఎరువులు, బయోగ్యాస్, రీసైక్లింగ్ లాంటి పదాలు మనందరికీ తెలిసినవే. కానీ కొన్ని కంపెనీలు మాత్రమే దీన్ని ఫాలో అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం చెత్త నిర్వహణలో తప్పిదాలు చేస్తున్నాయి. వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలేయడం వల్ల పట్టణాల్లో కాలుష్యం పేరుకుపోతోందని దెబర్త ఆవేదన.

చెత్త నిర్వహణ వ్యవస్థను పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఈ గ్యాప్‌ని ఫిల్ చేయొచ్చనే విషయాన్ని టీం గుర్తించింది. టెక్నాలజీ సాయంతో చేద్దామనే ఆశాభావంతో ముందుకెళ్లిన ఈ ముగ్గురు ఔత్సాహకులు వ్యాపార రంగంలో చెత్త నిర్వహణతో కొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఎలాంటి లాభాలు రాని స్థాయినుంచి సంపూర్ణ్ ఎర్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాయికి ఎదిగారు. 

మన భాషలోని మూలాల్లోకి వెళ్లి కంపెనీ పేరును ఖరారు చేశారు కో ఫౌండర్లు రిత్విక్, జయంత్. సంపూర్ణ అంటే పూర్తి. అర్థ్ అంటే డబ్బు ఇక ఇంగ్లీష్ లో అర్త్ అంటే భూమండలం. దీనితోనే సంపూర్ణ్ అర్థ్ (Sampurn(e)arth ) తో కంపెనీ చెలమణీలోకి వచ్చింది. ఆర్థికంగా చూసినా, భూమికి చూసినా తమ కంపెనీ లాభాలు చేకూర్చేదే. 2012 నుంచి చూస్తే సంపూర్ణ్ అర్థ్ వేస్ట్ మేనెజ్‌మెంట్‌లోతనదైన స్టైల్లో దూసుకుపోతోంది. పర్యావరణానికి సేవచేస్తూ సాగిపోతున్న సంపూర్ణ్ అర్థ్ సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్లు, కార్పొరేట్స్,విద్యాసంస్థలు, నివాసిత భవంతులులతో కలసి పనిచేస్తుంది. ఇందులో బయో డీగ్రేడబుల్ వేస్ట్ అంటే కంపోస్ట్, బయోగ్యాస్ ప్లాంట్‌లతో పాటు నాన్ బయోడీగ్రేడబుల్ వేస్ట్ అంటే రీసైక్లెర్స్‌తో సమాజానికి చేతనైన సాయం చేస్తోంది.

దీంతోపాటు ముంబైలో డ్రైవేస్ట్ ట్రేడింగ్ సెంటర్ కోసం కొన్ని వెహికల్స్‌ని నడపుతోంది. పరోక్షంగా సంపూర్ణ్ అర్థ్ సాయాన్ని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పొందుతోంది. చెత్త సేకరించే ప్రక్రియలో పరిసర్ భాగిని వికాస్ సంఘ, డిబిఎస్ బ్యాంక్ ఇండియా క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నాయి. సంపూర్ణ్ అర్థ్‌కు ఆదాయ వనరులను సేకరించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. తమకు నష్టాలు రాకుండా డిబిఎస్ బ్యాంక్ చేతనైన సాయం చేస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీట్ అప్ ఏర్పాటు చేసి డ్రాబ్యాక్ లను అధిగమించడానికి సాయం చేస్తోంది అని దెబర్త అన్నారు

ఈ వెంచర్ చెత్తపై ఆడిట్ కూడా నిర్వహిస్తుంది. సప్లై రీసైకిల్డ్ పేపర్ స్టేషనరీ‌తో పాటు దాని ప్రభావం ఎంతవరకు ఉందనే విషయాన్ని విశ్లేషిస్తుంది,

“ముంబై పదివేల మెట్రిక్ టన్నుల చెత్తని ప్రతిరోజూ విడిచిపెడుతుంది. అంటే వేయి రకాల అవకాశాలు ఇస్తుంది. దేశం మొత్తం మీద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో బయో గ్యాస్‌లను ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. మా టార్గెట్ చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలే. చెత్త నిర్వహణ విధానాలను వారికి నేర్పించాలనుకుంటున్నాం” అని దెబర్త అన్నారు.

మాతో కలసి వచ్చే వారికి ఫ్రాంచైజీ ఇవ్వడం లేదా మా కంపెనీ తరుపున ప్లాంట్ నెలకొల్పడానికి మేం వెనుకాడటం లేదు. ఇటీవల రోజుకి 20 కేజిలు, 50 కేజీల బయో గ్యాస్ ప్లాంట్‌లను డెవలప్ చేశాం. మా భవిష్యత్ ప్రణాళికలు చాలా ఉన్నాయని దెబర్త అన్నారు.ఇప్పటికే మాకు మొదటి రౌండ్‌లో ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అందింది అని దెబర్త చెప్పుకొచ్చారు. తొందరలోనే దేశం మొత్తం మీద వందకు పైగా పట్టణాల్లో సంపూర్ణ్ అర్థ్ సేవలు ప్రారంభం కానున్నాయి. గడిచిన మూడేళ్లలో 80మంది క్లెయింట్లకు సర్వీసును అందించింది సంపూర్ణ్ అర్థ్. కేంద్రం ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి తాము రుణపడి ఉన్నమామని దెబర్త అన్నారు. స్వచ్ఛభారత్ తో వేస్ట్ మ్యానేజ్ మెంట్, క్లీనింగ్ రంగాలు బాగా లబ్ధిపొందాయని వివరించారు.

ఓడిపోతామనే భయం ఉంది చూశారా అది మహా చెడ్డది. ఆ భయమే మీ కల వెంట మీరు నడవడకుండా చేస్తుంది.ఆ . “ఏదైనా విలువైనది అనిపిస్తే.. దానికోసం వెళ్లడంలో తప్పులేదు. నువ్వు ఓడిపోయినా పెద్దగా నష్టపోవు. మహా అయితే ఓ రెండేళ్లు వెనక్కి వెళ్తావ్. కానీ నీలో చాలా మార్పు వస్తుంది. చాలా నేర్చుకుంటావు, తప్పని సరిగా మళ్లీ జయం సాధిస్తావు. ఇదే ఎంట్రపెన్యువర్ విజయ రహస్యం అని ముగించారు ఈ ముగ్గురు మిత్రులు

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik