సూటిగా సుత్తిలేకుండా డేటా చెబుతాం !!

సూటిగా సుత్తిలేకుండా డేటా చెబుతాం !!

Thursday November 19, 2015,

3 min Read

వేల సంఖ్యలు, లక్షల్లో లెక్కలు, కోట్లలో లెక్కింపు. అదంతా అర్థం కావాలంటే అరగంటసేపు ఆలోచించాలి. గంటసేపు ఆయాసపడాలి. జుట్టు పీక్కోవాలి. అప్పటికీ అర్థమైందా అంటే ఏమో! అంతా కన్ ఫ్యూజన్‌. ఇంతకీ ఏం చెప్తున్నామనేగా మీ సందేహం. అర్థమయ్యేలా చెప్పాలంటే - అర్థంకాని అర్థశాస్త్రాన్ని విడమరచి చెబుతామంటోంది హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్.

“స్టాటిస్టిక్స్ సాధారణంగా అర్థం కావు. వాటిని విజువలైజ్డ్ చేయడమే కాదు అర్థమయ్యే లా చూపించడం మా స్టార్టప్ ముఖ్య ఉద్దేశం.” కో ఫౌండర్ గణేష్

అంకెలతో ఎంతో కన్ ఫ్యూజింగ్ గా కనపడే లెక్కల్ని సులువుగా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ స్టార్టప్ ఓ ప్లాట్ ఫాం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ కోట్లలో ఉన్న అంకెల్ని వేల బొమ్మలుగా మర్చింది!

image


డేటా విజువలైజేషన్

కన్ సైస్ డాష్ బోర్డ్ రూపంలో డేటాని చూస్తే తొందరగా ఎవరికీ అర్థం కాదు. దాన్ని అందరికీ అర్థమయ్యేలా విజువలైజ్ చేయడమే గ్రామెనర్ పని. కాగ్నిటివ్ రీసెర్చి అనే ప్రక్రియ ద్వారా డేటాను సూటిగా చెప్తారు. చూడగానే ఆ డేటాలో ఏది ముఖ్యమైనదో ఇట్టే కనిపెడతారు. ఆ తరహాలో విజువలైజేషన్ చేస్తారు. క్రికెట్ లో సచిన్ సెంచరీల సంఖ్య చెప్పడం ఈజీయే. ఏఏ జట్టుపై ఏఏ వేదికలపై సెంచరీలు చేశాడనే విషయం చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ వస్తుంది. కానీ ఈ విజువలైజ్డ్ ప్రక్రియలో ఒక పేజీలో అంతా చెప్పేయొచ్చు. సెరేనా విలియమ్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఎన్ని కొట్టిందంటే లెక్క చెప్పొచ్చు. కానీ ఎవరెవరితో ఏఏ వేదికల మీద అంటే మాత్రం తడబాటు తప్పదు. అలాంటి తిక్కపుట్టించే లెక్కల్ని చక్కగా చూపిస్తాం అంటారు గణేష్.

image


గ్రామెనర్ టీం

గ్రామెనర్ లో ఆరుగురు కో ఫౌండర్లున్నారు. దానికి జె రామ్ సీఈవో. ఐబీఎం, బిర్లా సాఫ్ట్ లాంటి కంపెనీల్లో విశేష అనుభవం ఉంది. మరో కో ఫౌండర్ గణేశ్‌. అతను హెచ్‌సీఎల్, బిర్లా సాఫ్ట్ లో పనిచేశారు. నవీన్ గట్టు సిఓఓగా ఉన్నారు. ఆయన కూడా ఐబీఎం, బిర్లా సాఫ్ట్ లో పనిచేశారు. ఆనంద్ సీటీఓ బాధ్యతలు చూస్తున్నారు. అతను కూడా ఐబీఎం, బిర్లా సాఫ్ట్ లో పనిచేశారు. మయాంక్ సేల్స్ హెడ్ గా ఉన్నారు. ఆయనా బిర్లా సాఫ్ట్, అసెంచర్, ఐబీఎంలో పనిచేశారు. వెంకటేష్ సీఎఫ్ఓ. అతనికి టెక్ కంపెనీలో మంచి అనుభవం ఉంది. మరో కో ఫౌండర్ రవి కూడా ఐబీఎం లోపనిచేసిన వ్యక్తే. టీం మొత్తం ఐబీఎం సర్టిఫైడ్ కావడం విశేషం. హైదరాబాద్, బెంగళూరులో 100 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.

image


ఇప్పటి వరకూ అందించిన సేవలు

ఐదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ బిటుబి సెగ్మెంట్ లో తారా జువ్వలా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న డేటా అనాలసిస్ లో తమదైన మార్క్ సాధించుకోడానికి ముందుకు కదలుతోంది. డేటాలో ఉన్న హిడెన్ ఇన్ సైట్స్ ని తీసుకొని కటింగ్ ఎడ్జ్ విజువలైజేషన్ చేస్తారు. క్రిటికల్ బిజినెస్ ఫంక్షన్ కు కావల్సిన ఫోర్ సైట్ ను డెవలప్ చేస్తారు. సిఎన్ఎన్ లాంటి సంస్థలతో కలసి ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు. క్రికెట్ మ్యచ్ ల డేటాను అనాలసిస్ చేస్తారు. మనం క్రికెట్ అనాలిసిస్ టీవీ తెరమీద చూసేది ఈ పద్దతి లోనివే. లైసెన్స్ పొందిన సొంత ప్రాడక్టు ఇది. వాటినే అందరూ ఫాలో అవుతారు. రియల్ టైమ్ అనాలసిస్ తో ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాలను చూపించారు. సింపుల్ గా చెప్పాలంటే డేటాను వ్యక్తం చేయడానికి ఉపయోగించుకునే విజువల్ కమ్యునికేషన్ టూల్ ఇది.

లక్ష్యాలు, పోటీ దారులు

ఈ రంగంలో చాలాకన్సల్టెన్సీలు ఉన్నప్పటికీ విజువలైజేషన్ పరంగా గ్రామెనర్ కు పోటీ ఎవరూ లేరంటున్నారు గణేష్. ఇటీవల రియల్ టైం విజువలైజేషన్ చూశాక ఇతర ప్లేయర్స్ కూడా మాతో టై అప్ పెట్టుకోడానికి సుముఖత వ్యక్తం చేశారని అన్నారాయన. అయితే ఈ విజువలైజేషన్ మరింత సులువుగా మారే ప్రక్రియను అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దానిమీదనే వర్కవుట్ చేస్తున్నారు. ఎయిర్ టెల్, సిఎన్ఎన్, టైమ్స్ గ్రూప్ లాంటి క్లయింట్ ఉన్న మా సంస్థ బిటుబి సెగ్మెంట్ లో మరింత మందితో కలసి పనిచేస్తుందని వివరించారాయన.

image


భవిష్యత్ ప్రణాళికలు

అమెరికాలోని కాలిఫోర్నియాలో కొత్తగా సేవలను ప్రారంభించనున్నారు. సిలికాన్ వ్యాలీలో ఆఫీసు ఓపెన్ కానుంది. సేల్స్ యాక్టివిటీ 10 నుంచి 15 మందిని నియమించనున్నారు. ఏడాదిలో అక్కడ కూడా ఓ మార్క్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత గ్లోబల్ మార్కెట్ లో విస్తరించాలని అడుగులేస్తున్నామని గణేష్ అంటున్నారు.

“మేమిచ్చే విజువలైడ్జ్ డేటాతో ఎన్నో సంస్థలు వ్యాపారం చేస్తన్నాయంటే ఒక బీటుబీ కంపెనీకి అంతకంటే గొప్ప విజయం ఏముంటుందని ముగించారు గణేష్”