యూరోపియన్ మార్కెట్లో ఇండియన్ అల్ట్రావయలెట్

యూరోపియన్ మార్కెట్లో ఇండియన్ అల్ట్రావయలెట్

Saturday April 02, 2016,

3 min Read


మనదంతా బిజీ లైఫ్. తెల్లారితే మొదలు.. ఉరుకులు పరుగుల జీవితం. ఏం తింటున్నామో, ఎక్కడ తింటున్నామో తెలియదు. కేలరీలకు కేలరీలు కడుపులోకి తోసేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో జిమ్‌కు వెళ్లేందుకు, వర్కవుట్లు చేసేందుకు సమయమే దొరకడం లేదు. క్రమంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు ముగ్గురు యువకులు. ఆఫీసుకు వెళ్లడం, ఎక్సర్‌సైజ్ చేయడం ఒకేసారి చేసేలా ఓ సైకిల్‌ను రూపొందిస్తున్నారు. సైకిల్ అంటే సైకిల్ కాదు.. అలా అని మోటార్ సైకిల్ కూడా కాదు.. ఆరోగ్యానికి ఆరోగ్యం, పనికి పని. ఇలా రెండింటికి ఉపయోగపడేలా ‘అల్ట్రావయలెట్‌ను రూపొందించారు.

సైకిల్ తొక్కుకుంటూ ఆఫీస్‌కు వెళ్లడం.. వినడానికీ, చూడ్డానికీ వింతే. అయితే చెమటలు కక్కుతూ ఆఫీస్‌కు వెళ్లడాన్ని ఎవరూ కూడా ఇష్టపడరు. సైకిల్ తొక్కితే వచ్చే ఫిట్‌నెస్‌ను, స్కూటర్ లేదా మోటర్ వెహికిల్ మాదిరిగా ఉండే సౌలభ్యాన్ని అందిస్తే ఎలా ఉంటుంది. వినడానికి బావుంది కదా. వినడానికే కాదు వాస్తవరూపం కూడా దాల్చింది. ఇలాంటి వాహనాన్ని రూపొందిస్తున్నారు నారాయణ్ సుబ్రమణియన్, నీరజ్ రాజ్‌మోహన్, ప్రీతమ్ మూర్తి.

పట్టణ ప్రాంతాల్లో లైఫ్‌ స్టయిల్‌ను, రవాణా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించి, మంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించేందుకు అల్ట్రావయలెట్ టీమ్ గత ఏడాదిగా కసరత్తు చేస్తోంది.

షిఫ్టింగ్ గేర్స్..

స్వీడన్‌లోని ఉమేయాలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు ఆఫీసుకు వెళ్లేందుకు ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారో నారాయణ్ పరిశీలించేవారు. అలా, తన వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న ప్రీతంతో కలిసి అల్ట్రావయలెట్‌ను ప్రారంభించాలని నారాయణ్ నిర్ణయించారు. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ఈ అల్ట్రావయలెట్ ఉపయోగపడుతుందని ప్రీతం అంటున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతిసారీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం ప్రీతంకు కష్టమయ్యేది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని రూపొందించారు.

బెంగళూరులోని కోరమంగళలో ఓ చిన్న రూంలో పని ప్రారంభమైంది. అనుకున్న డిజైన్‌ను రూపొందించారు. అయితే వివిధ రకాల డిజైన్లను రూపొందించాలంటే భారీగా ఖర్చవుతుంది. అందుకే ముందుగా ఓ పెద్ద త్రీడీ ప్రింటర్‌ను తీసుకున్నారు. 

ట్విస్టర్ రూపొందించిన అల్టావాయిలెట్ టీమ్<br>

ట్విస్టర్ రూపొందించిన అల్టావాయిలెట్ టీమ్


చేంజింగ్ మొబిలిటీ..

ఈ ముగ్గురి లక్ష్యం ఒకటే. ప్రయాణికుడు సులభంగా, ఎలాంటి అసౌకర్యం లేకుండా గమ్యాన్ని చేరేందుకు ఉపయోగపడే వాహనాన్ని రూపొందించడం. అలాగే ఎక్సర్‌సైజ్ అవసరాలు కూడా తీర్చేలా ఉండాలి.

మోటార్ వాహనాలైతే మన జీవన శైలికి సరిపోవు. అలాగే ఎక్సర్‌సైజ్‌కు కూడా ఉపయోగపడవు. అలా అని సైకిల్‌పై ఆఫీస్‌కు వెళ్లడం ప్రతిసారీ సాధ్యపడదు. ఈ బిజీ లైఫ్‌లో ఈ రెంటికి సరిపోయే వాహనం అవసరం అని మేం భావించామని ప్రీతం చెప్పారు. ఈ ఆలోచనే ట్విస్టర్‌ను రూపొందించేలా చేసింది.

ట్విస్టర్ రూపకల్పన చాలా విభిన్నంగా ఉంటుంది. అది ఓ సైకిల్‌లా పనిచేస్తుంది. అలాగే బైక్‌లా కూడా వాడుకోవచ్చు. ఇందులోని ఫ్రేమ్స్ 180 డిగ్రీలు తిరుగుతాయి. ఇలా ఓ వైపు మిమ్మల్ని సైకిల్‌పై వెళ్తున్న మాదిరిగానే ఎక్సర్‌సైజ్ చేయిస్తుంది. అలాగే మరోవైపు బైక్‌పై వెళుతున్న అనుభూతిని కూడా కలిగిస్తుంది. దీని సీటింగ్ కూడా డిఫరెంటుగా ఉంటుంది. అటు సైకిల్‌లా కాకుండా, ఇటు బైక్‌లా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది. 

image


నిధుల సమీకరణ కోసం అల్ట్రావయలెట్ టీమ్ చాలా కష్టపడింది. మొదటగా ట్విస్టర్ నమూనాను రూపొందించారు. వివిధ రకాల సాఫ్ట్‌వేర్ వాలిడేషన్ల తర్వాత మోటర్లను, బ్యాటరీలను బిగించారు. అలాగే ట్విస్టర్ బాడీకి ఉపయోగించే చాలా కాంపోనెంట్లు త్రీడీ ప్రింటెడ్‌వి రూపొందించారు.

ప్రొటోటైప్ సిద్ధమైన తర్వాత ఇన్వెస్టర్లకు చూపేందుకు ఓ వీడియోను రూపొందించారు. చాలామందికి ఈ ఐడియా నచ్చింది. కానీ పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం ఒక్కరూ ముందుకు రాలేదు. రిస్క్ ఎందుకులే అనుకున్నారు. వారంతా ఏకాభిప్రాయానికి రావడానికి చాలా కాలమే పట్టింది. ‘ఇప్పటివరకు దేశంలో లేనటువంటి ట్రెండ్‌పై, మా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు మాకు అవసరం అని నారాయణ్ వివరించారు.

అనుకున్నట్టుగానే కొన్నాళ్లకి చెన్నైకి చెందిన ఓ ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఆ సమయంలోనే ట్విస్టర్.. ఎక్సలెంట్ డిజైన్ అవార్డును గెలుచుకుంది. గత ఏడాది మార్చిలో తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ బైక్ షోలో కూడా దాన్ని ప్రదర్శించారు.

అందరినీ ఆకట్టుకుంటున్న ట్విస్టర్ ఇదే.. <br>

అందరినీ ఆకట్టుకుంటున్న ట్విస్టర్ ఇదే..


అద్భుతమైన స్టయిల్..

ప్రొటోటైప్‌ను రూపొందించడం అంత సులువు కాదు. పేపర్‌పై చెప్పినట్టుగా.. అచ్చుగుద్దినట్టు దించడం చాలా కష్టం. ఎన్నోసార్లు, డిజైన్లు మార్చారు. వర్క్‌షాప్‌లో డిజైన్ అద్భుతంగా కనిపించినప్పటికీ, స్టూడియోలోకి వచ్చేసరికి అంత ఎఫెక్టివ్ గా లేకపోయేసరికి మాటిమాటికీ మార్చాల్సి వచ్చింది. ప్రమాదాలను అరికట్టేందుకు, కూలింగ్ కోసం బ్యాటరీ టెక్నాలజీలో థర్మల్ ఎఫీషయెన్సీని ఉపయోగించారు. అదే టెక్నాలజీని టెస్లాలో కూడా వాడారు. 

ఈ ఏడాది ట్విస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేయాలన్నదే వీరి ఉద్దేశం. ఇందుకోసం జర్మనీ, స్వీడన్, అమెస్టర్‌డ్యామ్‌లలో పైలట్ స్టడీస్ నిర్వహించారు. వివిధ యూనివర్సిటీలు, పట్టణాలకు వెళ్లి తమ ట్విస్టర్‌ను పరిశీలించారు. యూరోపియన్ మార్కెట్లలో ఈ బైక్‌ను 2017లో ప్రవేశపెట్టనున్నారు. దాని ధర 3,500 నుంచి 5000ల డాలర్లుగా నిర్ణయించారు. డిజైన్, మానుఫాక్చరింగ్, అసెంబ్లింగ్ అంతా ఇండియాలోనే జరుగుతుంది. కానీ తైవాన్, చైనా వెండర్లతో ఒప్పందం కుదుర్చుకుని యూరోపియన్ మార్కెట్‌లో దీన్ని విక్రయించనున్నారు. అలాగే భారతీయ జీవన శైలీకి ఉపయోగపడే సైకిల్‌ను కూడా రూపొందించాలని వీరు భావిస్తున్నారు. అందుకోసం వారి ఆర్ అండ్ డీలో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

ఈవీ మార్కెట్..

2022 కల్లా వంద గిగా వాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 70 లక్షల ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాలను 2020కల్లా రోడ్‌పైకి తీసుకొచ్చి, కాలుష్యాన్ని కూడా నియంత్రించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతో గిరాకీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రమ్మో, జీరో మోటార్‌ సైకిల్స్, బీఎండబ్ల్యూ, ఎలక్ట్రిక్ మోటార్‌స్పోర్ట్, హాలీవుడ్ ఎలక్ట్రిక్స్, యమహ, హార్లీ డేవిడ్‌సన్, లిటో వంటివి ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్‌లో ఉన్నాయి. కానీ వీటన్నిటికి భిన్నంగా ఉన్న అల్ట్రావయలెట్ ప్రపంచ వాహన మార్కెట్లో సంచలనం సృష్టించాలని యువర్‌ స్టోరీ ఆకాంక్షిస్తోంది.