పార్కింగ్ సమస్యలకు 'పీపార్క్' పరిష్కారం

పార్కింగ్ సమస్యకు పరిక్షారంగా నిలుస్తున్న పీపార్క్ఇంట్లో నుండి బయలుదేరడానికి ముందే మీ పార్కింగ్ స్పేస్ ను బుక్ చేసుకునే సౌకర్యం.

0

ప్రతీ మందుకూ ఓ సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు, అభివృద్ధితో పాటు సమస్యలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగుళూరులో సమస్యలు కూడా అదే విధంగా దర్శనమిస్తుంటాయి. ఎం.జీ రోడ్ వైపు ఓ సినిమా చూడాలని వెళ్లినా, మొదటి పది నిమిషాలు కేవలం పార్కింగ్ వెతుక్కోవడానికే సరిపోతుంది. పార్కింగ్ సమస్యలను తీర్చడానికి ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా... పెరుగుతున్న వాహనాల కారణంగా ఆ సమస్య అదే విధంగా ఉండిపోతోంది. మన దేశంలో పార్కింగ్ స్ధానాన్ని వెతుక్కోవడానికే 90 లీటర్ల ఇంధనం ప్రతీ గంటకు ప్రతీ వెయ్యి కార్లకు వృధా అవుతున్నట్టు సమాచారం. ఈ సమస్య పరిష్కారం కోసం బెంగుళూరుకు చెందిన ‘ప్రిస్టెక్ అనాలిటిక్స్’ అనే సంస్ధ వినూత్న పద్ధతిలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది.

‘Pparke’ (పిపార్క్) అనే పార్కింగ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించిన ‘ప్రిస్టెక్’, వాహనాదారులు ఇంటి నుండి బయలుదేరే ముందే తమ పార్కింగ్ స్లాట్‌ను బుక్ చేసుకునే విధంగా సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల పార్కింగ్ స్పేస్ ఓనర్లు, మాల్స్, యునివర్సిటీస్, ఎయిర్‌పోర్టుతో పాటు ఇతర ప్రాదేశాల్లో వాహనదారులకు సర్వీస్ ప్రొవైడర్స్‌కు అనుసంధానం చేస్తూ ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు.

పిపార్క్ టీమ్ సభ్యులు
పిపార్క్ టీమ్ సభ్యులు

భార్య భర్తలైన ప్రీతమ్ గంగూలి, షంపా గాంగులి 2013 ఆగస్ట్ లో ‘ప్రిస్టెక్ అనాలిటిక్స్’ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఐఐఎం బెంగుళూరు లోని ‘ఎన్.ఎస్.రాఘవన్ సెంటర్ ఫర్ ఆంట్రప్రెన్యూరల్ లర్నింగ్’ నుండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

గూగుల్ ప్లేతో పాటు యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న ఈ యాప్, యూజర్ బయలుదేరే ముందే తమకు కావాల్సిన పార్కింగ్ ప్రదేశాన్ని బుక్ చేసుకుని డబ్బులు కూడా కట్టే సౌకర్యం కల్పిస్తుంది. ఒక వేల సంబంధిత పార్కింగ్ ప్రదేశం లేకపోతే, అప్పుడు ఆ ప్రదేశానికి దగ్గర్లో ఉన్న పార్కింగ్ లాట్‌కి గైడ్ చేస్తుంది, ఒకవేల వాహనదారుడు కాన్సల్ చేసుకోవాలనుకున్నా, ఆ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

ఇక ఈ సిస్టమ్ గురించి మాట్లాడుతున్న గంగూలి, మీకు కావాల్సిన పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకుని మీరే డబ్బులు కట్టుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి బయట పార్కింగ్ నిర్వహకులు చార్జ్ చేసేంతనే తాము చేస్తున్నామని అంటున్నారు.

“ఇప్పటికే కొన్ని మాల్స్ మాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం 200 మంది వరకు ఈ సర్వీస్‌ని వాడుతున్నారు. వీకెండ్స్‌లో సెలవులో ఉండే స్కూల్స్, ఆఫిసుల్లో ఈ సిస్టం అమలు చేయాలని భావిస్తున్నాం” - ప్రీతమ్ గంగూలి.

మాల్స్ , ఇతర ప్రదేశాలే కాకుండా ఇతర పార్కింగ్ ప్రదేశాల కోసం ‘ప్రెస్టీజ్’ తో పాటు ‘గోపాలన్ ఎంటర్ ప్రైజెస్’ తో పొత్తు పెట్టుకున్నారు ప్రిస్టెక్ అనాలిటిక్స్, అంతే కాకుండా CISCO/ELCIA టీమ్స్ తో ఆప్ స్ట్రీట్ పార్కింగ్ విషయంలో పని చేస్తున్నారు.

ఈ రంగంలో అవకాశాలు పెద్దఎత్తున ఉన్నాయి. ఆర్గనైజ్డ్ పార్కింగ్ రంగం సుమారు 40 మిలియన్ డాలర్ల వ్యాపారం ఉండగా, అన్ ఆర్గనైజ్డ్ రంగం సుమారు 300 మిలియన్ డాలర్ల పరిశ్రమ ఉంది. అంతే కాకుండా ఈ రంగంలో ప్రతీ ఏటా 20 నుండి 30 శాతం ఎదుగుదల ఉందని అంటున్నారు ప్రీతమ్ గంగూలి.

ఇక ఇలాంటి మార్కెట్లో ‘సీపీఎస్’ (CPS parking for sure), ‘యూ పార్క్’ (Upark) వంటి సంస్ధలు రంగంలోకి దిగాయి. ఈ రెండు సంస్ధలు కూడా ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ లో విజయవంతంగా రాణిస్తున్నారు.

ఇలాంటి రంగంలో ఎంత మంది ఉన్నా సమస్య తీవ్రత పెద్ద ఎత్తున ఉండటంతో అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే వినియోగదారుడికి బయలుదేరే ముందే పార్కింగ్ స్పాట్ రిజర్వ్ చేసుకునే సర్విస్ కల్పిస్తున్న Pparke మిగితా వారితో భిన్నంగా పనిచేస్తుంది.

భవిష్యత్తులో మాత్రం ఇలాంటి స్టార్టప్స్‌కు పెద్ద ఎత్తున్న డిమాండ్ ఉండటం మాత్రం ఖాయం. ఎందుకంటే పార్కింగ్ అనేది ప్రతీ ఒక్కరు ఎదురుకునే సమస్య, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కొత్త విధానాలే ఈ సమస్యకు పరిష్కారం.

Sr. Correspondent @ yourstory.com

Related Stories