3డి ప్రింటింగ్ మరో శకానికి నాంది - మోహన్‌దాస్ పాయ్

3డి ప్రింటింగ్ మరో శకానికి నాంది - మోహన్‌దాస్ పాయ్

Sunday November 22, 2015,

2 min Read

ఇంటర్నెట్ ఓ గొప్ప ఆవిష్కరణ. ఇప్పటి వరకూ 350కోట్ల మందిని కలుపుకుపోయిందని ఇన్నోఫెస్ట్ బోర్డ్ ఎక్స్‌మెంబర్ , ఏంజిల్ ఇన్వెస్టర్ మోహన్ దాస్ పాయ్ అన్నారు. హైదరాబాద్ లో ఇన్నో ఫెస్ట్ కొత్త ఆవిష్కరణలు... సరికొత్త మార్గాన్ని చూపాలని ఆయన ఆకాంక్షించారు.

“త్రీడీ ప్రింటింగ్‌తో భవిష్యత్తులో ఊహించని మార్పులొస్తాయి” - మోహన్‌దాస్ పాయ్
image


ఒకప్పుడు రక్షణ అవసరాలకు ఉపయోగించే త్రీడీ ప్రింట్ తర్వాత ఇండస్ట్రియల్ అవసరాల కోసం వ్యాపించింది. ఇప్పుడు సామాన్యుడి జీవితాల్లోకి ప్రవేశిస్తోందిని వివరించారు. తమ షాపునకు కావాల్సిన వస్తువులను షాప్ వద్దనే తయరు చేసుకునే సౌలభ్యం దీనితో సాధ్యమవుతుందని, ఎడ్యుకేషన్, మానుఫ్యాక్చర్ ఇండస్ట్రీలలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు. త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పటికే వైద్యరంగంలో తన దైన మార్క్ తీసుకొస్తోంది. భవిష్యత్ లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు.

image


“నాలెడ్జ్, వినూత్న ఆవిష్కరణలకు భారత్ పుట్టినిల్లు.” కెటిఆర్

నాలెడ్జ్ అంటే మన దేశం నుంచి వేరే దేశాలకు విస్తరించిందని కెటి రామారావు అన్నారు. ఇన్నో ఫెస్ట్‌కు హాజరైన ఆయన పాశ్చాత్య దేశాలు వాటిని తమకే సొంతమని ఆపాదించుకున్నాయని చెప్పుకొచ్చారు. మార్కెటింగ్ చేసుకోవడంలో అమెరికా ముందుంది కనుకనే అంతా అమెరికా వెంట పడుతున్నారని అన్నారాయన.

image


రాబోయేది ఇంటర్నెట్ మరో శకం

ఇంటర్నెట్ వాడకం పల్లె ప్రాంతాల్లో కూడా ఎక్కువైందని భవిష్యత్‌లో ప్రపంచ వ్యాప్తంగా 700కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతారని మోహన్ దాస్ అన్నారు. ప్రపంచంలోనే ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందన్న ఆయన మన దేశంలో ఇంటర్నెట్ మరింత వ్యాపిస్తుందన్నారు. మానుఫ్యాక్చర్, ఎడ్యుకేషన్, మెడికల్ రంగాల్లో ఇంటర్నెట్ తీసుకొచ్చే మార్పులతో మానవ జీవితాలు మరింత సౌకర్య వంతంగా మారిపోతాయన్నారు.

image


వినూత్న ఆవిష్కరణాలకు వేదిక

ఆవిష్కారాలే స్టార్టప్ కంపెనీల ప్రారంభానికి ఆయువు పట్టు లాంటివి. టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ ఏ రంగమైనా కొత్త ఆవిష్కరణతో ఆ రంగం ముందుకు దూసుకెళ్తుంది. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుని ప్రారంభమైన స్టార్టప్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతంగా విస్తరించాయి. ఇన్నో ఫెస్ట్ లాంటి కార్యక్రమాలు ఇలాంటి కంపెనీలు ప్రారంభానికి ఎంతగానో ఉపయోగపతాయి. ఈ వేదికలో దాదాపు 60కి పైగా కొత్త ఆవిష్కరణలు ప్రదర్శనకు పెట్టారు. ఫండింగ్ విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి ఫెస్ట్‌లు జరుగుతుంటే టెక్నాలజీలో వస్తోన్న మార్పులను గమనించడానికి ఓ ప్లాట్‌ఫాం దొరికినట్లవుతుంది. హైదరాబాద్ లో రెండో సారి జరిగిన ఇన్నో ఫెస్ట్ గతసారి కంటే వినూత్నంగా కనిపించదనడంలో ఎలాంటి సందేహం లేదు.

image


టీ హబ్ లో జరిగిన ఇన్నో ఫెస్ట్ ను ట్రిపుల్ ఐటి , హైసియా, హైదరాబాద్ ఏంజిల్స్, టై సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.