రూ. 60 వేల కోట్ల వెల్‌నెస్ మార్కెట్లో అవకాశాలు వెతుక్కుంటున్న 'జిమ్‌పిక్'

రూ. 60 వేల కోట్ల వెల్‌నెస్ మార్కెట్లో అవకాశాలు వెతుక్కుంటున్న 'జిమ్‌పిక్'

Tuesday July 14, 2015,

3 min Read

ఒకే తరహా వ్యాపారాలన్నిటినీ.. ఒక ప్లాట్‌ఫాం పైకి తెచ్చి విజయం సాధించచ్చనే విషయాన్ని జొమాటో నిరూపించింది. అనేక రంగాల్లో ఇలాంటి కంపెనీలు చాలా కంపెనీలు. హెల్త్, ఫిట్‌నెస్ రంగాలకు సంబంధించి, ఇలాంటి సేవలు అందిస్తూ అగ్రిగేటర్‌గా ఎదుగుతోంది జిమ్‌పిక్. హెల్త్, ఫిట్‌నెస్ సెంటర్స్‌కు సంబంధించిన వివరాలను.. అటు ట్రైనర్స్/ప్రొఫెషనల్స్‌తోపాటు.. ఇటు వినియోగదారులకు వీలుగా మార్చి... ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపుతానంటోంది జిమ్‌పిక్.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), అంతర్జాతీయం కన్సల్టింగ్ సంస్థ ప్రైస్‌ వాటర్‌‌హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మన దేశంలో ఫిట్‌నెస్, స్లిమ్మింగ్ మార్కెట్ విలువ 2012లోనే రూ. 60వేల కోట్లు.


జిమ్‌పిక్ టీం

జిమ్‌పిక్ టీం


ఫిట్‌నెస్ పరిశ్రమకు సంబంధించిన అన్ని అంశాలకు.. వన్ స్టాప్ సొల్యూషన్‌గా నిలవాలన్నది జిమ్‌పిక్ ప్రధాన లక్ష్యం. మీరు నివసించే నగరంలో జిమ్ సెంటర్స్ నుంచి మొదలుకుని, ఏరోబిక్ క్లాసెస్, మార్షల్ ఆర్ట్స్ సెంటర్స్, డ్యాన్స్ క్లాసెస్ వరకూ... హెల్త్, ఫిట్‌నెస్‌కు సంబధించిన డేటా ఇందులో లభిస్తుంది. అటు కస్టమర్లు, ఇటు ప్రొఫెషనల్స్...ఇరువర్గాలకు ఉపయోగపడేదే జిమ్‌పిక్.

అవసరం నుంచి పుట్టిన ఆలోచన

తన స్నేహితుడి కోసం ఫిట్నెస్ ట్రైనర్‌ను వెతికాల్సి వచ్చినపుడు చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది. పర్సనల్ ట్రైనర్లను వెతకడమే కాదు.. మంచి ఫిట్‌నెస్ సెంటర్లను వెతకడం కూడా చాలా కష్టమనే విషయం.. ఈ సమయంలో అతనికి అర్ధమైంది. కస్టమర్ల డిమాండ్‌కు.. అందుబాటులో ఉన్న సెంటర్లకు మధ్య.. సమాచార లోపం ఉందని తెలుసుకున్నారు అమరేష్. అప్పుడు ఫిట్‌నెస్ సెంటర్ల జాబితాతో సైట్ రూపొందించాలని భావించి జిమ్‌పిక్ ఆలోచన చేశారాయన. ఆగస్ట్ 2013లో ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి... అజయ్, అమరేష్‌ ఓఝాలు కలిసి సహవ్యవస్థాపకులుగా జిమ్‌పిక్‌ను ప్రారంభించారు.

“హెల్త్, ఫిట్‌నెస్ సెంటర్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తాం. ఆయా సెంటర్లకు సంబంధించిన హెచ్‌డీ ఇమేజెస్, 360డిగ్రీ వ్యూతో పనోరమా పిక్చర్స్, మెంబర్‌షిప్ డీటైల్స్, ట్రైనర్ ప్రొఫైల్స్‌తో పాటు... యూజర్ రివ్యూలు, రేటింగ్స్ కూడా అందిస్తాం. ఇదంతా మా సైట్‌లో లభించే సమాచారంలో కొంత మాత్రమే. మా ప్రధాన బలం డేటా కాదు టెక్నాలజీ. తమకు అనుకూలమైన సమచారాన్ని వెతికేవారికి... గూగుల్ మ్యాప్స్ ఆధారంగా సర్వీసులు అందిస్తాం. యూజర్లు తమకు ఎంత దూరంలో ఫిట్‌నెస్ సెంటర్ కావాలో ఇన్‌పుట్ ఇస్తే... ఆ రేడియస్ లోపు ఉన్నవాటి వివరాలు అందుతాయి” అని చెప్పారు అమరేష్.

వెల్‌నెస్ రంగంలో వెల్‌విషర్

బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోనే 6వేలకు పైగా సెంటర్లు, 4 వేలకుపైగా ట్రైనర్లు... జిమ్‌పిక్ వెబ్‌సైట్‌లో లిస్ట్ కావడం విశేషం. త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించబోతోంది జిమ్‌పిక్. తాము జొమాటో స్థాయి ప్లాట్‌ఫాంగా ఎదగాలన్నదే లక్ష్యంగా చెబ్తున్నారు అమరేష్. ఇతర సైట్లకు, తమకు ఉన్న వ్యత్యాసం.. తమ దగ్గర మాత్రమే లభించే అంతర్గత సమాచారం అంటారు నిర్వాహకులు. ఫిట్‌నెస్, వెల్‌నెస్ పరిశ్రమలో... అతి పెద్ద మార్కెట్ ప్లేస్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అమరేష్.

“మా సైట్ ద్వారా జిమ్, యోగా క్లాసులు, ట్రైనర్లను తెలుసుకోవడం, వారిని కాంటాక్ట్ చేయడం తేలికగా మారింది. రోజుకు 2 వేలకుపైగా విజిటర్లు మా సైట్‌ను విజిట్ చేస్తున్నారు. వీరిలో చాలామంది ఆయా సెంటర్లను, ట్రైనర్లను కాంటాక్ట్ చేస్తున్నార”ని చెప్పారు అమరేష్.

వెంచర్ ప్రారంభించాక తొలి 6 నెలలపాటు సొంత నిధులతోనే సైట్ నిర్వహించారు ఫౌండర్స్. తర్వాత 1.35 లక్షల డాలర్లను సీడ్ ఫండ్‌ రూపంలో పెట్టుబడులుగా పొందారు. సాంకేతికతను, బిజినెస్ టీంను పెంచుకోవడానికి ఈ నిధులను వెచ్చించారు.

అమరేష్ ఓఝా

అమరేష్ ఓఝా


జిమ్‌పిక్‌ జర్నీలో జామర్స్

ప్రస్తుతం హెల్త్ &ఫిట్‌నెస్ విభాగంలో అధిక భాగం అసంఘటిత రంగంగా ఉంది. ఈ సమాచారాన్ని ఒక చోటకు తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. అలాగే ఆయా సెంటర్లలో లభించే సౌకర్యాలు ప్రకారం ధరలతో పోల్చడం సరికాదు. .

“ఈ పరిశ్రమలో విధానాల కొరత కనిపిస్తుంది. ధరలు ఇంత అని నిర్ణయించడానికి బెంచ్‌ మార్క్‌లు లేవు. ఆయా వ్యక్తుల అర్హతలు, సౌకర్యాలను బట్టి రేట్ల నిర్ణయం జరుగుతుంది. ఏవైనా రెండు ఫిట్‌నెస్ సెంటర్లను ఎంపిక చేసుకుని... సైట్‌లో లభించే సమాచారం ఆధారంగా.. వాటిని పోల్చుకునే అవకాశం కల్పించాం”అని చెప్పారు అమరేష్.

తాము ఇతరులకు మార్గదర్శకం చేయగలిగే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నామంటారు జిమ్‌పిక్ ఫౌండర్స్. వ్యవస్థాగతంగా లేని ఈ పరిశ్రమను సక్రమంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు తమ దగ్గరున్నాయంటారు అమరేష్. దీన్ని పరిష్కరించుకునేందుకు చేపట్టిన కార్యక్రమాలు... వెబ్‌సైట్ అభివృద్ధికి ఎన్నోరకాలుగా సహాయపడ్డాయి.

మరో ఏడాది కాలంలో క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్ ప్లాట్‌ఫాం, మొబైల్ యాప్‌లోనే డైట్ కౌన్సిలింగ్, పర్సనల్ ట్రైనింగ్ సహా.. 5 రకాల వ్యాపారాలను లాంఛ్ చేయబోతోంది జిమ్‌పిక్. వెల్‌నెస్ సెక్టార్ అభివృద్ధి చెందుతున్న తీరు కూడా... ఇలాంటి డేటా ఆధారిత కంపెనీలకు సహాయం చేస్తోంది. “మేం సర్వీసులు అందించే ప్రాంతాల సంఖ్యతోపాటు.. సేవలను కూడా గణనీయంగా పెంచాలని భావిస్తున్నాం. అగ్రిగేటర్ పరిశ్రమలో.. మా కంపెనీ పేరు మార్మోగే స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామ”ని చెప్పారు అమరేష్.

వెబ్‌సైట్