ఈ 'జనాగ్రహం'తో అభివృద్ధి కంటికి కనిపిస్తుంది

మనం కోరుకునే మార్పును మనమే ముందుండి సాధించుకుందామంటున్న ‘జనాగ్రహా’.‘ఐ చేంజ్ మై సిటీ’ వెబ్సైట్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ‘జనాగ్రహా’

0

మనలో చాల మంది మార్పు కోరుకుంటారు. ముఖ్యంగా పట్టాణాల్లో ఆ అవసరం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అలా అనుకునే ప్రతీ ఒక్కరూ కలిసి కృషి చేస్తేనే ఏ పనీ అసాధ్యం కాదు. ఈ మార్పు కోసమే టెక్నాలజీ సహకారంతో ‘జనాగ్రహా’ అనే స్వచ్చంధ సంస్ధను ఏర్పాటు చేసారు రమేష్, స్వాతీ రామనాధన్.

వీధులకు రంగులద్దుతున్న బ్రైట్ హై స్కూల్ విద్యార్థులు
వీధులకు రంగులద్దుతున్న బ్రైట్ హై స్కూల్ విద్యార్థులు

‘ఐ చేంజ్ మై సిటీ’

‘ఐ చేంజ్ మై సిటీ’ జనాగ్రహా ద్వారా ప్రారంభించిన ఓ సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఇక్కడ యూజర్ సామాజిక అంశాలపై చర్చ జరపడంతో పాటు, పౌర సమస్యలపై లోతైన సమాచారం కూడా అందిస్తుంది. స్ధానిక కార్యాలయాల వివరాలు, నాయకుల వివరాలు, పోలింగ్ బూత్ వివరాలు వంటి సమాచారమూ అందుబాటులో ఉంటుంది.

ఐ ఛేంజ్ మై సిటీ టీమ్ కృషి ఫలితం ఈ అందమైన బెంచ్
ఐ ఛేంజ్ మై సిటీ టీమ్ కృషి ఫలితం ఈ అందమైన బెంచ్

పౌర సమస్యలు తీరుస్తున్న సైట్

పౌర సమస్యలపై ఫిర్యాదులు తీసుకునే ఓ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఈ సైట్. ఇక్కడ పౌరులు ఎవరైనా సరే స్ధానికంగా కనిపించే పాత రోడ్లు, మద్యం షాపులతో ఉండే ఇబ్బందులు వంటి సమస్యలను పోస్ట్ చేయొచ్చు. ఆ సమస్యలపై చర్చ జరిపి పరిష్కారం రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఎవరైనా నేరుగా తమ సమస్యలను వెబ్ సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా పోస్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే ఆ సమస్యకు సంబంధించిన ఓ ఫోటో కూడా జత చేస్తే స్పందన బాగుంటుంది. ఈ ఫిర్యాదు చేసిన వెంటనే ఆ సమస్య వివరాలను సంబంధిత కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడంతో పాటు ఆ సమస్యపై తీసుకున్న యాక్షన్ గురించి కూడా సైట్లో అప్డేట్ చేస్తారు. మీకు స్ధానికంగా ఉండే ఏ సమస్య అయినా సరే ఒక్క ఫోటో తీసుకుని ఫిర్యాదు చేయడంతో పాటు ఆ సమస్య వల్ల మీరు ప్రత్యక్షంగా బాధపడ్తున్నారా... లేదా... అని వివరిస్తే కూడా బాగుంటుంది. ఒకే సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారని తెలిస్తే ఆ సమస్య మిగితా వాటి కన్నా తొందరగా పరిష్కరించేందుకు అవకాశాలు ఉన్నాయి.

వివేక్‌నగర్ శాంతినికేతన్ స్కూల్ పక్క సందులో ఒకప్పుడు ఇదీ పరిస్థితి
వివేక్‌నగర్ శాంతినికేతన్ స్కూల్ పక్క సందులో ఒకప్పుడు ఇదీ పరిస్థితి

‘ఐ చేంజ్ మై స్ట్రీట్’

ఇటీవల ‘ఐ చేంజ్ మై సిటీ’ బెంగుళూరు విభాగం, అక్కడి వీధులను శుభ్రంగా ఉంచడంతో పాటు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ‘ఐ చేంజ్ మై స్ట్రీట్’ అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చింది. పది వేల మందికి పైగా స్కూల్ విద్యార్ధులు, 220 స్కూళ్లు, తల్లి దండ్రులు, వాలంటీర్లు, పౌర అధికారులు, టీచర్లు, రాజకీయ నాయకులతో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, 20 మంది కౌన్సిలర్లు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌లో స్కూల్ విద్యార్ధుల ఉత్సాహం ఎక్కువగా కనిపించింది, “ఈ విషయం తెలిసినప్పటి నుండే ఇందులో పాల్గొనాలనే ఆసక్తి మరింతగా పెరిగిందని, మేము శుభ్రపరుస్తున్న రోడ్లు మాకే కాకుండా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడ్తాయని అంటున్నారు శ్రీ సాయి ఇంగ్లిష్ స్కూల్ విద్యార్ధి సూర్య”.

జనాగ్రహ క్యాంపెయిన్ తర్వాత అదే సందుకు కొత్త శోభ
జనాగ్రహ క్యాంపెయిన్ తర్వాత అదే సందుకు కొత్త శోభ

ఇక్కడి ప్రజలు రోడ్లు వేయించడం దగ్గరి నుండి, స్ట్రీట్ బెంచులు పెట్టించడం, వీధుల్లో శుభ్రపరచడం, ఇంటింటికీ వెళ్లీ ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రచారం వల్ల ‘ఐ చేంజ్ మై సిటీ’ పేజ్‌కి 50 వేల సైనప్స్ రావడంతో పాటు సామాన్య ప్రజల నుండి కూడా మంచి స్పందన లభిస్తోంది.

“మన పిల్లల్ని డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు, సైంటిస్టులు అవ్వాలని ప్రొత్సహిస్తూ ఉంటాము. కాని ఎవరు కూడా మంచి పౌరులుగా మారాలని చెప్పడం లేదు. మన పిల్లల్ని మార్పు కోసం పోరాడాలనే శిక్షణ ఇవ్వాలి. ‘ఐ చేంజ్ మై స్ట్రీట్’ క్యాంపెయిన్ ఇప్పుడు సివిక్ క్యాలెండర్‌లో ప్రతీ సంవత్సరం జరిగే ఈవెంట్ గా మారింది'' - జనాగ్రహ కో ఫౌండర్ స్వాతీ రామనాధన్
Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD