ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి యూటీవీ అధినేతగా జరీనా ప్రస్థానం

మషూర్ మహల్ సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా మీడియా రంగంలోకి ఎంట్రీ..రెండు దశాబ్దాల పాటు యూటీవీలో సక్సెస్‌ఫుల్ జర్నీ..గ్రామీణ సాధికారితే లక్ష్యంగా అడుగులు ..స్వదేశీ ఫౌండేషన్ తో స్వప్న సాధనకు ప్రయత్నం..

ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి యూటీవీ అధినేతగా జరీనా ప్రస్థానం

Wednesday July 22, 2015,

5 min Read

భారతీయ వ్యాపార రంగంలో అడుగుపెట్టేందుకు మహిళలు భయపడుతున్నరోజుల్లో జరీనా స్క్రూవాలా గొప్ప ముందడుగు వేశారు. 1990లో యూటీవీని స్థాపించారు. రోనీ స్క్రూవాలాతో కలిసి యూటీవీ నెలకొల్పారు. రెండు దశాబ్దాల తర్వాత వాల్ట్ డిస్నీ కంపెనీ 450 మిలియన్ అమెరికన్ డాలర్లకు యూటీవీని కొనుగోలు చేసింది. ఇది చాలు ఎంత విలువైన వ్యాపార వ్యవస్థను ఆమె నిర్మించారో అర్థం చేసుకోవడానికి. ఆమె తన విజయరహస్యాలను మనతో పంచుకున్నారు.

గురువుల నుంచి విలువలు నేర్చుకున్నా..

ముంబైలో జేబీ పెటిట్ గర్ల్స్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేశాను. మా ప్రిన్సిపల్ చాలా దార్శికతతో ఆలోచించేవారు. స్త్రీలు కూడా బయటకు వెళ్లగలరని..ఎదైనా సాధించగలరని ఆమె నమ్మేవారు. 60వ దశాబ్దంలోనే ఆమె అలా ఆలోచించేవారు. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎంతగా ఆమె మా జెనరేషన్ లో బాలికల్ని ఇన్ స్పైర్ చేశారో. ఊరికే పాఠాలు బట్టీ పట్టడం వల్ల ఉపయోగం ఉండదని అమె చెప్పేవారు. దేన్నైనా లోతుగా పరిశీలించాలని, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలనేవారు. ఇక నా రెండో గురువు పర్ల్ పదమ్‌సీ. పర్ల్ నిర్మించిన ఓ నాటకానికి ప్రొడక్షన్ మేనేజర్‌గా నా కెరీర్‌ని ప్రారంభించాను. నాటకరంగంలో అద్భతమైన పతిభ కల్గిన వ్యక్తాయన. బిడియం నిండిన నన్ను ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడేలా నన్ను తీర్చిదిద్దారు. ఇవాళ నేను పాటిస్తున్నవిలువలు చాలా వరకు కెరీర్ మొదట్లో నా గురువులు నేర్పించినవే.

జరీనా స్క్రూవాలా

జరీనా స్క్రూవాలా


అలా మొదలైంది

మషూర్ మహల్ టెలివిజన్ షోకి అసిస్టెంట్ డైరక్టెర్ గా పనిచేస్తావా అంటూ నా ఫ్రెండ్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడే నా బుర్రలో వ్యవస్థాపకురాలవ్వాలన్న ఆలోచన పుట్టింది. దూరదర్శన్ తో సంబంధంలేని వ్యక్తులు నిర్మిస్తున్న మొదటి టెలివిజన్ షో అది. అదే ఆరంభం, అప్పటినుంచే మీడియా, టెలివిజన్ పట్ల ఇష్టం మొదలైంది. నా కెరీర్‌లో మొదటిరోజు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు ఉదయం ఏడు గంటలకే ప్రొడక్షన్ హౌస్ కి వెళ్లాను,మర్నాడు ఉదయం ఏడు గంటలకు తిరిగొచ్చాను. అప్పుడు నిజంగా చాలా ఎక్సైటెడ్ గా ఫీలయ్యాను.

కష్టమైన ప్రయాణం

ఆంట్రప్రెన్యూర్‌గా ఎవరికైనా తొలి పాఠాలు మర్చిపోలేనివి. ముఖ్యంగా ఆరంభ రోజుల్లో ఎన్నోకష్టనష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక అందమైన విజయగాధను చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మొదటి అడుగు నుంచే విజయాలు ఎదురొచ్చాయని అనుకుంటాం. కానీ నా ప్రయాణం చాలా కఠినమైంది. చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్నది అదే సమయంలో ఫన్ కూడా ఉంది. ఆ టైమ్ లో నేను నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ మర్చిపోనివి. ప్రజలు విజయగాధలు గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. కానీ ప్రతీ విజయం వెనుక ఆనేక అపజయాలుంటాయి. మనపై ఎప్పుడూ మనకు నమ్మకముండాలి. అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగాలి. తొలి రోజుల్లో విజయాలకంటే ఓటములే సహజంగా పలకరిస్తుంటాయి. సో ఫెయిల్యూర్స్ చూసి భయపడకూడదు. ప్రత్యేకించి మనదేశంలో పరాజయాల నుంచి బయటపడడం కష్టం. ఎవరైనా మీ విజయాల గురించి మాట్లాడుతున్నారంటే మీ పరాజయాల గురించి వారికి తెలుసు.

గ్రామ సాధికారతపై ఫోకస్

2011లో యూటీవీ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏం చేయాలన్నదానిపై ఆలోచించడం మొదలు పెట్టాను. మరో కొత్త, పెద్ద సవాల్ ని స్వీకరించాలనుకున్నాను. అలా స్వదేశ్ ఫౌండేషన్ పుట్టింది. ప్రతీ ఐదేళ్లకు పది లక్షల మందిని పేదరికం నుంచి విముక్తి కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యూటీవీ నుంచి బయటకొచ్చేటప్పుడే పలు సమస్యలపై బాగా ఆలోచించాను. సంస్థను విడిచిపెట్టడం ఒక విధంగా నాకు పెద్ద సవాళ్లను స్వీకరించే శక్తిని,బలాన్ని ఇచ్చింది. మా ప్రాజెక్ట్ కోసం గ్రామాలను ఎంపిక చేసుకున్నాం. అభివృద్ధికి నోచుకోని ఏరియాలపై ఫోకస్ పెట్టాం. గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు, అవకాశాలు కూడా ఉండవు. ఇతరుల్లా మంచి విద్యనభ్యసించే ఆప్షన్లు ఉండవు. వాళ్లకు నేర్చుకోవాలని, మంచి అవకాశాలు రావాలని ఆశ ఉంటుంది. అలాంటి వారి కోసం మేం చాలా ఆలోచించాం. వారి సమస్యల పరిష్కారానికి 360 డిగ్రీల కోణంలో అప్రోచ్ కావాలని మాకు తెలుసు. సో మేం ఓ అభివృద్ధి నమూనా తయారు చేశాం. ముందుతరాలకీ ఉపయోగపడేలా అదే సమయంలో అందరికి వర్తించేలా మా ప్లాన్లు తయారుచేశాం. ముఖ్యంగా కమ్యునిటీ మొబలైజేషన్ పై మేం పోకస్ పెట్టాం, జీవనోపాధి మార్గాలైన వ్యవసాయం, విద్య తో పాటు ఆరోగ్యపరిరక్షణపై శ్రద్ధపెట్టాం. మాదగ్గర 108 మందితో కూడిన టీమ్ ఉంది అందులో 80 మంది ఫీల్డ్ లో ఉంటారు. మేం గ్రామీణ సాధికారితపై ఫోకస్ పెట్టాం . ఎవరికి వారే సొంతంగా అవకాశాలు కల్పించుకునేలా ప్రజల్లో సాధికారిత కల్గించడమే మా టార్గెట్.

ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలకు సైకిళ్ల విరాళం

ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలకు సైకిళ్ల విరాళం


మీకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి

మహిళా వ్యవస్థాపకులకు నా సలహా ఏంటంటే ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానికోసమే కృషిచేయాలి. లక్ష్యసాధనలో ఎన్నో సందేహాలు కలుగుతాయి, వాటి ప్రభావానికి గురికాకుండా ఉండాలి. నిర్దేశించుకున్న లక్ష్యం నుంచి పక్కకు మళ్లకూడదు. మొదట్లో విఫలం చెందుతాం. అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. వైఫల్యం ఎదురైనప్పుడల్లా లక్ష్యాలను మార్చేసుకుంటే మీరు ఏదీ సాధించలేరు. కొన్ని సార్లు మీరనుకున్న లక్ష్యానికి గడువుకన్నా ముందే చేరవచ్చు ఇంకొన్నిసార్లు వెనకబడవచ్చు. టైమింగ్ ముఖ్యం, కీలకం. టైమింగ్ సరిగా లేకపోతే ఒకసారి పునరాలోచించుకోవాల్సిందే. మీ సమస్యలు ప్రజలతో ముడిపడినవైతే సరిచేసుకోవచ్చు, ఆర్దిక సమస్యలైనా కరెక్ట్ చేయవచ్చు, కానీ మీరు చేస్తున్న బిజినెస్ గురించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మంచి ఛాలెంజ్ ని ప్రేమిస్తా

గొప్పదాన్ని అయిపోవాలని నేనెప్పుడూ అశ పడలేదు. కానీ మంచి సవాళ్లను ఎప్పుడూ ప్రేమిస్తాను. సవాళ్లను అధిగమించడం నాకు ఇష్టం, కానీ నన్ను నేను ఆత్యాశగలదాన్ని అని మాత్రం అనుకోను. ఈ రెండు పూర్తిగా విభిన్నమైనవి. ఎవరైనా గొప్పవ్యక్తి అవ్వాలనుకుంటే తప్పకుండా విజయం సాధించాలి. కానీ నేనేప్పుడూ విజయాల కోసం పరిగెత్తలేదు. చాలా కష్టమైన పనిని చేయడానికి మాత్రమే నేను ఇష్టపడతాను. UTVలో ఉన్నప్పుడు మేం భారత దేశ మీడియా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాం. కొత్త ఛానళ్లు, కార్యక్రమాలతో దూసుకెళ్లాం. 2004 పిల్లల కోసమే ప్రత్యేకంగా ‘హంగామా టీవీ’ని లాంఛ్ చేశాం లో రెండేళ్లలో కిడ్స్ ఛానల్స్ గ్రూప్ లో ఫస్ట్ ప్లేస్ కి చేరుకుంది హంగామా టీవీ. UTV Bindaas కూడా అంతే విజయం సాధించింది. హంగామా సక్సెస్ తో విదేశాల్లోనూ ఇలాంటి ఛానల్స్ ప్రారంభించేందుకు మేం సహకారం అందించాం. ఆటంకాలను దాటుకుంటూ, నవకల్పనలను అందుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవడం చాలా గొప్ప విషయం. నా ప్రయాణంలో ఆ ఛాలెంజెస్ ని ఎంజాయ్ చేస్తూనే సమర్ధవంతంగా ఎదుర్కొన్నాను.

మీ కష్టానికి ఫలితం విజయం అయితే అదిచాలా గొప్ప విషయం. స్వదేశ్ ఫౌండేషన్ తరపును ఇవాళ నేను చేస్తోంది చూడండి. ఐదేళ్లలో పది లక్షల పేదలను ఉద్దరించాలన్నది మాలక్ష్యం. ఇది చాలా పెద్ద ఆశయం నిజంగా ఎంతో ఎక్సైట్ మెంట్ కలిగిస్తోంది.

image


అవకాశాలు తలుపుతట్టని వారికోసం వెతుకుతా...

నా ఉద్దేశ్యంలో ఎవరైతే మంచి ప్రొఫెషనల్స్ ని తయారు చేస్తారో వారు మంచి వ్యవస్థాపకులను సృష్టించగలరు. నావరకైతే అనుకున్న పని ఎనర్జీ, ఫ్యాషన్ తో పూర్తి చేయడమే ముఖ్యం. ఎవర్నైనా ఒక పనిలో నియమించాలనుకున్నప్పుడు జీవితంలో తక్కువ అవకాశాలు పొందిన వ్యక్తిని ఎన్నుకుంటాను. అతనికి సానుకూల దృక్పదం ఉందోలేదో చూస్తాను. చాలా మందికి మంచి బిజినెస్ స్కిల్స్ ఉంటాయి, అనుభవం, మంచి పనితనం కూడా ఉంటాయి. కానీ వాటితో పాటు సానుకూల దృక్పధం ఉన్నవారే విజయాలు సాధిస్తారు. పాజిటివ్ గా ఉండడమంటే సాధుత్వమని పొరపడేరు. సానుకూల దృక్పథం అంటే ముందున్న సవాళ్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం అయినా విజయం సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం. ‘నేను స్వీకరించిన సవాలు అంత సులువైంది కాదు..అందులో ఎన్నో ఇబ్బందులున్నాయి. అయినా మార్గం వెతుకుతున్నా, విజయం సాధిస్తా’ ఇలా ఆలోచించే వ్యక్తి కోసమే నేను చూస్తున్నాను. మంచి బృందాలను నిర్మించడం నా జీవితాశయం. సమాజంలో మనకు కావాల్సిన లక్షణాలున్న వ్యక్తి కోసం చూస్తుంటాం. వారిలో విజయం సాధించడానికి నిర్దేశించిన గుణాలున్నాయోలేదో చూసుకుంటాం. టీమ్ ని నిర్మించడమంటే మంచి సమాచార వ్యవస్థ కలిగి ఉండడం. అన్నివేళలా పై స్థాయి నుంచి కిందిస్థాయివరకు శాశ్వతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను స్థిరపర్చడమే టీమ్ నిర్మాణం. మనతో ఉన్న వారితో గౌరవంగా, మర్యాదగా మసలుకోవడం కూడా అందులో భాగమే.

స్వదేశ్ ఫౌండేషన్ సభ్యులతో ముచ్చటిస్తూ..

స్వదేశ్ ఫౌండేషన్ సభ్యులతో ముచ్చటిస్తూ..


కుటుంబం, స్నేహితుల కోసం సమయం కేటాయించండి

మీకోసం కొంత సమయం కేటాయించండి. అలానే మీ కుటుంబం, స్వేహితులకప కొంత టైమ్ ఇవ్వండి. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం కూడా ముఖ్యమే. పుస్తకాలు చదవడం, ప్రశాతంగా ఓ కప్పు కాఫీ తాగడం ఇలా మీకు ఏది చేస్తే మీరు పునరుత్తేజితులు అవుతారో అది చేయండి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు, వీటిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. మీరు ఎంత హార్డ్ వర్కైనా చేయండి కానీ వీటిని మాత్రం ఎప్పుడూ పాటిస్తూ ఉండండి.