పనికిరాని సామానుతో లగ్జరీ కారు..! బీఎండబ్ల్యూ కూడా దానిముందు బలాదూర్..!!

స్వదేశంలో త‌యారవుతున్న ల‌గ్జ‌రీ కార్లు..కోరిన విధంగా. .కోరిన మోడ‌ల్‌లో..

పనికిరాని సామానుతో లగ్జరీ కారు..! బీఎండబ్ల్యూ కూడా దానిముందు బలాదూర్..!!

Thursday February 04, 2016,

3 min Read

ఆడి కారులో ఉండే స్పేస్‌, బీఎండ‌బ్ల్యూలో ఉండే హుందాత‌నం..రోల్స్ రాయ‌స్‌లో ఉండే సీటింగ్‌.. ఏది కోరుకుంటే అది.. ఎలా కోరుకుంటే అలా. అన్ని కార్లూ మ‌న‌ద‌గ్గ‌రే ఉన్న‌ట్టుంటుంది. ఒక కారులోనే అన్నీ ఉంటాయి. అలాంటి కార్ల‌ను ఓ కంపెనీ త‌యారుచేస్తోంది. న‌గ‌లు, బ‌ట్ట‌లే కాదు.. ఎలాంటి కార్ల‌యినా స‌రే.. మీ ఊహ‌కు త‌గ్గ‌ట్టు రెడీ చేసేస్తారు. టైర‌ల్ ద‌గ్గ‌ర్నుంచి సీటింగ్ వ‌ర‌కూ అన్నీ క‌స్ట‌మైజ్ చేస్తారు. డ్రీమ్స్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన మీ డ్రీమ్‌కార్‌ను క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రిస్తారు. ఇండియాలో మేడ్ టు ఆర్డ‌ర్ ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్ధ హెచ్ఐ ప్రైవేట్ లిమిటెడ్ ఘ‌న‌త ఇది! కాక‌పోతే కేవ‌లం ఇన్విటేష‌న్ మీద‌నే వీళ్లు కార్ల‌ను త‌యారుచేస్తారు.

“ ఎలా కావాలంటే అలా మీకు కావాల్సిన మాస్ట‌ర్‌పీస్‌ను త‌యారుచేస్తాం. అయితే, అది ప్ర‌ప‌చంలో మీ ఒక్క‌రి ద‌గ్గ‌రే ఉంటుంది. ” అంటారు కంపెనీ ఫౌండ‌ర్ డైర‌క్ట‌ర్ 36 ఏళ్ల హృద‌యేష్‌.. “మారిష్ స్ట్రీట్‌” ఈ కంపెనీ త‌యారుచేసిన ఫ‌స్ట్ హ్యాండ్ లగ్జ‌రీ కార్‌.

బ్యాంకింగ్ నుంచి కార్ల త‌యారీ వ‌ర‌కూ..

గ‌తంలో ప్రైవేట్ బ్యాంకింగ్ చేసిన హృద‌యేష్‌.. ఆ స‌మ‌యంలో చాలా మంది రాయ‌ల్ ఫ్యామిలీల వ్యాపార లావాదేవీల‌ను చూసేవారు. ఆ కుటుంబాల్లోని వారు లగ్జ‌రీ, లిమిటెడ్ ఎడిష‌న్ కార్లు కొనాల‌నే హాబీని ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించారు. అయితే, అంద‌రూ టాప్ ఎండ్ ల‌గ్జ‌రీ కార్ల‌వైపే మొగ్గు చూపిస్తుండ‌డంతో.. స్వ‌దేశీ ల‌గ్జ‌రీ కార్ల‌ను త‌యారుచేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింది.

“ ఏదైనా ల‌గ్జ‌రీ వ‌స్తువును కొనాల‌నే కోరిక చాలామందికి ఉండేది. దీంతో ప్ర‌ప‌పంచ‌వ్యాప్తంగా కార్ల‌పై స‌ర్వే నిర్వ‌హించాం. ఆ స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల‌తోనే హెచ్ఐ కంపెనీ స్ధాపించి మాస్ట‌ర్‌పీస్‌ల‌ను త‌యారు చేయాలోనే ఆలోచ‌న వ‌చ్చి.. ఆచ‌ర‌ణ‌లో పెట్టాం ” అని హృద‌యేష్ చెబుతున్నారు.

హైద‌రాబాద్‌లోని బీహెచ్ఈఎల్‌లో దాదాపు 34 ఏళ్ల పాటు ఎన్నో ఇంజినీరింగ్ డివిజ‌న్స్‌లో ప‌నిచేసిన త‌న తండ్రి ఎం.లాల్‌ను సంప్ర‌దించి..ఈ కంపెనీని మొద‌లుపెట్టారు. హెచ్ ఐ కంపెనీలో ప్ర‌తీ కారు ఎందుకూ ప‌నికిరాని స్క్రాప్ నుంచి త‌యారుచేసినా.. దేనిక‌దే వైవిధ్యంగా ఉంటుంది. డిజైన్‌, నిర్మాణం, మెషిన‌రీ, ప‌ర్‌ఫార్మెన్స్‌, ఫినిష్‌..ఇలా ప్ర‌తీ అంశాన్ని క‌స్ట‌మ‌ర్ అభిరుచుల మేర‌కు త‌యారుచేస్తుంది ఈ కంపెనీ.

ఈ స్టోరీ కూడా చదవండి

Morris Street @ Jaipur

Morris Street @ Jaipur


ఆర్డ‌ర్లు ఎలా?

ఇప్ప‌టికే ఫేమ‌స్ అయిన ఏ మోడ‌ల్‌నీ కూడా ఈ కంపెనీ న‌క‌లు చేయ‌దు. అలా అని మ‌ళ్లీ అవే ఫీచ‌ర్స్‌తో త‌యారు చేయ‌దు. మిగ‌తా కంపెనీల వ్యాపారంలా షాపుల్లో అమ్మ‌రు. కేవ‌లం ఎవ‌రైనా కోరితే మాత్ర‌మే ఆ స్పెసిఫికేష‌న్స్‌తో త‌యారుచేస్తారు.

ఎవ‌రికైనా ఇలాంటి క‌స్ట‌మైజ్డ్ కార్లు కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ పెట్టాలి. టీమ్ ఆ ఆర్డ‌ర్‌ను ప‌రిశీలించి క‌స్ట‌మ‌ర్‌కు ఏం కావాలో అర్ధంచేసుకుంటారు. ఆ త‌ర్వాత అస‌లు.. ఆ స్పెసిఫికేష‌న్స్‌తో కారు త‌యారుచేయ‌డం కుదురుతుందా లేదా అనేదాన్ని అంచ‌నావేస్తారు.

“సీతాకోక‌చిలుక‌లాగా ఉండే ఒక కారు కావాల‌ని క‌స్ట‌మ‌ర్ కోర‌తాడు. అది మ్యూజియంలో చూడ్డానికి బాగుంటుందేమో కానీ.. రోడ్ల‌మీద విచిత్రంగా అనిపిస్తుంది” అంటారు హృద‌యేష్‌.

ఎన్‌సీఆర్ లేదా ముంబైలోని త‌యారీ ప్లాంట్ల‌లో కార్ల‌ను ఎక్కువ‌గా త‌యారుచేస్తున్నారు. ఒక‌వేళ మెషిన‌రీ విష‌యంలో క్ల‌యింట్ ఖ‌చ్చితంగా ఏద‌యినా కావాల‌ని కోరితే.. వాటినే కార్ల‌లో అమ‌రుస్తారు. ప్ర‌పంచంలో ఎక్క‌డి నుంచైనా కారు కావాల‌ని ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ చేయ‌చ్చు కానీ.. త‌యారీ మాత్రం ఇండియాలోనే జ‌రుగుతుంది.

ఇండియ‌న్ బ్రాండ్ నెల‌కొల్ప‌డ‌మే ల‌క్ష్యం.

ప్ర‌స్తుతానికి బిజినెస్ ప్రారంభ‌ద‌శ‌లోనే ఉన్నా కూడా.. ఆర్ధిక‌, టెక్నాలజీ, టాలెంట్ లాంటి అంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవ‌డంతో పాటు ఇత‌ర కంపెనీల‌తో చేతులు క‌లిపి.. తమ వ్యాపారాన్ని విస్త‌రించాల‌న్న‌దే ల‌క్ష్యంగా పెట్టుకుందీ కంపెనీ. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 300 ల‌గ్జ‌రీ కార్ల త‌యారీకి ఇన్విటేష‌న్లు వ‌చ్చాయ‌ని, మ‌రికొన్ని వినూత్న ప్రాజెక్ట్‌ల‌పై త‌మ టీమ్ ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు. ఒక కారు ఖ‌రీదు అటూ ఇటుగా రూ.6 నుంచి రూ.6.5 కోట్ల వ‌ర‌కూ అవుతుంది. క‌స్ట‌మ‌ర్ క‌స్ట‌మైజేష‌న్‌ని బ‌ట్టి పెర‌గ‌చ్చు, త‌గ్గ‌చ్చు..

యువ‌ర్‌స్టోరీ విశ్లేష‌ణ‌

క్రెడిట్ రేటింగ్ ఏజ‌న్సీ ICRA ప్ర‌కారం.. ఇండియాలో ల‌గ్జ‌రీ కార్ల వ్యాపారం 30వేల కార్ల నుంచి ల‌క్ష కార్ల వ‌ర‌కూ చేరుకుంటుంది. దేశంలో 1.8ల‌క్ష‌ల మంది కోటీశ్వ‌రులు ఉన్నార‌ని.. ఈ సంఖ్య మ‌రింత వేగంగా విస్త‌రిస్తోంద‌ని కూడా రిపోర్ట్ పేర్కొంది. మ‌రోవైపు మ‌ధ్య‌త‌ర‌హా, చిన్న ప‌ట్ట‌ణాల్లో కూడా ఈ మ‌ధ్య‌కాలంలో త‌మ కార్ల సేల్స్ ఎక్కువ‌య్యాయ‌ని బీఎండ‌బ్ల్యూ ప్రెసిడెంట్ ఫిలిప్ ప్ర‌కటించారు. ఈ లెక్క‌న చూస్తే ల‌గ్జ‌రీ కార్లు త‌యారుచేయాల‌న్న హెచ్ ఐ కంపెనీ ఐడియా రాబోయే కాలంలో వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

అయితే, మార్కెట్ పెరుగుతుంటే.. పోటీ కూడా పెరుగుతుంద‌న్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2014-15 ఏడాదిలో మ‌న దేశంలో ఆడి కంపెనీ 11,292 కార్ల‌ను అమ్మితే.. మార్సిడీస్ బెంజ్ 11, 213 కార్ల‌ను అమ్మిన‌ట్టు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపాయి. అంత‌కుముందు ఏడాదికంటే ఈ సంఖ్య 10శాతం ఎక్కువ‌.

ప్ర‌ప‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పెద్ద‌పెద్ద కంపెనీలే ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతున్నాయి. ఈ మ‌ధ్య‌లో దేశీయంగా ల‌గ్జ‌రీ కార్ల‌ను త‌యారుచేస్తున్న హెచ్ ఐ ఎక్క‌డ నిల‌బ‌డే అవ‌కాశాలున్నాయి? అయితే, తాము లిమిడెట్ ఎడిష‌న్ దాకా వెళ్ల‌కుండా కేవ‌లం ఒక సింగిల్ కారు త‌యారుచేయ‌డ‌మే త‌మ‌ను అన్ని కంపెనీల నుంచి వేరుచేసి నిల‌బెడుతుంద‌ని అంటున్నారు హృద‌యేష్‌.

వెబ్‌సైట్

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి